విక్రుతినామ సంవత్సర తెలుగు వుగాది శుభాకాంక్షలు. …నూతక్కి

 (వినమ్రంగా జగతినున్న తెలుగులందరికి ),

తేదీ : 16-03-2010

విరోధినామ వత్సరానికి వీడ్కోలునందిస్తూ,

విక్రుత నామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ

 యీ జగతిన వున్న తెలుగులందరికి

 అందిస్తున్నానివే నా హ్రుదయపూర్వక

విక్రుతినామ నూతన వత్సర శుభాకాంక్షలు.

 యీ సందర్భంలొ ……

 విరోధికి వీడ్కోలూ,విక్రుతికి స్వాగతం ….

 విరోధీ!

నీ కఠోర పదఘట్టనలోపడి

నలిగి విరోధాగ్ని జ్వాలలో కనలిన

మా తెలుగుల మదితలపులు

నీ వెంట

 సివారుదాకా వచ్చి నిను

 సాగనింప సిద్ధంగాలేవు.

అయినా వీడ్కోలిస్తూనే

నిను వేడుకొంటున్నాం

వస్తావుకదా! మరో

అరవయేళ్ళకు తప్పక

అప్పటి మా భావి తరాలను

మాత్రం ఇప్పటిలా మము

బాధించినట్లు వేధించకు సుమ్మీ !

విక్రుతీ !….. ఎందుకో

 మావేప చిగుళ్ళకు

 పూగుత్తులు పూయలేదు.

మావిళ్ళ పూతలు మరెందుకనో

 యింకా పిందలుగా మారలేదు.

 చింతపులుపూ సముద్ర

 వుప్పూ ఎరగారమూ

 వ్యాటు బంధనాలలోంచి

 సామాన్యుణ్ణి దరి

చేరలేకున్నాయ్.

 ట్యాపుల్లోఅయిదురోజులకోసారి

 వచ్చే నీటి చుక్క కొరకు

గండు చీమలు క్యూలు

కట్టి నిరీక్షిస్తున్నాయి.

మాదాకా చేరనీయవులే

 షడ్రుచులేమీ లేక

తీర్ధమూ లేక

 నీకు నైవేద్యం

యేమని పెట్టను

దప్పిగొన్నగండుకోయిలల

స్వరాలు బొంగురు పోయివున్నాయి

 నిను స్వాగత గీతాల

స్వాగతించలేని 

అశక్తతలో  

తెలుగు మాగాణపు

తలుపులు తెరచి

 సాష్టాంగప్రణామాల

 నినుస్వాగతిస్తామని

 ఆశించబోకు..

నీ నామంలోని విక్రుతం

 రూపంలొనూ భావనలోనూనా

 మా భావనలోని భావంలోనేనా

 విక్రుతవర్తనివో

సధ్భావామ్రుతవర్షిణివో

 నీపద తాడనలో

 నలిగి నసించి తెలుసుకోవలెనా?

విక్రుతమా నీ కాలి అందియల చప్పుళ్ళు

 కర్ణకఠోర లోహ శబ్దాల్లా కాక

మ్రుధు మధుర మంజీరనాదల్లా

మలచుకొని రా

 నీ పదఘట్టనలో నలుగి పోతున్నా

 కాలి గజ్జెల రవళి లో మైమర చైనా

మేం కిమ్మనం

 ఆకారం నీదెలా వున్నారా

 మాదగ్గర మేకప్ పార్కులు

 చాలానే వున్నాయి

 మేం స్వాగతించేంత

సుందరంగా తయారై వచ్చేయ్

 నీ మనసు ఎంత విక్రుతమైనా

మా రాజకీయ నాయకుల ముఖాల్లా

ముఖాన టెంపరరీ చిరునవ్వు ముసుగేసుకొనైనా

 మేం స్వాగతించేలా తయారై వచ్చెయ్

 ఆకారానికీ, అధికారానికీ,

ఆర్ధిక సంపన్నతకూ ఆడంబరాలకూ,

 ఆర్భాటాలకూ, భేషజాలకూ

 దాసోహమయి  

వున్నాం

మేము … తప్పక స్వాగతిస్తాం.