డిసెంబర్ 2010


మీ అందరి  డెందా ల లో….నిలిచి వున్నా…
రచన:నూతక్కి.

బ్లాగుల్లో  నే

వ్రాయక ప్రచురించక
మిము పలుకరించక
సంవత్సర కాలం
యిట్టే గడచినా
నిన మొన్నలా
మీ యందరి
జ్ఞాపకాలు
సుడులు సుడులుగా
నా మది పొరలలో …..
మీకు దూరంగా వుండి
యిన్ని నాళ్ళు
సాధించిందంటూ
ఏమీ లేకున్నా,
మీగుండెల లోలోతుల
ఎకొనలోనో ‘ నే’
నిండి వున్నా.
తృప్తిగా ….
అందులకే
ఆనందంతో
‘నే’ మిన్నకున్నా,……
క్రొత్త సంవత్సరం
మీ జీవన గమనంలో
నవ్య కాంతులు నింపాలని
ఆకాంక్షిస్తున్నా
నూతన వత్సర శుభాకాంక్షలు.
స్వాగత వీడ్కోలులు.
రచన : నూతక్క్కి

దుర్భర స్థితిగతుల 2010 కి
వీడ్కోలునందిస్తూ
2011 ను  స్వాగతిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

యుద్ధాలూ,

మానవ హననాలూ,
ఉగ్రవాద విక్రుతాలూ,
మత ద్వేషాలూ ..

ప్రపంచ వ్యాప్తంగానూ…….,

విదేశీ దురాక్రమణ ల
విపరీత ధోరణులూ,
ప్రాంతీయ వేర్పాటు వాదనలు,
జలవనరుల పంపకాల
అసమానలతలు,
అంతర్గత
వైషమ్యభావనలు ,
తీవ్ర వాద వికృత
విన్యాసాలు,
దేశ వ్యాప్తంగానూ……..,
బందులూ, రాస్తారోకోలూ,
ప్రయాణ సాధనాల
ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల
విధ్వంసాలూ
దహనాలూ,దోపిడీలూ,
దొంగతనాలూ,అందోళనలూ,
హంగర్ స్ట్రైక్ లూ
అనారోగ్యాలూ,ఆత్మహత్యలూ,
హత్యలూ,
అత్యాచారాలూ,మానభంగాలూ,
యాసిడు దాడులూ,
యాచకత్వం,దొంగతనాలూ,

లంచాలు,అధికారుల అక్రమాలూ ,
రాజకీయుల అనైతిక విన్యాసాలూ
అధికార,ప్రజా  ధన
దుర్వినియోగాలూ ,
ఆశ్రిత పక్షపాతాలూ ,
దురాగతాలూ,
ప్రాకృతిక ప్రకోపాలూ,
కరువులూ ,వరదలూ
తుఫానులూ,
అన్నదాతల ఆక్రోశాలూ,
భవిష్య నిర్దేశ కత
కాన రాక
యువత పట్టిన  పెడ దారుల
పయనాలూ,
నిరుద్యోగం,
ఆకలి చావులూ ,
బ్రతుకు అగమ్యమై
ఆకలి తీర్చే అన్న దాత
ఆత్మ హత్యలూ,
తనువును  కప్పి శీతో ష్ట్నాలనుంచి
మనిషిని కాపాడేందుకు  బట్టను సృష్టించి
తన తనువును కాపాడుకోలేని
నేతన్నల దుర్మరణాలూ
ఆరుగాలం శ్రమించినా
ఆకలి తీరని అభాగ్య
వ్రుత్తి   జీవుల వేదనలూ …..
ఆకాశాన్నంటి అత్యవసర
నిత్య వినియోగ   సరకుల
ధరలు అందుకోలేక …జన సామాన్యం
ప్రాంతీయంగానూ ….
ఇవేవీ
కానరాని కొంగ్రొత్త సంవత్సరం… ఈ నూత్న వత్సరం 2011 కావాలని ……. శుభ ఆకాంక్షలతో ,
ప్రపంచ మంతటా అన్ని దేశాల ప్రజలకూ తిండీ, గుడ్డా, నీడా, మంచి నీరూ, మంచి గాలీ,నాణ్యమైన….  వైద్య సదుపాయాలూ, ప్రయాణ సదుపాయాలూ,వినోదవనరులూ,,స్త్రీ జాతికి గౌరవం, రక్షణ,శిశువులకు సంరక్షిత ఆహార వైద్య  సంవిధానాలూ,  విద్యార్ధులకు సామాజిక విలువలతో కూడిన ఉచిత  విద్య,  క్రమ శిక్షణ, యువతకు వుపాధి వనరులు, వృద్ధులకు,వికలాంగులకూ  సర్వ  విధాల ఆదరణ,   అందించే ప్రభుత్వాలు….
ప్రపంచ వ్యాప్తంగా  సకల దేశాల ప్రజలకూ లభించేలా  , ప్రజలు  తమదైన భాత్యతలను గుర్తించి   నిర్వర్తించేలా ,ఈ క్రొంగ్రొత్త వత్సరం 2011 ప్రపంచ  వ్యాప్త మానవాళి సంక్షేమాన్ని కాపాడుతుందని ఆకాంక్షిస్తూ ……
భూమాతను తొలచి వొలిచి ధ్వంసం చేసి తమ ఉనికికే ప్రమాదం  తెచ్చుకోకుండా ,భూమాతకు అరుణుని  ఆల్ట్రా వైలట్ కిరాణా లనుండి  రక్షణనందిస్తున్న ఓజోను రక్షణ వలయాన్ని సంరక్షించుకొనే దిశగా చర్యలు తీసుకొంటూ……..,
ప్రక్రుతి అందిస్తున్న సూర్య శక్తి, వాయు శక్తీ, సముద్ర జల శక్తీ,వంటి  భూ బాహ్య వనరులనుండి  శక్తిని గ్రహించి
వినియోగించుకొనే దిశగా శాస్త్ర విజ్ఞాన్ని వినియోగించుకొని ,ముందుకు నడచి ప్రతీ మనిషీ, ఖండాలూ , దేశాలూ, ప్రాంతా లూ ,అనే కుస్చ్చితనిస్చ్చితాలు లేకుండా,తమ హక్కులను వినియోగించుకొనే విధంగా, కుల మత వర్గ భావ  రహితంగా   తోటి మానవుని  మనుగడను    గౌరవించి సహకరించాలని ,తోటి జీవకోటిని సంరక్షించి, తమ మనుగడను కాపాడుతున్నప్రకృతిని చిద్రం చేయకుండా సంరక్షించుకోవాలని ఆకాంక్షిస్తూ,కోపం ఉద్రేకం ఉద్వేగం  వంటి పలు తాపాలను  నియంత్రించు కొని ఆరోగ్యవంతమైన మనసులున్న మనుషులుగా  మానవ సమాజోద్దరణకు,జీవావరణ సంరక్షణకూ  తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఇవే మా నూత్న వత్సర శుభాకాంక్షలు…..నిత్య శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
GSLV F6 వైఫల్యం
( క్షమార్హం కాదు,కాదు కాక కాదు.)
రచన: నూతక్కి

