బ్లాగ్మిత్రులూ,…. ఇక వుంటా.
(ఎవరినైన నా మాటలతో నొప్పించివుంటె క్షంతవ్యుడను.)
మిత్రుడు: నూతక్కి రాఘవేంద్ర రావు.(గిజిగాడు)
తేదీ:30-04-2010
బ్లాగ్మిత్రులూ,
సాహితీ హితులూ,…
ఇలాగే ఎప్పుడో
మరెక్కడో
మరింకే సందర్భంలోనో
జీవన యానంలొ
మరలా కలుద్దాం.
….నిత్య జీవనయానం
ఓ రైలుబండి.
మనం యీ బ్లాగ్లోకమనే
కంపార్ట్మెంటులో కలిసి
కొంత దూరం
కలిసి ముచ్చటించుకుంటూ
కలిసి భావాలు పంచుకు తింటూ ..
మీవంటి మేధావులను
కలిసే అద్రుష్టాన్నిచ్చిన
బ్లాగ్ప్రక్రియకూ,స్రుష్టించిన శాస్త్రగ్నులకూ
అంతర్జాల సౌకర్యానికీ
నాక్రుతగ్నతలు
నా ల్యాప్ టాప్ కూ
నేర్పించిన ,
నా మనుమడికీ
మనుమరాళ్ళకూ
ప్రోత్సహించిన
మా అల్లుళ్ళకూ, బిడ్డలకూ,
మీదుమిక్కిలి ,
యీ సంవత్సరం మూడు మాసాలు
నను బ్లాగరుగా
భరించి సహకరించిన
మీ అందరికీ
నా భార్యామణికీ
హ్రుదయపూర్వక అభినందనలు.
యీ రోజు వరకు
i.e Dt.30-04-2010 …
మొత్తం ప్రచురణలు : 435
మొత్తం రచనలు : 308
మొత్తం చిత్రాలూ/
ఫొటొలూ : 127
వీక్షకులు : 90613
కామెంట్లు : 1040
.నాయీ సంవత్సరం మూడునెల్ల కాలంలో భరించి సహకరించి నాయీ బ్లాగులో సాహితీ సేద్యంలో…
మీరందించిన స్నేహ భావానికీ,అభిమానానికి చూపిన ఔదార్యానికీ…. ధన్యవాదాలు తెలుపుకొంటూ మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు సకల శుభాలు అందించాలని బ్లాగులో నా ప్రచురణలను విరమిస్తున్నయీ సందర్భంలో.. నను మరువబోరని,నా బ్లాగును నా ప్రచురణలను ఆదరిస్తూనే వుంటారని ఆకాంక్షిస్తూ.. మీ బ్లాగులను వీక్షిస్తూ మీ మధ్యనే వుంటానని తెలియజేసుకుంటూ.హ్రుదయపూర్వక నమస్కారాలు.,ఆశీస్సులూ,మీ అందరి శ్రేయోభిలాషి … గిజిగాడు…. నూతక్కి రాఘవేంద్ర రావు
ఏప్రిల్ 30, 2010 at 1:51 ఉద.
ఇదేంటండి,నేను మొన్నే కామెంటు రాసాను ఇవ్వాళమీరు సెల్వంటున్నారు ??
మే 1, 2010 at 12:44 ఉద.
డియర్ ,కుమార్… మిత్రమా.,నేనుక్రొత్తగా రచనలు ప్రచురించ బోవడం లేదు, చిత్రాలూ ఫోటోలూ ప్రచురించ బోవడంలేదు .అంతేగాని,నా బ్లాగులో పాతవన్నీ అలాగే వుంటాయి కదా . మీ పోష్టులను చూస్తూనే వుంటాను. పలకరిస్తూనే మీ మధ్యనే వుంటాను. శ్రేయోభిలాషి ……గిజిగాడు .
ఏప్రిల్ 30, 2010 at 2:45 ఉద.
అదేమిటండి. సెలవంటున్నారు? అంతా సవ్యమేనా? ఒక ప్రయత్నం నుంచి మరొక దిశగా సాగే సమయాన కొన్ని వదులుకోక తప్పదు కనుక, మీ నిర్ణయం ఒక కారణానికి అయి ఉంటే సదా మీకు జయం కలగాలని ప్రార్దిస్తూ..
-ఉష
మే 1, 2010 at 2:20 ఉద.
