ఫిబ్రవరి 2010


ఆత్మవిశ్వాసం

(స్వామి శ్రీ వివేకానంద సూక్తి )

సేకరణ : నూతక్కి

విశ్వాసం ..బలం …యీ అంశం పై చర్చిస్తూ…..స్వామిజీ….అంటారూ……

మనపై మనకు విశ్వాసం… ఇదే పరిపూర్ణ వికాసమంత్రం.మన ముఫైమూడు కోట్ల పౌరాణిక దేవతలపైనా, మీకు సంపూర్ణ విశ్వాసం వున్నా,….. మీ పై మీకు విశ్వాసం లేకుంటే నిష్క్రుతి వుండదు.

ఆత్మవిశ్వాసం వున్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర.. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని,చైతన్యాన్ని వెలికి తీస్తుంది.మీరు దేనినైనా సాధించగలరు.ఒక వ్యక్తి గానీ,జాతి గానీ తన పై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మ్రుత్యువుతో సమానం………… .( భారత జాతికి నా హితవు…..రామక్రిష్ణ మఠం, హైద్రాబాద్ వారు ..ప్రచురించిన స్వామి వివేకానంద విరచిత సూక్తుల చిరు గ్రంధం నుండి సేకరించడమైనది.)

చట్టం….నైతిక సామాజిక వైవిధ్యం

 రచన: నూతక్కి

 తేదీ:20-02-2010

సామాజిక ఆర్ధిక నేపధ్యంలో

 సోరోగసీ చట్టబద్ధనీడల్లో…..

నారి తనగర్భం

నవమాసాలు

అద్దెకిస్తే సమ్మతం

చట్టానికి!!!

ఆర్ధిక రణ రంగపు

 నేపధ్యపు కల్మష

కూపంలొ సామాజిక

ఆర్ధిక నిక్రుష్టతలో

 కడుపుకు ఓ మెతుకుకై

మానిని తన మానం

అద్దెకిస్తె దుష్క్రుత్యం

అది చట్టానికి

యేజెన్సీల పేరుతో

పేపర్లపై సంతకాల

అంగీకారాలుతో

సగౌరవ వైద్య

 మర్యాదలతో …అక్కడ

భయంకరంగా

బలవంతంగా

 తరలింపబడి

 బ్రోకర్ల,డాఫర్ల

కనుసన్నల్లో

 నకనకలాడే కడుపుల్లో

 తన్నులతో…యిక్కడ

 ఆర్ధిక స్వావలంబనలొ

 సమాజానఒకరు

 ఏహ్య ధ్రుఃక్కులతో

యీసడింపులతో

 మరొకరు.

జలగల్లా

సమాజరుధిర పిపాసులు

అక్కడ అధికార నిర్వహణలో

 యిక్కడ అధికారుల నిర్వహణలో

 విధిగా పహారాలో

 ప్రజా ప్రభుత్వాలు.

యాభై మూడేళ్ళు

రచన :నూతక్కి

 తేది: 15-02-2010.

 రాష్ట్ర విభజన అనేక పీట ముడులతో, సంక్లిష్టతతో కూడుకొన్న అంశం. ఆనాడు అప్పటి గౌ.ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,తెలంగాణాప్రాంతాన్ని,ఆంధ్ర రాష్త్రంతో కలిపాలని చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల, వుత్పన్నమయిన పరిణామాలకు, యీనాటికీ. నెత్తి పట్టుకు కూర్చుని పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మనం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న కోర్కెకు అవతలి పక్షం లేవనెత్తుతున్న అభ్యంతరాలలో వున్న న్యాయబద్ధ అంశాలు పరిగణనలోకి తీసుకొని యోచిస్తూ సమన్వయంతో,సమ్యమనం పాటిస్తూ ముందుకు సాగవలసింది పోయి దురుసు రీతులతో వుద్యమ నాయకులు సంక్లిష్టతను స్రుష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో మనం మన ఆకాంక్షలకు ఎంత ప్రాధాన్యం మిస్తున్నామో, అవతల వారి వుద్దేశ్యాలకూ విలువలు వుంటాయనేది గమనించ వలసిన విషయం. , మన అభిలాషలకు అనుకూలంగా పరిణామాలు లేకుంటే విధ్వంస పూరిత వుద్యమాలు , ఏకపక్ష విస్ఛిన్న పోకడలు ప్రోత్సహించడం సోచనీయం.చర్చల ద్వారానో మధ్యవర్తుల ద్వారానోసమస్య పరిష్కారానికి అవకాశమే లేని విధంగా అవతలి ద్వారాలను తామే మూసివేసుకొంటున్నారు.

