ఆంధ్రోళ్ళింట బుడుతున్ననుకుంట

 (నా యాస భీ మారాలెగద.)

రచన: నూతక్కి,

తేదీ: 12-02-2010

పోన్రి , మమ్మల్ని గుప్పెట్లకెల్లిసిరేసిండు. ఏడికి ? నువ్వేడ బోవాలనుకుంటున్నవు? ఇండియాల ఆంధ్ర ప్రదేశ్. నే నేడ జచ్చొచ్చిన్నో గాడికి. గట్లనేబో, గని యే ఇంట్ల దిగాల్నో గాడేమేంజెయ్యాల్నో మేంజూసుకుంటం.పరేశాన్గాకు. నాలెక్కనే అడిగినోల్లంరికి జెప్పిండు. ఆడి పేరేందో? యింత దన్క ఆని గుప్పెట్లొ మేమెట్ల ఇమిడున్నమో,అంతమందిమి యెట్ల పట్టినమో ! బెమ్మ దేవుడో ,మరేందో… గట్లనే అనుకుంట…ఆడు భీ మా తెలెంగోని లేక్కనే కొడుతుండు. ఎవల్లో ఇసిరేసినట్టు, బోతునే వున్న. ఏగం సాన ఏగం….ఎటు బొతున్ననో, సివరికి ఓ సీకటి కొట్ల జొర్రినం గాడంతట తడి,యెచ్చెచ్చగ మంచిగనె వుంది.సిమ్మ సీకటి.నేనొక్కన్నె. గవేందొ గుడ గుడ సెబ్దాలు. ఎరకైతలేదు.ఏడకొచ్చిన్నో. ఏడికెల్లో మాటలినబడ బట్టినయ్ గని మాతెలంగాన మాటల్లెక్క గొద్తలేదు. ఆంద్రోల్ల మాటల్లెక్క గొడుతున్నయ్.యేంది ఆంద్రోల్లింటికొచ్చి పడిన్నా?శాన తప్పు జేసినుంటి …తెలంగాననకుంట…ఆంధ్రప్రదేశ్ అంటి. జూడు ఆడెం జేసిండొ ?నా సెంపల్నేగొట్టుకోవాల.యేడున్నయ్? నా సేతులు?కాల్లేడున్నయ్? నా సెరీరంల యే పార్ట్ గూడ లేనట్టుంది. “ఆంద్రోల్ల మాటినబడిందన్నగద, యింటున్న… తెలంగాణ విడిపోయిన రోజునే నీ కడుపుపండిన వార్త చెప్పావమ్మా! చాల సంతోషం.ఆరోగ్యం జాగ్రత్త. యికెవల్లకో సెబుతుండు… సరే మనమెక్కడున్నాం? కేంద్ర రంగ పరిశ్రమలన్ని అక్కడే హైద్రాబాద్లో కేంద్రీకరించారు కాబట్టి గాని, ఆ పరిశ్రమలే అన్ని జిల్లాలలో పెట్టి వున్నట్లయితే వాళ్ళు విడిపోతామన్నా ఎవరం అడ్డుకొనే వాళ్ళం కాదుగా. ఆనందంగా మిత్రుల్లా విడిపోయేవాళ్ళం.అదిసరేనమ్మా! మల్లాస్ ఆని బిడ్డతోటి మాట్టాడుతున్నట్లున్నడు.ఆమే వూ గొడతాంది. నా జెవులు జిమ్మంటున్నయ్. “నీ బిడ్డ అద్రుష్ట మమ్మా. హైద్రాబాద్ ప్రత్యేక ప్రాంతంగా వుంచుతారంటమ్మా. లేకపోతే పుట్టబోయే నీ బిడ్డకు వుద్యోగమే దొరకదేమో ఆంధ్రలో.” “అదికాదండీ” ,యికెవరికొ సెబుతున్నడు .”ఆంధ్రలో పెద్ద పెద్ద కర్మాగారాలేమీ లేవుకదా! దరిదాపు నలభై దాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్ని హైద్రాబాదులోనే వున్నాయయ్యె.అప్పటి ఆంధ్ర ముఖ్య మంత్రులు నెహ్రూ మెప్పు పొందాలని,ఆ తరవాత ముఖ్య మంత్రులేమో ,అదీ మన ప్రాంతమేగదాఅని… అన్ని పరిశ్రమలూ, కార్యాలయాలూ,పరిశోధనాలయాలూ కేంద్ర విశ్వవిద్యాలయాలూ, అయ్. అయ్. టి, ఆఖరికా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ,అన్నీ అక్కడే పెట్టడంతో అభద్రతతో ఆంధ్రలోయువత హద్రాబాద్ తెలంగాణకు పోతే భవిష్యత్ యేమౌతుందేమోనని బిక్క చచ్చి వుద్యమమ్ మొదలు పెట్టారు. మరల అక్కడ యీ గొడవలన్నీ. పాపంఎంతమంది చచ్చి పోయారో చదువుకొనే పసిపిల్లలు. అక్కడి నాయకులు అబద్ధాలు చెప్పి రెచ్చగొడితే వాళ్ళేం చేస్తారు అభివ్రుద్ధి చెందలేదనీ వుపాధి అక్కడే కేంద్రీక్రుతమయ్యిందన్న విషయం, అక్కడి యువతకు అవగాహన లేదు,నాయకులు చెప్పిన తప్పుడు మాటలు వింటారు.వాళ్ళకు తెలియదు.పారిశ్రామికంగా హైద్రాబాద్ నగరం తప్ప ఆంధ్ర ప్రదేశ్ లో మరే ప్రాంతం అభివ్రుద్ధి చెందలేదనీ, వుపాధి హైద్రాబాద్ లోనే కేంద్రీక్రుతమయ్యిం వుందనున్నూ.. ఇంతకీ యే వుద్యమకారుడొ పుడతాడేమో నీ కడుపున. పెద్దాయన కూతురితో అంటున్నాడు. ఆయనెట్ల కనిబెట్టిండొ యేమొ నేను తెలంగాన వుద్ద్యమాన పేనాలొదిన్నని? గాఆయన నా ఆంధ్ర తాత లెక్కున్నడు. తప్పు తప్పు సచ్చి ఆంధ్రోళ్ళింట బుడుతున్న, నా యాస బి మారాలె. ఎందుకొ నేనేడుస్తున్న. హైద్రబాద్ తెలంగానకు రాకుంటయ్యిందంటనె.గదే తిర్గుతాంది దిమాఖ్ల. సంఝాయించెటోల్లెవ్రులేకుంటిరి నేనేంజెయ్యాల? పోయి పోయి ఆంధ్రోనింట్ల బుట్టాల్నా? నిన్నటిదన్క ఆంధ్రోన్ని దిట్టిన దిట్టు దిట్టకుంట దిట్టినోన్ని,యిప్పుడేంజెయ్యాల ? మైకం కమ్మ బట్టె. యిగనాకేమైతాందొ యెరికలే. ఆంధ్రల ఆంధ్రోనింట బుడతననుకుంట. సర్లె దియ్.