మనిషీ విశ్వంలో నీ జన్మస్థలి యేదీ ?

రచన: నూతక్కి

12-03-2010

గంటలు రోజులు నెలలు

సంవత్సరాలు

యుగాలు కల్పాలు

స్రుష్టింపబడుతున్నాయ్

అనుక్షణం

విరామమెరుగక

స్వయంప్రదక్షిణ

సూర్య ప్రదక్షిణ

ధరిత్రి చేసే నిష్కామ

కార్యమది

నక్షత్ర రాసుల

అసంఖ్యాక

నక్షత్ర కూటముల

మహాకూటమి

పాలపుంత తో

విశ్వ విహారం

స్థిరమని భ్రమిస్తూ

నిరంతర భ్రమణంలో

ధరిత్రి వాహనం పై

శుల్కం చెల్లించని

విశ్వ పర్యాటకులం.

మనం జన్మించిన క్షణాన

మన ధరిత్రివున్నస్థలి నుండి

కోట్లకోట్ల యోజనాల సుదీర్ఘ పయనం

చేసిన మానవ జీవులం……

విమాన వాహన పయనంలో

యేభూఖండపు

వుపరితలాన

జన్మిస్తే

ఆదేశమె నీ జన్మభూమి

అమ్మదేశమో నాన్నదేశమో

నీదేశం కాబోదు.

మరి యీలెక్కన మనిషీ

విశ్వంలో నీ జన్మస్థలి యేదీ ?