అటు తమిళులూ యిటు తెలంగాణీయులూ “తకిట తకిట తక్ తధోమ్” అంటూ ఆంధ్రులను “మ్రుదంగం” చేసి వాయించారు. యిప్పుడూ అదే పనిలో వున్నారు. .కేంద్రం ఆంధ్రను ఫుట్బాల్ అనుకొంటోంది.తనఆటకొరకు ఆంధ్రులను బంతిలాఎడాపెడా తంతోంది.

నిజాము పరిపాలనలో పాలకుల వివక్షత వల్ల తాము కోల్పోయిన వ్యక్తిత్వావికాసానికీ, పొందలేకపోయిన అక్షరాశ్యతకూ,తద్వారా కోల్పోయిన వుపాధి అవకాశాలకూ భూసంపదకూ, అన్నింటికీ ఆంద్ర ప్రజలను , ఆంధ్ర ప్రాంత పాలకులను,భాద్యులను చేసి దుర్భాషలాడుతూ,యువతలో ఆంధ్రుల యడల అకారణ ద్వేషాగ్నిని రగుల్చుతున్న రాజకీయవేర్పాటు వాదుల విధాన శైలి గర్హనీయం.బాధాకరం..

 యీ విషయంలో వేర్పాటు వాద యువకుల ఆవేదన ఆందోళన త్రుటిలో పరిష్కారం అయ్యేదికాదు. విభజనా వాంఛ అవతలి వారి మౌలిక ప్రయోజనాలకు,హక్కులకు, విఘాతం కలిగించే విధంగా వున్నఫ్ఫుడు, దానిని నెరవేర్చడం వల్ల దేశంలో యితర ప్రాంతాలలోనూవిభజనా భావ విస్పోటనలు వుధ్భవిస్తాయనుకున్నప్పుడు దేశ సమైక్యతకూ,,సమగ్రతకూ,సుహ్రుధ్భావ వాతావరణానికీ భంగం కలగని రీతిలో నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ భాద్యత.

అది చిటికెలో జరిగే పని కాదు. ” వేర్పాటు పడాలనీ ,స్వయం పాలన కావాలనీ, మా యాభై సంవత్సరాల కోరిక….యిది మా ఆత్మ గౌరవ సమస్య..”.. తెలంగాణ వేర్పాటువాదుల వాదన….. సమైక్యంగా వుండాలనేందుకు వుత్తరాంధ్ర,సీమాంధ్ర ప్రాంతీయులు, న్యాయమైన ఒక్క పాయింటు నైనా చెప్ప మనండి అని వేర్పాటు వాదులు అక్కసుగా అడిగే ప్రశ్న.

వుత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయల సీమ ప్రజలకూ …ఆత్మ, గౌరవం వుంటుందికదా.వారికీ న్యాయబద్ధమైన కోరికలు సమైఖ్య రాష్ట్ర పౌరులుగా వారి హక్కులు ఎవరూ కాదన లేనివికదా!. సమైక్య రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వుండాలన్న వారి కోరికలో న్యాయబద్ధ కారణాలు అనేకం వారూ చెప్ప వచ్చు కదా?

అందులో కొన్ని….. మద్రాసు రాష్ట్రం నుండి విడివడి, స్వంత రాజధాని నగరాన్ని అభివ్రుద్ధి చేసుకొనే దశలో,రాజకీయ జిమ్మిక్కుల వల్ల రాజధానినీ, హైకోర్టునూ త్యజించి తమ వునికిని పోగొట్టుకొని, సరిపెట్టుకొని,…. హైద్రాబాద్ నగరంలో ఎన్ని విధాల త్రుణీకారాలు ఎదురైనా సహిస్తూ, అదే తమ రాజధాని నగరమని మనసా భావించి ఆ నగరంతో అనుబంధాన్ని పెంచుకొని, గతయాభై యేళ్ళ నుండీ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ నినాదం తోనే వున్నారు,వుత్తరాంధ్ర,కోస్తాంధ్ర, సీమాంధ్రులు. వారిదీ తెలంగాణియుల వాదనంత పాతదే కదా.

వాస్త వానికి ఆంధ్రులు తెలంగాణాతో కలవకుండా వుండి వుంటే ..నెహ్రూ జిమ్మిక్కులలో చిక్కడి వుండకపోతే… వారు యీసరికి,గడచిన యాభై మూడు సంవత్సరాల కాలంలో…ఎంతో సాధించుకొని వుండేవారు.

1) రాజధానిగా ఒక ప్రణాళికా బద్ధమైన ఒక మహత్తర సుందర నగరాన్ని సకల హంగులతో నిర్మించుకొని వుండి వుండే వారు. 2) పారిశ్రామిక అభివ్రుద్ధిని సాధించుకొని వుండి వుండేవారు.

 3) లక్షలాది మందికి వుపాధి నిచ్చే సినిమా పరిశ్రమ,…. నిరంతర భయ భ్రాంతులతో బ్రతుకు వెళ్ళదీస్తున్నతెలుగు సినిమా పరిశ్రమ… యీ సరికి యీ యాభై యేళ్ళలో తనదని సగర్వంగా,సగౌరవంగా చెప్పుకొనే ఓ శాశ్వత చిరునామా పొంది వుండేది.

