విక్రుత నామ ధారీ !

 రచన : నూతక్కి

తేదీ : 06-03-2010

 విక్రుత నామ ధారీ

నిను స్వాగతించాలని వున్నా

 విరోధి స్రుష్టించిన

అగాధాలలో కొట్టుమిట్టాడుతున్న

మా జీవితాలు

నీరాకతో మరింత

విక్రుతమౌతాయేమో ?నని….

సందేహంతో

భయపడి చస్తున్నాం

 మీ ఇరువురి పేర్లూ

 అలాటివి మరి !

 విరోధిని చూశాంగా

 అందుకే…..

నీకు మా స్వాగతం

 వుండబోదు.

మా వేదననర్ధం చేసుకొని

 నీవేమి చేస్తావో

 మాకు తెలియదు…

మము భీతావహుల్ని

 చేయక నీదారిలో

 నీవు ముసుగేసుకు… వచ్చి..

వచ్చిన దారినే తిరిగి

 పొమ్మని వేడుకుంటున్నాం

 మా మానాన మమ్మిలా

 బ్రతకనీయమంటున్నాం

 మమ్మల్నేమీ

తప్పుగా అనుకోకు

 నీ నామమెలావున్నా

 నీ స్వభావం

 సరళమని అనుకొని

 నిను స్వాగతించినా

 కాదని తిరస్కరించినా

 నీ వు వచ్చేది సత్యమనీ

 నీ ప్రభావమూ తప్పదనీ

 తెలిసీ నిన్నాపలేని

అసహాయులం

ప్రకటనలు