అమ్మాయ్ ఉషా ! అంతా సవ్యమే .కంగారు పడవలసిందేమీ లేదు. .మీరంతా క్షేమమే కదా . ఈ బ్లాగ్ కార్యక్రమాలవల్ల బొత్తిగా సోషల్ మూవింగ్ తగ్గి ,బంధువులతో స్నేహితులతో విరివిగా కలవలేక పోవడం అందువల్ల సమాజానికి దూరమైపోతున్నాం. ఆత్మీయతతో కూడిన “అంతా సవ్యమేగా” అన్న నీ పలుకరింపు ఎంతో ఆనందం కలిగించింది. నీవు ఊహించింది వాస్తవమే. ఎప్పుడో తలపెట్టిన ఆర్ట్ గ్యాలరీ,ఆర్ట్ స్టూడియో స్థాపించి ,పదిమందీ కళలు నేర్చుకొనే వెసులుబాటు నిద్దామని యోచన. స్వతహాగా పెయింటింగ్ నేర్చుకొనే యత్నం. అందుకే కొంతకాలం బ్లాగ్లోకానికి నా సెలవు. అప్పుడప్పుడూ హాయ్ బాబాయ్ అంటూ వుంటే … ఆక్సిజెన్ అందినట్లు ఉంటుందికదా. పిల్లలు ,మనుమలూ మాట్లాడినప్పుడు నేనూ నా భార్యా అలాటి అనుభవానికే లోనవుతుంటాం. ఆశీస్సులతో శలవు…. నూతక్కి /గిజిగాడు.
ఏప్రిల్ 30, 2010 at 8:43 ఉద.
అయ్యో అదేంటండీ ..మీ గిజిగాడు తప్పకుండా చూస్తుంటాను ..మీ చిత్రాలు …పూలు పక్షులు అన్ని అలరిస్తుంటాయి …రోజు బాగుంది అనడానికి ‘చర్వితచరణం ‘అవుతుందని కామెంట్ రాయడం లేదు …అపుడపుడు కనబదండి
మే 1, 2010 at 1:22 ఉద.
డియర్ చిన్ని గారూ,నాపైనున్న అభిమానానికి ధన్యుణ్ణి. మీకు మరీ అంత దూరంగా వెళ్ళడం లేదండీ. ఈ అంతర్జాలం, బ్లాగులు, సాంకేతిక సౌకర్యాలూ ప్రపంచంలో ఎక్కడున్నా ప్రక్క పోర్షన్ నుంచి పలకరించినట్లే వుంటుంది కదా ? ఆ సాంకేతిక ప్రజ్ఞావంతులందరికి …వారందరికీ కైమోడ్చి నమస్కరించాలి. మీ బ్లాగులు చూస్తూనే నేను తలపెట్టిన కొన్ని పనులు పూర్తిచేసుకోవాలి . గత సంవత్సరం మూడు మాసాలుగా అనేక పనులు ఆగిపోయి వున్నాయి. నేను వ్రాయకున్నా నా బ్లాగును ఆదరిస్తారని నా నమ్మకం.. అభిమానంగా …..మీ గిజిగాడు.
ఏప్రిల్ 30, 2010 at 12:49 సా.
రాఘవేంద్రరావు గారు
ఏమిటండీ ఇంత ఆకస్మాత్ నిర్ణయం. మొన్నేమో టపాలు వ్రాయడం మాని బ్లాగ్లు చూస్తానన్నారు. ఇప్పుడు మొత్తం సెలవు తీసుకొంటున్నారు. ముఖాముఖి పరిచయం లేకున్నా మీ నిర్ణయం ఎందుకో బాధ కలిగిస్తోంది. రోజుకాకపోయినా అప్పుడప్పుడు వ్రాయండి. ఆలోచించండి.
ఏప్రిల్ 30, 2010 at 6:33 సా.
ఇప్పుడు కూడా అదే అంటున్నారు. తన ప్రచురణలు విరమించుకుంటున్నారు కానీ (ఇది కేవలం తాత్కాలికంగానే అనుకుంటున్నా) మన బ్లాగులు వీక్షిస్తూనే ఉంటారు.
మే 1, 2010 at 1:10 ఉద.