పరిశోధనా ప్రయోగాల

తొలిదశలో పరాజయాలు
సహజం   క్షమార్హం.
కాని ,
ఎన్నో వత్సరాల శోధనలు   ,
ఎన్నెన్నో వైఫల్యాలు
సత్ఫల ప్రయోగాలు …
ఇప్పుడు
ఎందులకీ  వైఫల్యం !…
లక్షల కోట్ల ప్రజాధన వినియోగం
ఎన్నోసంవత్సరాల నిష్ఫలఅనుభవం
చేసిన  వికటాట్టహాస విన్యాసం
ఆకలి కడుపులు అందించిన ధనం
అందున  గడించిన అమోఘ అనుభవం ,
ప్రపంచ ఖ్యాతి, గడించినా
అక్కరకు తేలేని  నిర్లక్ష్యపు క్రీనీడల్లో  .
కోట్లాది ప్రజల ఆకాంక్షలు ,
మరెన్నో కోట్ల ఆకలి కడుపుల
నిర్వేదనలు,
నింగికెగసిన
జి ఎస్ ఎల్వి ఎఫ్ సిక్స్
ప్రయోగ  శాస్త్రజ్ఞుల నిర్లక్ష్యపు
నిర్వాహకాన   కడలి కూలిన
ఆకలి కూకల ఆహారవాలు.
లెక్కలు చెప్పాల్సిన అవసరంలేదు.
ఆ  వెసులుబాటులో
ప్రజా ధనం  ,ఆకాంక్షలు,
భవితపై  పై  వారి నోట వూరిన ఆశలు
అవేవీ   తమకు పట్టనంత నిర్లక్ష్యం!!!
శాస్త్రజ్ఞుల అహంకార
నిర్లక్ష్యపు ధోరణి
క్షమార్హమా !
కాదు.కాదు
ఎంత మాత్రం కాదు.

వైఫల్యానంతరం
విచారించినా అంత మాత్రాన,
ఒరిగేదేముందని
ఆకలికి అలవాతుపడుతూ
ఆ అలవాటే అలవాటై
ఆకలి దప్పులనుండి
అనంత విశ్వం లోకి
అనంత పయనం   తప్ప.
వైఫల్యాల నుండి
పాఠాలు నేర్చుకొంటున్నామనే
భ్రమలో
ఇంకా ఇంకా ఎన్ని దశాబ్దాలు
ప్రజలను మభ్యపెట్టి
ప్రజాధన దహనకాండ ?
వైఫల్యం విజయానికి మెట్టని ……
ప్రజలను ఇంకా ఇంకా
ఎంతకాలమని
నమ్మించాలని ?
నీట మండి muniginadi
వందలు, వేలు, లక్షలు కాదు
వేల కోట్ల  ప్రజా ధనం.
ఆకలి కడుపులు ఆకళ్ళతో
మండుతూనే వున్నాయ్.
ఆకాంక్షలు నిండి వున్నా
కళ్ళల్లో
మండుతున్న ఆశల నెగళ్లు .
ప్రకృతితో బాటు  ప్రభుత్వాలూ సృష్టించిన, కష్టాల కడలిలో, చావు బ్రతుకులతో పోరు సలుపుతూ  …. కోట్లాది భారత ప్రజలు .వారికి ఏమని   ఎవరు సమాధానం చెబుతారు? వందల కోట్ల ప్రజా ధనం  త్రుటిలో  కడలి పాలు. భయంకర నిర్లక్ష్యపు క్రీనీడల్లో  ఈ తీరున  దుర్వినియోగం లో ప్రజాధనం.
భాద్యత ఎవరిదీ?
ప్రభుత్వానిదా ?
శాస్త్రజ్ఞుల దా ?
ప్రతి రూకా యోచనతో ..వెచ్చించి ఆకలి కడుపులు నింపవలసిన  ప్రస్తుత క్లిష్ట దశలో యింతటి నిర్లక్ష్య వైఖరి క్షమార్హం  ఎంత మాత్రం కాదు.కాదు.కాదు.
We wish with heart
All those devotees
Who got belief and Faith
On Lord Christ,
All over the  ‘Planet Earth
On this Great eve of ‘XMAS’ 2010.
“WISH YOU All A HAPPY CHRISTMAS”

….Nutakki Raghavendra Rao.