GSLV F6 వైఫల్యం
( క్షమార్హం కాదు,కాదు కాక కాదు.)
రచన: నూతక్కి
పరిశోధనా ప్రయోగాల
తొలిదశలో పరాజయాలు
సహజం క్షమార్హం.
కాని ,
ఎన్నో వత్సరాల శోధనలు ,
ఎన్నెన్నో వైఫల్యాలు
సత్ఫల ప్రయోగాలు …
ఇప్పుడు
ఎందులకీ వైఫల్యం !…
లక్షల కోట్ల ప్రజాధన వినియోగం
ఎన్నోసంవత్సరాల నిష్ఫలఅనుభవం
చేసిన వికటాట్టహాస విన్యాసం
ఆకలి కడుపులు అందించిన ధనం
అందున గడించిన అమోఘ అనుభవం ,
ప్రపంచ ఖ్యాతి, గడించినా
అక్కరకు తేలేని నిర్లక్ష్యపు క్రీనీడల్లో .
కోట్లాది ప్రజల ఆకాంక్షలు ,
మరెన్నో కోట్ల ఆకలి కడుపుల
నిర్వేదనలు,
నింగికెగసిన
జి ఎస్ ఎల్వి ఎఫ్ సిక్స్
ప్రయోగ శాస్త్రజ్ఞుల నిర్లక్ష్యపు
నిర్వాహకాన కడలి కూలిన
ఆకలి కూకల ఆహారవాలు.
లెక్కలు చెప్పాల్సిన అవసరంలేదు.
ఆ వెసులుబాటులో
ప్రజా ధనం ,ఆకాంక్షలు,
భవితపై పై వారి నోట వూరిన ఆశలు
అవేవీ తమకు పట్టనంత నిర్లక్ష్యం!!!
శాస్త్రజ్ఞుల అహంకార
నిర్లక్ష్యపు ధోరణి
క్షమార్హమా !
కాదు.కాదు
ఎంత మాత్రం కాదు.
వైఫల్యానంతరం
విచారించినా అంత మాత్రాన,
ఒరిగేదేముందని
ఆకలికి అలవాతుపడుతూ
ఆ అలవాటే అలవాటై
ఆకలి దప్పులనుండి
అనంత విశ్వం లోకి
అనంత పయనం తప్ప.
వైఫల్యాల నుండి
పాఠాలు నేర్చుకొంటున్నామనే
భ్రమలో
ఇంకా ఇంకా ఎన్ని దశాబ్దాలు
ప్రజలను మభ్యపెట్టి
ప్రజాధన దహనకాండ ?
వైఫల్యం విజయానికి మెట్టని ……
ప్రజలను ఇంకా ఇంకా
ఎంతకాలమని
నమ్మించాలని ?
నీట మండి muniginadi
వందలు, వేలు, లక్షలు కాదు
వేల కోట్ల ప్రజా ధనం.
ఆకలి కడుపులు ఆకళ్ళతో
మండుతూనే వున్నాయ్.
ఆకాంక్షలు నిండి వున్నా
కళ్ళల్లో
మండుతున్న ఆశల నెగళ్లు .
ప్రకృతితో బాటు ప్రభుత్వాలూ సృష్టించిన, కష్టాల కడలిలో, చావు బ్రతుకులతో పోరు సలుపుతూ …. కోట్లాది భారత ప్రజలు .వారికి ఏమని ఎవరు సమాధానం చెబుతారు? వందల కోట్ల ప్రజా ధనం త్రుటిలో కడలి పాలు. భయంకర నిర్లక్ష్యపు క్రీనీడల్లో ఈ తీరున దుర్వినియోగం లో ప్రజాధనం.
భాద్యత ఎవరిదీ?
ప్రభుత్వానిదా ?
శాస్త్రజ్ఞుల దా ?
ప్రతి రూకా యోచనతో ..వెచ్చించి ఆకలి కడుపులు నింపవలసిన ప్రస్తుత క్లిష్ట దశలో యింతటి నిర్లక్ష్య వైఖరి క్షమార్హం ఎంత మాత్రం కాదు.కాదు.కాదు.
డిసెంబర్ 26, 2010 at 12:23 సా.
Please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.
డిసెంబర్ 26, 2010 at 8:36 సా.
Dear Sriram ! I watched as you suggested, and admired after watching greatness of our
Telugu people’s talents.Thanq.Wish you all the best and festival season’s greetings….Nutakki