డియర్ రవి మీరు కొంతవరకు వాస్తవం ఆలోచించారు . యి బ్లాగ్ మొదలెట్టిన దాది నా పెయింటింగ్ యాక్టివిటీ,ఫోటోగ్రఫి పూర్తిగా వెనుకబడిపోయింది.ఎందరో పాత స్నేహితులు చిత్రాలు పంపమని అడుగుతుంటారు.వాళ్లకు నేనెట్లా వేసినా ఆనందమే . అలాగని పెద్ద పెద్ద పెయింటిగ్ లు వేసేంత వాణ్ని కాదు కాని ..పాటల్లో బాత్రూం సింగర్ లా…. చిత్ర కళలో… కాగితం, రంగులూ కనబడితే ……అలా అలా కూనిరాగాల్లా చింకిరి బొమ్మలు ..అందుకే నేర్చుకోవాలని నా ప్రయత్నం. అందుకే మిత్రులందరి వద్దా సెలవడిగా . రవి! బ్లాగ్మిత్రులేవరో కొన్ని సలహాలడిగారు . మిమ్మల్ని సంప్రదించమని చెప్పా దయచేసి .నా మాట తిసేయకండి. మీ మధ్యనే వుంటూ మీ రచనలు చూస్తూనే నా పనులు నేను చేసుకుంటా. కామెంట్లకు సమయముంటుందో లేదో మరి…. అవకాశాన్ని బట్టి …….ఆప్యాయతతో ….మీ గిజిగాడు.
మే 2, 2010 at 11:16 ఉద.
తప్పకుండా అడగమనండి సార్… నా మెయిల్ కూడా ఇవ్వండి. ఏ సందేహమైనా తప్పకుండా తీర్చడానికి ప్రయత్నిస్తాను.
మే 2, 2010 at 12:49 సా.
థాంక్యూ ! రవి ,నా కామెంట్లకు ఇచ్చిన సమాధానంలోవారికి తెలియపరిచాను . బహుశా మిమ్మల్ని సంప్రదించవచ్చు.మరల కలుద్దాం. శ్రేయోభిలాషి …నూతక్కి.
మే 1, 2010 at 1:35 ఉద.
డియర్ శ్రీవాసుకి గారు, ఉగాది నుండే మానేద్దామనుకున్నాగిజిగాడికి వచ్చిన ఆదరణతో ఒక నెల వాడి ఉత్సాహాన్ని కొనసాగించా.యిక తప్పక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పెయింటింగ్ నేర్చుకొంటూనే ఆర్టు స్టూడియో, గ్యాలరీ ఒక దాన్ని నేలకోలపాలనే నా చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలనే యత్నం …. చూడాలి ఈ వయసులో నా కోరిక నెరవేరుతుందో లేదో. అయినా నేను మీతోనే ఉంటానుగా. అవకాశాన్ని బట్టి మీ అందరి రచనలూ చూస్తూనే వుంటాను. నా బ్లాగును ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది . ఆప్యాయతతో …గిజిగాడు.
ఏప్రిల్ 30, 2010 at 8:25 సా.
మీకు వీలైనప్పుడే రాస్తుడవచ్చుకదా ? సెలవుతీసుకొనవలసినదేనా ?
మే 6, 2010 at 1:26 ఉద.
శ్రీ దుర్గేశ్వర్ గారూ,ఏదైనా యిప్పుడేమీ చెప్పలేకపోతున్నాను. మీ ఆత్మీయతకు ధన్యుణ్ణి. శ్రేయోభిలాషి …నూతక్కి
మే 1, 2010 at 9:59 ఉద.
రాఘవేంద్రరావు గారు
ఆర్ట్ గేలరీ నెలకొల్పాలన్న మీ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను. మీ ప్రయత్నం తప్పక నెరవేరుతుంది. మమ్మల్ని మరిచిపోకుండా మధ్యమధ్యలో బ్లాగ్ లోకి, ఇ-మెయిల్ లోకి ఓ చూపు చూస్తూ ఉండండి. వీలుంటే తర్వాత మీ ఆర్ట్ గేలరీ సంగతులు మాతో పంచుకోండి.
అభిమానంతో
శ్రీవాసుకి
మే 1, 2010 at 11:04 ఉద.
థాంక్యూ శ్రివాసుకి గారూ, తప్పక మనం కలుస్తూనే వుందాం.బ్లాగ్లోకంలొ గత కొన్ని నెలలుగా మీరంతా అందించిన ఆదరణ ఆత్మీయతా ఆప్యాయత లు నేను మరువలేను ….Nutakki
మే 3, 2010 at 8:44 ఉద.
మీ గిజిగాడు గూడు బ్లాగులోనైనా చూసి ఆన౦ది౦చే వాళ్ళలో నును ఒకడిని సార్. ఎ౦దుచేతన౦టే ప్రకృతిలో గిజిగాడు కనబడుట లేదు. మీ అకస్మాత్ నిర్ణయం తాత్కాలికం కావాలని, మీ కొత్త పని సఫలం కావాలని కోరుకుంటూ నమస్కారములతో..
మే 3, 2010 at 10:07 ఉద.
