శ్రీ శ్రీ లో

స్వామి శ్రీ వివేకానందుని వుధ్భోదలు

 ( మహా కవి శ్రీ శ్రీ మహాప్రస్తాన గీతరచనకు ఎంతవరకు స్ఫూర్తి ?)

(యిరువురి భావనలలో సామ్యం…నాలో కలిగిన ఓ చిన్న సంశయం ….నూతక్కి)

 రచన:నూతక్కి

 భారత దేశం మన మాత్రుభూమి

 అన్న అంశం పై చర్చిస్తూ

స్వామీజీ అంటారూ…

కర్షకుల గుడెసెలనుండి

నాగలి చేతబూని

నవ్య భారతం లేచి రావాలి.

 చేపలుపట్టే,

చెప్పులుకుట్టే,

వీధులు వూడ్చే,

సామాన్యుల

గుడిసెలనుంచి

 నవీన భారతం

 లేచి రావాలి,

చిల్లర వస్తు

దుకాణాలనుండి,

సంతల నుండి,

 బజార్లనుండి

 కర్మాగారాలనుండి,

నవ్య భారతం

 బైటకు రావాలి.

 అడవులు కొండలు

గుట్టలనుండి

నవీన భారతం

లేచి రావాలి. …

అని అంటారాయన.

 మరోచోట “పిరికివాడు,పనికిమాలినవాడు మాత్రమే ఇది విధివ్రాత అంటాడని సుభాషితాలు చెబుతున్నాయంటూనే,ముసలితనం పైబడుతున్నవారే విధిని గురించి మాట్లాడుతారని యీసడిస్తారు. యువకులు అలా కాదని వారిని ప్రశంసిస్తున్నట్లు నా కర్మకు నేనే కర్తను అని అనేవాడే ధైర్యవంతుడంటారు స్వామి శ్రీ వివేకానంద..

 శ్రీ శ్రీ ,మహాప్రస్తాన గేయంలొ …..

ఎముకలు క్రుళ్ళిన

వయసు మళ్ళిన

సోమరులారా! చావండి.

అని అంటూనే……

 నెత్తురుమండే,

శక్తులు నిండె

 సైనికులారా రారండి!

 అని పిలుపునిస్తాడు…..

 బాటలు నడచీ,

పేటలు కడచీ,

కోటలన్నిటిని దాటండీ:

నదీనదాలూ,

అడవులు కొండలు,

ఎడారులా మనకడ్డంకీ

అంటూ మహా కవి శ్రీ శ్రీ వుధ్భోధ చేస్తాడు . యిరువురూ నవసమాజ నిర్మాణంలో యువకుల భాధ్యతను తెలియచెప్పి ప్రోత్సహిస్తూ వ్రుద్ధులను కార్యోన్ముఖులైన యువకుల మార్గానికి అడ్డురావద్దంటున్నారు. కుల, మత, వర్గ, ప్రాంత, విభేదాలులేని నవ సమాజానికి పిలిపునందించారు.