 4) యీ యాభై మూడు సంవత్సరాల కాలంలో………రాజధాని హైదరాబాద్ నగర అభివ్రుద్ధి నిర్మాణంలో, పరిశ్రమలూ,విద్య, వైద్య,పారిశ్రామిక, ,చలన చిత్ర, నివాస గ్రుహనిర్మాణ ,వుపాధి రంగాలలో,సాఫ్ట్ వేర్ రంగంలో, …యిలా ఎన్నింటిలోనో ….. అభివ్రుద్ధి పరచి,యాభై మూడేళ్ళ సమయాన్ని, ధనాన్ని శ్రమను వ్రుధా పరిచామా ?,బూడిదలో పోసిన పన్నీరు చందంగా చేశామా అన్న ఆవేదన. ….

 తెలంగాణీయుల కన్న ఎక్కువ మానసిక అనుబంధాన్ని,ఎమోషనల్ భాందవ్యాన్ని హైద్రాబాదుతో పెంచుకున్న.వుత్తరాంధ్ర,సీమాంధ్ర,కోస్తాఆంధ్ర ప్రజలు……. హైద్రాబాద్ మాది అని తెలంగాణీయులు అన్నప్పుడల్లా, భయ భ్రాంతులవుతూ కూడా , హైద్రాబాద్ తో వున్నఎమోషనల్ భాందవ్యాన్ని, తెంచుకోవడానికి, ,సిద్ధంగాలేరు.

యాభై సంవత్సరాల తమ వంతు శ్రమ ,ధనాదుల త్యాగ ఫలాలను, కోల్పోవడానికి కూడాఆంధ్రులు సిద్ధంగా లేరు.

 5) వుమ్మడి ఆర్ధిక వనరులతో పారిశ్రామిక నగరంగా కేంద్రీక్రుతమైన,కేంద్ర రంగ భారీ పరిశ్రమల హబ్ గా మారిన పూర్ణ కుంభం హైద్రాబాద్ తో సహా తెలెంగాణ విడిపోవడానికి వుత్తరాంధ్ర కోస్తా సీమ ప్రజలు అంగీకరించరు.

 6) తమ భవిష్యత్తరాలకు పారిశ్రామిక వుపాధి దొరకని శూన్య రాష్ట్రాన్నిఅందించేందుకు ఆంధ్రులు సిద్ధంగా లేరు.

7) గడచిన యాభై మూడుసంవత్సరాలలో రాష్ట్ర ప్రజల వుపాధి అవసరాల కనుగుణంగా పారిశ్రామిక అభివ్రుద్ధిని విస్త్రుత పరుచుకొని వుండేవాళ్ళు. తమ రాష్ట్రం యధాతధంగా వుండి వుంటే తమ రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించుకొని అన్నిప్రాంతాలు పారిశ్రామికంగా సర్వతోముఖాభివ్రుద్ధి చెందేలా, దేశంలోనే, మహోన్నత పారిశ్రామిక విప్లవం సాధించి వుండేవారు.

8) తమ వంతు శ్రమ ధనం నిష్కల్మష నిబద్ధతతో వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దిన,యాభై సంవత్సరాల ప్రగతి ఫలాలు,శ్రమ ఫలితాలను, తామొక్కరే స్వంతం చేసుకోవాలన్న దురాశతో తెలంగాణ వుద్యమ కారులు, రాష్త్రంలోని యేకైక పారిశ్రామిక కేంద్రీక్రుత ప్రాంతాన్ని తన్నుకు పోదామని చూస్తున్న యీ తరుణంలోఆంధ్ర ప్రదేశ్ రాజధాని,పారిశ్రామిక, వాణిజ్య రాజధాని అయిన హైద్రాబాద్ నగరాన్ని వదులుకోవడానికి వుత్తరాంధ్ర, సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే విభజనలో రాజధాని హైద్రాబాద్ నగరం,నగర పారిశ్రామికీకరణ, కీలక అంశాలుగాపరిగణనలోకి వస్తాయి… ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

 అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు, వుత్తర సీమాంధ్ర ప్రాంతాలలోనూ, హైద్రాబాద్ కు దీటుగా ,నగరాల అభివ్రుద్ధిని,ప్రోత్సహించి వుంటె,భారీపారిశ్రమలు,విద్య ఆరోగ్య్య గ్రుహ నిర్మాణ,పరిశోధనా రంగాలను అభివ్రుద్ధి పరచి వుపాధికి మార్గ నిర్మాణం చేసి వుండి వుంటే, ….

గ్రేటర్ హైద్రాబాద్ నగరం వుమ్మడి రాజధానిగా వుండాలని గాని, సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ గా అవిభాజితంగా వుండాలనిగాని, వారు పట్టు బట్టి వుండే వారు కాదేమో.