ఆర్యా,(అ)సామాన్యా! వెల్కమ్. కొద్ది సమయం లేఖలకు సమాధానమిచ్చేందుకు తప్ప , వేరే విషయాలపైననే ఎక్కువ సమయం కెటాయించడం జరుగుతోంది. చేసే పనికి పూర్తి న్యాయం చేయాలి లేకుంటే విరమించుకోవాలి. అందుచేత యీ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.మీరంతా నాపై చూపుతున్న అభిమానానికి ధన్యుణ్ణి………శ్రేయోభిలాషి … నూతక్కి/గిజిగాడు
మే 3, 2010 at 10:07 ఉద.
It is not good gijigaaru.. One should continue.. There is no “STOP” for you to get down in this blog world.. sorry..it is my feeling..
మే 6, 2010 at 1:22 ఉద.
Dear sri Mohanram prasad. Thanks for your concern. I will be back with you after some time .
Due to some personal reasons I am unable to manage multiple tasks at a time.Time is the major factor.when ever I feel free ..I will be back with you people.
with wishes….Nutakki
మే 5, 2010 at 11:09 సా.
Will u please mail me once?
మే 6, 2010 at 12:49 ఉద.
Sure….. nutakki
మే 7, 2010 at 10:55 ఉద.
ayyo ademitandi ala okka sari. mee kavitalu, writings, photos memu chala enjoy chesamu. e-mail address veelaithe prachurinchandi. maa laati abhimanulu eppudaina contact cheyyadaniki upayogam untundi. chala thanks andi mammalni chakkanna innallu santosha pettinanduku
మే 7, 2010 at 3:26 సా.
Dear udaysandhya gaaroo , thank you for the concern shown. Due to some unavoidable reasons I am unable to spend time towards blogging. If you want to reach me you can comment on any of my article puplished in this blog.. with cordial wishes….Nutakki raghavendra Rao/Gijigaadu.
మే 19, 2010 at 11:08 సా.
Miss u Sir….
మే 20, 2010 at 4:31 సా.
పద్మార్పిత గారూ హృదయపూర్వక సుభాసీస్సులు అంతా మీ అభిమానం. అనేకానేక పనుల వత్తిడిలో బ్లాగ్ కు , బ్లాగ్ వీక్షకులకూ న్యాయం చేయలేననే ఉద్దేశ్యంతో బ్లాగుల్లో వ్రాయడం విరమించుకున్నాను. చూద్దాం అవకాశాన్ని బట్టి మరలా బ్లాగ్మిత్రులతో కలుస్తాను. ,ఈ మధ్య వచ్చిన తుఫాను వేగానికి చెట్లు కూలి 11kv లైను పై పడి ఆ క్రింద వున్న మా కు కనెక్షన్ వున్న 440v లైన్ మీద పడటం తో హై వోల్టేజ్ తో నా ల్యాప్ టాప్ …ఏమయ్యిందో తెలియదు. ప్రస్తుతం కొద్ది రోజులుగా పనిచేయడం లేదు. అందు చేత మీకు సమాధానం లేటయ్యింది. అన్యదా భావించ వలదు. శ్రేయోభిలాషి. …నూతక్కి
మే 21, 2010 at 9:05 సా.
మీ ఆర్ట్ గాలరీ కి బెస్ట్ ఆఫ్ లక్ అండి .
మే 22, 2010 at 12:26 సా.
ధన్యవాదాలు మాలా కుమార్ గారూ.మీ అందరి అభిమానం, ప్రోత్సాహం….. నా అభిలాష నెరవేరే ప్రక్రియలో కొండంత దన్నుగా ఉటుందని భావిస్తున్నాను. వుంటాను.ఆశీస్సులతో … శ్రేయోభిలాషి …నూతక్కి
మే 30, 2010 at 2:46 సా.
g ideandi mallaa…? j ara mii art studio address post cheyyaraadea…! hai maastaruu! anyway all the best!
మే 30, 2010 at 7:45 సా.
హాయ్ ! అశ్వని శ్రీ …..సాన రోజులాయె ,ఎట్లున్నావు తల్లీ, మీరంతా మంచిగున్నర? నీ ఆరోగ్యమెట్లుంది?అప్పుడప్పుడు గిట్లనే జర ఇసారిన్చుకుంటుంటే జర మంచిగుంటది కదా !
అనుకున్నట్లు పనులు నడవట్లే .స్టూడియో పనులెవి యింగా షురూ కాలే. యిప్పటికి యింతనే …. వుంటా మల్ల. సుభాసీస్సులతో శ్రేయోభిలాషి …గిజిగాడు.