అమానుషులు

రచన :నూతక్కి

09-03-2010

 

తన కళ్ళపై

పడే కాంతులు

ప్రతిఫలించి

దీపాలని

భ్రమించి

దరి చేరే

దీపపు పురుగులు…

నాలుక చాచి

స్వాహాచేస్తూ

గోడలపై

ప్రాకులాడే

సరీస్రుపాల

మినీ రూపాలు

బాబాలు,

అమ్మలు

అక్కలు

స్వామీజీలు

సంతులు

సాధువులూ

పేరేదైతేనేం ?

ప్రకటనలు