వారి ఆందోళనను ఇప్పటికైనా సహ్రుదయంతో అర్ధం చేసుకొని, పైన తెలిపిన అంశాలు కీలక అంశంగా భావించి స్రుహ్రుధ్బావ వాతావరణంలో అర్ధం చేసు కొని, పరిష్కార మార్గాలు వెదకడం ఒక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గం.

యీ భారీ పరిశ్రమలూ,కార్యాలయాలూ, పరిశోధనాలయాలూ ఆనాడే స్థాపనా దశలోనే అన్ని జిల్లాలకూ ఒకటో రెండో చొప్పున విభజించి స్థాపించి వుండి వుంటే అసలు తెలంగాణ రాష్ట్ర నినాదమే వచ్చేది కాదేమో.

పరిశ్రమల కేంద్రీకరణలో జరిగిన అనాలోచిత చర్యలు, వెనుకకు తీసుకోలేని తప్పిదాలే, అది ఎన్నడు జరిగినా, ఎవరు చేసినదైనా….. ప్రస్తుత తరుణంలో ఆ పరిశ్రమలను ముక్కలుగా విభజించి ఎవరి వంతు వారి ప్రాంతానికి తరలించలేము కాబట్టి,యితర ప్రాంతాలలోనూ అంత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికీకరణ అమలు జరిపి ,జరగబోయే క్రమంలో తప్పిదాలు జరుగకుండా,యే ప్రాంతానికీ వివక్షత జరగకుండా సమన్యాయ పరిష్కారం లభించి అన్నదమ్ముల్లా విడి పోవడం న్యాయం

కాని,యితర ప్రాంతీయుల న్యాయమైన హక్కులను హైజాక్ చేయాలనుకోవడం విద్రోహపూరిత కుట్ర గా భావించ వలసి వస్తుంది…

 ఈ క్రమంలో యువకులు ప్రాణ త్యాగాలు చేయకుండా సమస్య పరిష్కారాని కి శాంతియుత మార్గంలో చేయవలసిన త్యాగమార్గాలు అనేకం వున్నాయి. యిచ్చి పుచ్చుకొనే రీతిలో కూడ త్యాగాలు చేయవచ్చు. వివేకంతో .వ్యవహరిస్తే విగ్నత..

 ఇక పోతే, సరిహద్దుకు ఎంతో దూరంలో వున్న నగరం రాజధాని నగరంగా వుమ్మడిగా ఎలా సాధ్యమో అని కొందరి మిత్రుల సంశయం. ఆ కాలంలోభాగ్యనగరానికి ఎన్నో మైళ్ళ దూరంలోవున్న , అప్పటికి విదేశీ ప్రాంతమైన బందరు రేవు నుండి, ఎగుమతులు దిగుమతుల కొరకు ఎడ్ల బండ్ల పై రవాణా నిర్వహించిన నిజాం, అందులకై ఆంగ్లేయ ప్రభుత్వంతొ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.. అదే మార్గంలొ ఆంధ్ర ప్రాంతం నుండి నిత్యావసర ఆహార పదార్ధాలూ దిగుమతి చేసుకొనే వాడు.,

 కాబట్టి గ్రేటర్ హైద్రాబాద్ నగరం ,వుత్తరాంధ్ర సీమాంధ్రులకు, ఆ రోజునా, యీ రోజునా అంతే దూరం, రేపూ అంతే దూరంలో వుంటుంది. వుమ్మడి రాజధానిగా వినియోగించుకోవడానికి అదేమీ అభ్యంతరకరం కానక్కర లేదు.

మరో రాజధానిని నిర్మించుకొనేందుకు, సమూలంగా జరుగవలసిన పారిశ్రామికీకరణ కు కలిగే ఆర్ధిక భారం యిటు తెలంగాణ భరించినా, అటు కేంద్రం భరించినా ఎంతో సమయంతో కూడిన వ్యవహారం…

ప్రస్తుత తరుణంలో దాయాదుల పోరువల్ల నూతన రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం,పారిశ్రామికీకరణకు అయ్యే వ్యయం, విద్యా వైద్య రంగాల్లో వున్న వ్యత్యాసాలు సరి చేసేందుకయ్యే వ్యయం,కేంద్రమో ,యేర్పడబోయే తెలంగాణ రాష్ట్రమో భరించాల్సి వుంటుంది. అవన్నీ పూర్తయ్యేంత వరకూ, పారిశ్రామికీకరణ పూర్తయ్యేంత వరకూ, హైద్రాబాద్ నగరమే సీమాంధ్రులకూ రాజధానిగా వుంచాల్సిన అవసరం వుంటుంది.అది సాధ్యం కాదనుకున్న తరుణంలో వుమ్మడి రాజధానిగా గ్రేటర్ హైద్రాబాద్ ను ఎట్టి వివక్షతా చూపకుండా వుమ్మడి రాజధానిగా అంగీకరించి తీరాలి.

