మధు

వర్ణ రాగ రంజితంనూతక్కి

12-03-2010

ఆ వనమున విరిసిన సుమబాలలతో

ఆనందమై ఆహ్లాదమై సుమగంధం

రమణీయ వర్ణ పుష్పరంజితమై ప్రక్రుతి

లో లోతుల దాగిన పూదేనియ జుర్రుతు

గండు తుమ్మెదల ఝుంకారాలూ

మధువులు గ్రోలుతు తేటులూ

ఆమనీ దరి చేరెననీ తెలిపినవీ

తనువు మనసూ మరచి నే వీక్షించితిని