మానవత్వమే మతం   రచన : నూతక్కి

తేది : 03-03-2010

మతం మానవ మేధన
మనుగడ సాగించే

అభిమతం వ్యక్తిగతం

మానవ జీవన వేదం

విక్రుతమై నియంత్రితమై

మానవజీవన సరళిపై స్వారిచేస్తూ….

 సరళమై సౌజన్యభరితమై

మానవతే మార్గమయితే

సమ్మోహనం

కఠినమై విక్రుతమై

మానవ జీవకకే

విఘాతమైతే

మానవాళికది

విక్రుత వేదనం

.