 ఒక లక్ష్యం సాధించాలనుకొనే వాడు, మౌలిక లక్ష్య సాధనకై కొన్నింటిని కోల్పోవలసి వచ్చినా సిద్ధపడటమన్నది విగ్నత. రాజధాని నగరాభివ్రుద్ధిలో, అన్ని రంగాలలో , ఆంధ్రులూ తమ వంతు శక్తి, యుక్తులనూ, శ్రమ ధనాదులనూ ఒడ్డి , వడ్డించిన విస్తరిలా ,నగరాన్ని తీర్చి దిద్దిన తరుణంలో అన్ని రంగాలలోఅభివ్రుద్ధి చెందిన ప్రదేశంగా ప్రపంచంలొ పేరు ప్రఖ్యాతులు పొందిన రాష్ట్రం, ముక్కలుగా విడిపోవడం,బాధాకరమే…….సమైక్య ఆంధ్ర ప్రదేశ్ అఖండంగా కొనసాగాలని సమైక్యవాదిగా యీనాటికీ నా ఆకాంక్ష.

డివిజన్ ఆఫ్ లేబర్

రచన: నూతక్కి,

 తేదీ: 13-02-2010

 డివిజన్ ఆఫ్ లేబర్ కు

 ప్రతీకలు వుమ్మడి

 కుటుంబాలు

 పరిమితమైన భాద్యతలు

 కావెవరికీ

ఆర్ధికంగా, భౌతికంగా

 ఎత్తలేని బరువులు

 ప్రైవసీ అనే ముసుగేసుకొని

మభ్య పెట్టుకొంటూ

మనసును

 సెల్ఫ్ సెంటర్డ్ ఆలోచనలకు

 చెల్లుచీటీ యిచ్చి యువత

వుమ్మడి కుటుంబ

సహ జీవన భావనలకు

 బీజాలు నాటవలసిన

 తరుణమిదే

పునఃవ్యవస్తీకరణకు

 పునరంకితమైతే

ఆత్మ న్యూనతలు

అభత్రతా భావనలూ

 దరి చేరనీని

మనసు మనసుకూ

 సమతకు మమతకూ

 భద్రత

 మగడూ పెండ్లాల

 యిరువురి నౌకరీల

సామాజిక ఆర్ధిక

విన్యాస కేళిలో

 అలసిన మనసుల

 అరుపులు కేకలు

 కాట్లాడుకొనే

 యువ జంటలు

 వూయలలో కేరింతలు

 మరచి లాలన యెరుగక

నలుగుతున్న

 బాల్యానికీ భద్రత.

స్వాగతించి

పునఃరుద్ధరించు

 వుమ్మడి కుటుంబ

సహజీవన వ్యవస్త

ఆవిష్కరణలకు మూలం

 రచన : నూతక్కి

 తేదీ: 12-02-2010

 మానవ శరీరాంతర్భాగ

వుధ్భవిత జఠరాగ్ని

 కీలల కీలక స్థలి యది

 కుక్షి యనే రెండక్షరాల

 సజీవ జీవజాల యంత్రాంగం

మహాధ్భుత నిర్మాణం

ఆకలికది జన్మస్థలి

ఆకలి ఆకలి ఆకలి

 ఆకాంక్షకు మూలం ఆకలి

 అభివ్రుద్ధికి మూలం ఆకలి

 ఆకలి తీర్చే ఆహారపు

సంపాదనకై మార్గాన్వేషణలో

 మహత్తర ఆవిష్కరణలు .

 ప్రాధాన్యత,ప్రాధమ్యం,

వివేకం, విచక్షణ

 నిర్ధారించి, నిర్దేశించి

, నియంత్రించు మేధకు

 మహత్తర శక్తి నిచ్చి,

 బ్రుహత్తర యుక్తి నొసగి,

 వివేకం కలిగించేది

విద్వేషం రగిలించేదీ

 విద్రోహం చేయించెదీ..

. వుత్పాతం కలిగించేది

 మమతల జల్లులలో

 అనురాగం,ఆత్మీయత,

 ఆనందం, ఆహ్లాదం,

స్రుజియించే కుక్షి

 ప్రపంచపు,కొన కొనలో

 వినూత్న రీతి

 అనునిత్యం

స్రుష్టిత మహాధ్భుతాల

ఆవిష్కరణం

సర్వం ,సకలం కుక్షే మూలం

ఆంధ్రోళ్ళింట బుడుతున్ననుకుంట

 (నా యాస భీ మారాలెగద.)

