తుగ్లక్ పాలనె బెటరేమో…..

రచన :నూతక్కి

తేదీ: 10-02-2010

ఎన్నడో నా చిన్నప్పుడు

చరిత్ర పాఠాలలో

చదువుకున్న చేదు నిజం

పళ్ళుంటె పంటిపన్ను

జుట్టుంటే బొచ్చుపన్ను

కాళ్ళుంటే నడకపన్ను

నిలుచుంటే నీడపన్ను

పన్నేసిన తుగ్లకు రాజ్యపు

గురుతులు మది మరువలేదు.

కానీ

ఆ తుగ్లకె మెరుగిప్పుడు

ఎంతెంతో నయమిప్పుడు

ఓట్లేసి ఎన్నుకున్న

ప్రజలు

తమ నెత్తిన తలకెత్తుకున్న

ప్రభుత్వాల సరళి చూడ

అమ్మ బాబో మనకొద్దని……….

రూక రూక కూడగట్టి

తిన్నా తినకున్నా భవితన

స్వంతగూడు కట్టుకొనే

యోచనలో ఓ భూ భాగం

కొనుక్కున్న వెనువెంటనె

గూటిని నిర్మించలేక

పైస పైస కూడగడుతు

ఖాళీగా వుంచుకొంటె……

వురుము లేని పిడుగులా

ఖాళీ జాగా పన్ను!!!.

అనుమతులన్నీ పొంది

ఏళ్ళ క్రితమె కట్టినా

కట్టుడులో తప్పులనీ

తాటొలిచేలా పన్నులు

ప్రజల పళ్ళూడగొడుతు

ప్రజల చేత, ప్రజల కొరకు

ఎన్నికైన ప్రభుత్వాలు

నిశ్ఛింతగ యే ఒక్క క్షణం

ప్రజల బ్రతకు సాగనీని

విక్రుత చేష్టన ప్రభుతలు

బాబోయ్ తుగ్లకె నయమని

అతడే కావాలంటూ

గుడిలో,చర్చిలో,

మసీదునందున,

గురుద్వారమున

యిటనట యేమిటి

తము నమ్మిన

విధాతను ప్రార్ధిస్తూ

ప్రజాస్వామ్య వ్యవస్తలో

భంగపడ్డ దీనజనులు

భవన నిర్మాణపదశలో

పునాది దశన ప్రతినిత్యం

లంచాలు మరిగి

అక్రమాలు నియంత్రించలేని

పారదర్శకతను చూపలేని

అధికారులకేది శిక్ష?

రిజిస్ట్రేషన్ దశన తమ జేబులు

నింపుకొంటు, జరిగే పొరబాట్లను

ఆపలేని అధికారుల కేది శిక్ష?

అందులకే అందరం

కోరుకొంటున్నాం

తుగ్లక్ పాలనె కావాలని