దీపావళి పర్వదిన శుభాకాంక్షలు .
ఈ దీపావళి మీ జీవితాలలో భవ్యమైన ఆశావహ  కాంతులు
నింపాలని ఆకాంక్షిస్తూ  బ్లాగ్మిత్రులందరికీ …భవదీయుడు ….
నూతక్కి.
దీపావళి

దీపావళి…. ఎన్నెన్నో బాల్య స్మృతులు

మతాబాల విరి జల్లులా
దీపావళి ….ఎన్నెన్నో మధురోహలు
గిర్రున తిరిగే భూచక్రపు టిరుసులా
దీపావళి .. చిమ్మ చీకటిన సూన్యంలో
నర్తించే విష్ణు చక్రపు విన్యాసంలా
నయగారాల మయూరిలా …
ఆకసానకెగసి జారే  కాంతిపూలు
నయాగరా జలపాతంలా
.చిచ్చుబుడ్లు వెదజల్లిన  జల్లులు
కాకరపూవొత్తుల మాలికలో
పూల పొట్లాలు విరజిమ్మిన
కాంతుల రవ్వలో
దీపావళి రోలు రోకళ్ళు సృష్టించే
శబ్దతరంగాలో
దీవిటీల సయ్యాటల విన్యాసాలో
జెల్లీ ల పితూరీలో
లక్ష్మీ బాంబుల విస్ఫోటాలో
అమవస నిసిలో ఆకసాన
రాకెట్లు సృష్టించే హరివిల్లులో  …
ప్రమిదల వెలుగుల్లో
ప్రమదల ప్రమోదాల
పరవశాలో
పట్టు పరికిణీల
రెపరెపల కాంతుల్లో
కన్నెల కేరింతల రవళులో
చిమ్మ చీకటిన విరిసిన కాంతులు…
విరజిమ్మిన దృశ్య కావ్యమో  …
ప్రమోదాల హేళి   దీపావళి
ప్రమాదాల సహేలి దీపావళి