రచన: నూతక్కి,

తేదీ: 12-02-2010

పోన్రి , మమ్మల్ని గుప్పెట్లకెల్లిసిరేసిండు. ఏడికి ? నువ్వేడ బోవాలనుకుంటున్నవు? ఇండియాల ఆంధ్ర ప్రదేశ్. నే నేడ జచ్చొచ్చిన్నో గాడికి. గట్లనేబో, గని యే ఇంట్ల దిగాల్నో గాడేమేంజెయ్యాల్నో మేంజూసుకుంటం.పరేశాన్గాకు. నాలెక్కనే అడిగినోల్లంరికి జెప్పిండు. ఆడి పేరేందో? యింత దన్క ఆని గుప్పెట్లొ మేమెట్ల ఇమిడున్నమో,అంతమందిమి యెట్ల పట్టినమో ! బెమ్మ దేవుడో ,మరేందో… గట్లనే అనుకుంట…ఆడు భీ మా తెలెంగోని లేక్కనే కొడుతుండు. ఎవల్లో ఇసిరేసినట్టు, బోతునే వున్న. ఏగం సాన ఏగం….ఎటు బొతున్ననో, సివరికి ఓ సీకటి కొట్ల జొర్రినం గాడంతట తడి,యెచ్చెచ్చగ మంచిగనె వుంది.సిమ్మ సీకటి.నేనొక్కన్నె. గవేందొ గుడ గుడ సెబ్దాలు. ఎరకైతలేదు.ఏడకొచ్చిన్నో. ఏడికెల్లో మాటలినబడ బట్టినయ్ గని మాతెలంగాన మాటల్లెక్క గొద్తలేదు. ఆంద్రోల్ల మాటల్లెక్క గొడుతున్నయ్.యేంది ఆంద్రోల్లింటికొచ్చి పడిన్నా?శాన తప్పు జేసినుంటి …తెలంగాననకుంట…ఆంధ్రప్రదేశ్ అంటి. జూడు ఆడెం జేసిండొ ?నా సెంపల్నేగొట్టుకోవాల.యేడున్నయ్? నా సేతులు?కాల్లేడున్నయ్? నా సెరీరంల యే పార్ట్ గూడ లేనట్టుంది. “ఆంద్రోల్ల మాటినబడిందన్నగద, యింటున్న… తెలంగాణ విడిపోయిన రోజునే నీ కడుపుపండిన వార్త చెప్పావమ్మా! చాల సంతోషం.ఆరోగ్యం జాగ్రత్త. యికెవల్లకో సెబుతుండు… సరే మనమెక్కడున్నాం? కేంద్ర రంగ పరిశ్రమలన్ని అక్కడే హైద్రాబాద్లో కేంద్రీకరించారు కాబట్టి గాని, ఆ పరిశ్రమలే అన్ని జిల్లాలలో పెట్టి వున్నట్లయితే వాళ్ళు విడిపోతామన్నా ఎవరం అడ్డుకొనే వాళ్ళం కాదుగా. ఆనందంగా మిత్రుల్లా విడిపోయేవాళ్ళం.అదిసరేనమ్మా! మల్లాస్ ఆని బిడ్డతోటి మాట్టాడుతున్నట్లున్నడు.ఆమే వూ గొడతాంది. నా జెవులు జిమ్మంటున్నయ్. “నీ బిడ్డ అద్రుష్ట మమ్మా. హైద్రాబాద్ ప్రత్యేక ప్రాంతంగా వుంచుతారంటమ్మా. లేకపోతే పుట్టబోయే నీ బిడ్డకు వుద్యోగమే దొరకదేమో ఆంధ్రలో.” “అదికాదండీ” ,యికెవరికొ సెబుతున్నడు .”ఆంధ్రలో పెద్ద పెద్ద కర్మాగారాలేమీ లేవుకదా! దరిదాపు నలభై దాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్ని హైద్రాబాదులోనే వున్నాయయ్యె.అప్పటి ఆంధ్ర ముఖ్య మంత్రులు నెహ్రూ మెప్పు పొందాలని,ఆ తరవాత ముఖ్య మంత్రులేమో ,అదీ మన ప్రాంతమేగదాఅని… అన్ని పరిశ్రమలూ, కార్యాలయాలూ,పరిశోధనాలయాలూ కేంద్ర విశ్వవిద్యాలయాలూ, అయ్. అయ్. టి, ఆఖరికా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ,అన్నీ అక్కడే పెట్టడంతో అభద్రతతో ఆంధ్రలోయువత హద్రాబాద్ తెలంగాణకు పోతే భవిష్యత్ యేమౌతుందేమోనని బిక్క చచ్చి వుద్యమమ్ మొదలు పెట్టారు. మరల అక్కడ యీ గొడవలన్నీ. పాపంఎంతమంది చచ్చి పోయారో చదువుకొనే పసిపిల్లలు. అక్కడి నాయకులు అబద్ధాలు చెప్పి రెచ్చగొడితే వాళ్ళేం చేస్తారు అభివ్రుద్ధి చెందలేదనీ వుపాధి అక్కడే కేంద్రీక్రుతమయ్యిందన్న విషయం, అక్కడి యువతకు అవగాహన లేదు,నాయకులు చెప్పిన తప్పుడు మాటలు వింటారు.వాళ్ళకు తెలియదు.పారిశ్రామికంగా హైద్రాబాద్ నగరం తప్ప ఆంధ్ర ప్రదేశ్ లో మరే ప్రాంతం అభివ్రుద్ధి చెందలేదనీ, వుపాధి హైద్రాబాద్ లోనే కేంద్రీక్రుతమయ్యిం వుందనున్నూ.. ఇంతకీ యే వుద్యమకారుడొ పుడతాడేమో నీ కడుపున. పెద్దాయన కూతురితో అంటున్నాడు. ఆయనెట్ల కనిబెట్టిండొ యేమొ నేను తెలంగాన వుద్ద్యమాన పేనాలొదిన్నని? గాఆయన నా ఆంధ్ర తాత లెక్కున్నడు. తప్పు తప్పు సచ్చి ఆంధ్రోళ్ళింట బుడుతున్న, నా యాస బి మారాలె. ఎందుకొ నేనేడుస్తున్న. హైద్రబాద్ తెలంగానకు రాకుంటయ్యిందంటనె.గదే తిర్గుతాంది దిమాఖ్ల. సంఝాయించెటోల్లెవ్రులేకుంటిరి నేనేంజెయ్యాల? పోయి పోయి ఆంధ్రోనింట్ల బుట్టాల్నా? నిన్నటిదన్క ఆంధ్రోన్ని దిట్టిన దిట్టు దిట్టకుంట దిట్టినోన్ని,యిప్పుడేంజెయ్యాల ? మైకం కమ్మ బట్టె. యిగనాకేమైతాందొ యెరికలే. ఆంధ్రల ఆంధ్రోనింట బుడతననుకుంట. సర్లె దియ్.

