విరోధీ ….వీడ్కోలు

 రచన : నూతక్కి

తేది: 06-03-2010

విరోధి నామ వత్సరానికి

వీడ్కోలు

 అశ్రునయనాలతో ….

విడచి మననుంచి

వెడలి పోతోందని

 వ్యధతోకాదు

 వచ్చి చేసిన

దురాగతానికి

 వగచి

 విరోధీ

నీవు విరోధివని తెలిసీ

స్వాగతించాము

 సహ్రుదయతతో

 విరోధభావనలు

అత్యుగ్రంగా

 విక్రుత ప్రక్రుతి

 ప్రకోపాలు

 వైరుధ్య భావనా

 వీచికలు

 వేర్పాటువాద ధోరణులు

 విస్తరించగలవని

మరచి

విరోధీ నీ నామార్ధానికి

 విలువివ్వక

అరువదేండ్ల నాటి

 నీ విద్వేష వర్తనలు

 తరచి చూడక

నిను స్వాగతించి ….

నీవు చేసిన

విక్రుత వీరంగం

 చూసి మా హ్రుదయాలు వెరచి…..

విక్రుతి నామ వత్సరాన్ని

 స్వాగతించాలంటే

 భయపడి చస్తున్నాం

అయినా విరోధీ !

సకలమర్యాదల

 స్వాగతించే స్వాభావిక

 భావనలో నిరుడు

 నిను స్వాగతించామే!

మాకెందుకిలా చేశావ్?

కుశ్ఛితుడైనా దక్షతగల

నాయకుడాతడు

నీ ద్రుష్టి తాకి

ఆకసాన ఆకస్మికంగా

 భస్మీపటలమై

తిరిగిరాని లోకాలకు….

తరలించావే

నీవు స్రుష్టించి నర్తించిన

 జలప్రళయ విన్యాసపు

విక్రుత న్రుత్య హేలలో

 ఎంత నష్టం ఎంతెంత కష్టం ?

జనజీవనం

అస్తవ్యస్తమై

 యీనాటికీ

ఆ క్రుళ్ళిన శవాల

దుర్గంధాలు మా

ముక్కు పుటాలను

 నేటికీ తాకుతూనే వున్నాయ్

 వేర్పాటు వాదంతో రాష్ట్రం

 విక్రుత విరోధాల అగ్ని

 జ్వాలలలో భస్మీపటలం

అంతటా అతలాకుతలం

 పేరు లో పెన్నిధి లేదా దుర్నిధి

 వుంటుందో లేదో కాని

 నీ పేరునూ నీ ప్రవ్రుత్తినీ

 అనుభవాన చూసిన వాళ్ళం

 ఒప్పుకోక తప్పేలా లేదు

 అది సరే గాని విరోధీ

 మమ్ము ఇలాగైనా

 వుండనివ్వక విక్రుతమ్మకు

 మమ్మప్పగిస్తావెందుకు ?

 నీ స్వభావం చూసే

 నీకీ నామకరణమా?

మా పూర్వీకులను

 పాపం మరింకెన్ని

వేదనలు పెట్టి

వుంటావో కదామరి !

ప్రకటనలు