నేనూ నా మనసూ !

రచన : నూతక్కి

 తేదీ: 03-03-2010

అప్పుడప్పుడూ

నామనసు నను

 నీ గీతను మార్చుకోలేని

 వెర్రివాడా ! ఎందుకు

 నీకెందుకీ గీతల రాతలు?

నిలదీస్తూ, ప్రశ్నిస్తూ ……

అనునిత్యం వివిధ

మాధ్యమాలలో

 ఎన్నెన్నో రీతుల్లో

ఎందరో ఎందరెందరో

సాహితీ ప్రఖండులు

సామాజిక ఆర్ధిక

 రాజకీయ వుద్దండులు

 సమసమాజ పోకడల

 విక్రుత వైచిత్రులు

అవలోకించి విశ్లేషించి

 నియంత్రణామార్గాలు

ఎలుగులెత్తి చాటుతూ …..

అంతకన్న ఘనమా

 నీవందించే సందేశం?

 నీకిది అవసరమా అని

 అయినా నా

 మనసును నిద్రపుచ్చి

వ్యక్తీకరణా వ్యాసంగపు

 వ్యసనానికి బానిసనై

నిరంతర అభ్యాసంలో

యీనా అక్షర సంకలనం

ప్రకటనలు