తుగ్లక్ పాలనె బెటరేమో…..

రచన :నూతక్కి

తేదీ: 10-02-2010

ఎన్నడో నా చిన్నప్పుడు

చరిత్ర పాఠాలలో

చదువుకున్న చేదు నిజం

పళ్ళుంటె పంటిపన్ను

జుట్టుంటే బొచ్చుపన్ను

కాళ్ళుంటే నడకపన్ను

నిలుచుంటే నీడపన్ను

పన్నేసిన తుగ్లకు రాజ్యపు

గురుతులు మది మరువలేదు.

కానీ

ఆ తుగ్లకె మెరుగిప్పుడు

ఎంతెంతో నయమిప్పుడు

ఓట్లేసి ఎన్నుకున్న

ప్రజలు

తమ నెత్తిన తలకెత్తుకున్న

ప్రభుత్వాల సరళి చూడ

అమ్మ బాబో మనకొద్దని……….

రూక రూక కూడగట్టి

తిన్నా తినకున్నా భవితన

స్వంతగూడు కట్టుకొనే

యోచనలో ఓ భూ భాగం

కొనుక్కున్న వెనువెంటనె

గూటిని నిర్మించలేక

పైస పైస కూడగడుతు

ఖాళీగా వుంచుకొంటె……

వురుము లేని పిడుగులా

ఖాళీ జాగా పన్ను!!!.

అనుమతులన్నీ పొంది

ఏళ్ళ క్రితమె కట్టినా

కట్టుడులో తప్పులనీ

తాటొలిచేలా పన్నులు

ప్రజల పళ్ళూడగొడుతు

ప్రజల చేత, ప్రజల కొరకు

ఎన్నికైన ప్రభుత్వాలు

నిశ్ఛింతగ యే ఒక్క క్షణం

ప్రజల బ్రతకు సాగనీని

విక్రుత చేష్టన ప్రభుతలు

బాబోయ్ తుగ్లకె నయమని

అతడే కావాలంటూ

గుడిలో,చర్చిలో,

మసీదునందున,

గురుద్వారమున

యిటనట యేమిటి

తము నమ్మిన

విధాతను ప్రార్ధిస్తూ

ప్రజాస్వామ్య వ్యవస్తలో

భంగపడ్డ దీనజనులు

భవన నిర్మాణపదశలో

పునాది దశన ప్రతినిత్యం

లంచాలు మరిగి

అక్రమాలు నియంత్రించలేని

పారదర్శకతను చూపలేని

అధికారులకేది శిక్ష?

రిజిస్ట్రేషన్ దశన తమ జేబులు

నింపుకొంటు, జరిగే పొరబాట్లను

ఆపలేని అధికారుల కేది శిక్ష?

అందులకే అందరం

కోరుకొంటున్నాం

తుగ్లక్ పాలనె కావాలని

క్రిష్ణుడు,

క్రీస్తుడు ఒకరైతే !!!

