బ్లాగ్మిత్రులూ,…. ఇక వుంటా.
(ఎవరినైన నా మాటలతో నొప్పించివుంటె క్షంతవ్యుడను.)
మిత్రుడు: నూతక్కి రాఘవేంద్ర రావు.(గిజిగాడు)
తేదీ:30-04-2010
బ్లాగ్మిత్రులూ,
సాహితీ హితులూ,…
ఇలాగే ఎప్పుడో
మరెక్కడో
మరింకే సందర్భంలోనో
జీవన యానంలొ
మరలా కలుద్దాం.
….నిత్య జీవనయానం
ఓ రైలుబండి.
మనం యీ బ్లాగ్లోకమనే
కంపార్ట్మెంటులో కలిసి
కొంత దూరం
కలిసి ముచ్చటించుకుంటూ
కలిసి భావాలు పంచుకు తింటూ ..
మీవంటి మేధావులను
కలిసే అద్రుష్టాన్నిచ్చిన
బ్లాగ్ప్రక్రియకూ,స్రుష్టించిన శాస్త్రగ్నులకూ
అంతర్జాల సౌకర్యానికీ
నాక్రుతగ్నతలు
నా ల్యాప్ టాప్ కూ
నేర్పించిన ,
నా మనుమడికీ
మనుమరాళ్ళకూ
ప్రోత్సహించిన
మా అల్లుళ్ళకూ, బిడ్డలకూ,
మీదుమిక్కిలి ,
యీ సంవత్సరం మూడు మాసాలు
నను బ్లాగరుగా
భరించి సహకరించిన
మీ అందరికీ
నా భార్యామణికీ
హ్రుదయపూర్వక అభినందనలు.
యీ రోజు వరకు
i.e Dt.30-04-2010 …
మొత్తం ప్రచురణలు : 435
మొత్తం రచనలు : 308
మొత్తం చిత్రాలూ/
ఫొటొలూ : 127
వీక్షకులు : 90613
కామెంట్లు : 1040
.నాయీ సంవత్సరం మూడునెల్ల కాలంలో భరించి సహకరించి నాయీ బ్లాగులో సాహితీ సేద్యంలో…
మీరందించిన స్నేహ భావానికీ,అభిమానానికి చూపిన ఔదార్యానికీ…. ధన్యవాదాలు తెలుపుకొంటూ మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు సకల శుభాలు అందించాలని బ్లాగులో నా ప్రచురణలను విరమిస్తున్నయీ సందర్భంలో.. నను మరువబోరని,నా బ్లాగును నా ప్రచురణలను ఆదరిస్తూనే వుంటారని ఆకాంక్షిస్తూ.. మీ బ్లాగులను వీక్షిస్తూ మీ మధ్యనే వుంటానని తెలియజేసుకుంటూ.హ్రుదయపూర్వక నమస్కారాలు.,ఆశీస్సులూ,మీ అందరి శ్రేయోభిలాషి … గిజిగాడు…. నూతక్కి రాఘవేంద్ర రావు