డివిజన్ ఆఫ్ లేబర్

రచన: నూతక్కి,

 తేదీ: 13-02-2010

 డివిజన్ ఆఫ్ లేబర్ కు

 ప్రతీకలు వుమ్మడి

 కుటుంబాలు

 పరిమితమైన భాద్యతలు

 కావెవరికీ

ఆర్ధికంగా, భౌతికంగా

 ఎత్తలేని బరువులు

 ప్రైవసీ అనే ముసుగేసుకొని

మభ్య పెట్టుకొంటూ

మనసును

 సెల్ఫ్ సెంటర్డ్ ఆలోచనలకు

 చెల్లుచీటీ యిచ్చి యువత

వుమ్మడి కుటుంబ

సహ జీవన భావనలకు

 బీజాలు నాటవలసిన

 తరుణమిదే

పునఃవ్యవస్తీకరణకు

 పునరంకితమైతే

ఆత్మ న్యూనతలు

అభత్రతా భావనలూ

 దరి చేరనీని

మనసు మనసుకూ

 సమతకు మమతకూ

 భద్రత

 మగడూ పెండ్లాల

 యిరువురి నౌకరీల

సామాజిక ఆర్ధిక

విన్యాస కేళిలో

 అలసిన మనసుల

 అరుపులు కేకలు

 కాట్లాడుకొనే

 యువ జంటలు

 వూయలలో కేరింతలు

 మరచి లాలన యెరుగక

నలుగుతున్న

 బాల్యానికీ భద్రత.

స్వాగతించి

పునఃరుద్ధరించు

 వుమ్మడి కుటుంబ

సహజీవన వ్యవస్త