ఓ వితండ వాదం)రచన:

నూతక్కి , తేదీ:08-02-2010

క్రిష్ణ యుగమో క్రీస్తు శకమో

గొర్రెలు, మేకలు , గోవులు,ఏవైతేనేం ,

ఆకలినీ చలినీ దప్పికనూ తీర్చుతూ

మానవ జీవుల మచ్చికలో

చతుష్పాదులా ప్రాణులు

మాంసమో,పెరుగో, వెన్నో,

 చల్లో,తోలో, బొచ్చో, పేడో, పిడకో,

వాటన్నింటినీ అందిస్తూ మనిషికి

క్రీస్తయినా క్రిష్ణుడైన

ఆ కాలపు ఏక కాల జీవులా?

కాకుంటే ఏక కధా నాయకులా?

ప్రచారపు సరళిలోన

పరివర్తన చెందిన కధలా?

ఇరువురి జన్మల సంకేతం

అందించిన ఆకాశవాణి

దారి చూపిన నక్షత్ర కాంతులు

మహోధ్రుత వర్షపాతమట

మహోద్రుత  వర్షపాతమూ

నదీ ప్రవాహమిట

గొల్ల వాడ లోఎదిగిన క్రుష్ణుడు

గొల్ల పాకలో పుట్టిన క్రీస్తుడు

పాలకుల అహంకారాన్నణచి యొకరు

పాలకుల హూంకారాలు భరించి మరొకరు

ముళ్ళ కిరీటం ధరించి మరణించె నొకరు

ములు కొలకులు తాకగ పరమపదించె నొకరు.

చని పోయియు తిరిగి బ్రతికి జగతికి

బైబులుతో బ్రతుకు బాట చూపెనొకరు

తా బ్రతికుండియె జనులకు

భగవద్గీతగ బోధించెనొకరు

శాంతి! శాంతి! శాంతి!

నీ కర్తవ్యం నీవు చేయి

ఫలితం నాకొదిలేసెయ్

అన్నవారిరువురు ఒకరేనా?

ఆ పాత్రలు ఒకటేనా

యిక్కడికధ అక్కడికా?

అక్కడిదే యిక్కడికా

ఒకరు కాద

ఒకరా కాదా!!

రీసెర్చి సబ్జెక్టుతో

….అతడు !! సందియమున

సతమతమై

నిదురలోకి జారుకొని

ఆ చలికాలపు

నడిరేతిరి పొరబాటున 

క్రీస్తు,కిష్టయ్యలు ఒకటేనని 

గాఢ నిద్రలో కలగనకొస్తే

విక్రుత అరుపులువులిక్కిపడి నిదుర లేచి

షవరుక్రింద చన్నీళ్ళతొ

గడగడ వణుకుతు స్నానం

 వందల గుంజీళ్ళు

పాపం శమించు గాక యనే

పాప భీతి మనసులున్న

మనుషుల కాలం

అన్నింటా ద్వైధీ భావం.

విరివిగా విరుగుతున్న మనోభావనలు

(కనిపెడదాం అతికించే వింత ఫిక్స్)

రచన: నూతక్కి, తేదీ: 05-02-2010

 చీటికి మాటికీ

యీ మధ్యన

 వినవచ్చే పదం

మనో భావనలు

 భావనలున్నాలేకున్నా

 మనసు మాత్రం

 వుంటుందనుకుంటా

మనిషికి

క్రూరపూరితమో …..

 సౌమ్యభరితమో…..

తెలెంగాణ వుద్యమాన

 సమైక్య స్వర సంచయాన

 వైషమ్య భరిత

మనో భావనల

వింత వేదనలు

పరమాత్ముని లడ్డూకై

వికలమైన మనోభావనలు

 చీకటి దారుల్లో ఆర్జితసేవల

వింత పోకడల వీక్షణలో

 విరిగిన మనోభావనలు

 అడ యీడ యేడనైన

దీనికి దానికి అని కాదు గాని

అనునిత్యం చిద్రమౌతు …..

 విరిగినా అతికించే “వింతఫిక్స్”

వుండుంటే ….

బాగుండును క్విక్ ఫిక్స్ లా

నా

శిలాశిశువుజన్మ దినం.(అందరికీ సు స్వాగతం.)నూతక్కి,

తెదీ: 04-02-2010

తెలుగు బ్లాగర్లు అందరికీ యిదే నా ఆహ్వానం.

నా “శిలాశిశువు” పుట్టి ,గత జాన్యువరి ముఫై కి ఒక సంవత్సరం గడచింది. కొంచెం లేటయినా ,ఒకసారి విచ్చేసి http://www.nutakki.wordpress.com కు వచ్చిఆశీర్వదించండి. స్వాగతిస్తూ….శ్రేయోభిలాషి …నుతక్కి

 

« గత పేజీతర్వాత పేజీ »