రండి రండి వడ్డించిన విస్తరుంది చింపుకు తిందాం  

 రచన : నూతక్కి

 తేదీ: 04-03-2010

పంచ భక్ష్య

పరమాన్నాలతో
వడ్డించిన విస్తరి

వూరిస్తోంది 

రండి.

చచ్చేలా కాట్లాడుకొని

చింపుకుం తిందాం
 

పూర్ణకుంభం

పగులబోతోందా
రండి

అందరినీ పిలవండి

మన్నుపాలు కాకుండా
 
కలిసి పంచుకుతిందాం……
 
చింపుకు ..చచ్చేలా

కాట్లాడుకొనేవి 

 కుక్కలు

కలిసి పంచుకు తినేవి

 కాకులు…..

చింపుకుతిన్నా

కలిసి పంచుకుతిన్నా

వాటికవే సాటి …

మనుషులకే నీతులు చెబుతూ

ప్రకటనలు