నూతన వత్సర శుభాకాంక్షలు.
స్వాగత వీడ్కోలులు.
రచన : నూతక్క్కి
దుర్భర స్థితిగతుల 2010 కి
వీడ్కోలునందిస్తూ
2011 ను స్వాగతిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
యుద్ధాలూ,
మానవ హననాలూ,
ఉగ్రవాద విక్రుతాలూ,
మత ద్వేషాలూ ..
ప్రపంచ వ్యాప్తంగానూ…….,
విదేశీ దురాక్రమణ ల
విపరీత ధోరణులూ,
ప్రాంతీయ వేర్పాటు వాదనలు,
జలవనరుల పంపకాల
అసమానలతలు,
అంతర్గత
వైషమ్యభావనలు ,
తీవ్ర వాద వికృత
విన్యాసాలు,
దేశ వ్యాప్తంగానూ……..,
బందులూ, రాస్తారోకోలూ,
ప్రయాణ సాధనాల
ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల
విధ్వంసాలూ
దహనాలూ,దోపిడీలూ,
దొంగతనాలూ,అందోళనలూ,
హంగర్ స్ట్రైక్ లూ
అనారోగ్యాలూ,ఆత్మహత్యలూ,
హత్యలూ,
అత్యాచారాలూ,మానభంగాలూ,
యాసిడు దాడులూ,
యాచకత్వం,దొంగతనాలూ,
లంచాలు,అధికారుల అక్రమాలూ ,
రాజకీయుల అనైతిక విన్యాసాలూ
అధికార,ప్రజా ధన
దుర్వినియోగాలూ ,
ఆశ్రిత పక్షపాతాలూ ,
దురాగతాలూ,
ప్రాకృతిక ప్రకోపాలూ,
కరువులూ ,వరదలూ
తుఫానులూ,
అన్నదాతల ఆక్రోశాలూ,
భవిష్య నిర్దేశ కత
కాన రాక
యువత పట్టిన పెడ దారుల
పయనాలూ,
నిరుద్యోగం,
ఆకలి చావులూ ,
బ్రతుకు అగమ్యమై
ఆకలి తీర్చే అన్న దాత
ఆత్మ హత్యలూ,
తనువును కప్పి శీతో ష్ట్నాలనుంచి
మనిషిని కాపాడేందుకు బట్టను సృష్టించి
తన తనువును కాపాడుకోలేని
నేతన్నల దుర్మరణాలూ
ఆరుగాలం శ్రమించినా
ఆకలి తీరని అభాగ్య
వ్రుత్తి జీవుల వేదనలూ …..
ఆకాశాన్నంటి అత్యవసర
నిత్య వినియోగ సరకుల
ధరలు అందుకోలేక …జన సామాన్యం
ప్రాంతీయంగానూ ….
ఇవేవీ
కానరాని కొంగ్రొత్త సంవత్సరం… ఈ నూత్న వత్సరం 2011 కావాలని ……. శుభ ఆకాంక్షలతో ,
ప్రపంచ మంతటా అన్ని దేశాల ప్రజలకూ తిండీ, గుడ్డా, నీడా, మంచి నీరూ, మంచి గాలీ,నాణ్యమైన…. వైద్య సదుపాయాలూ, ప్రయాణ సదుపాయాలూ,వినోదవనరులూ,,స్త్రీ జాతికి గౌరవం, రక్షణ,శిశువులకు సంరక్షిత ఆహార వైద్య సంవిధానాలూ, విద్యార్ధులకు సామాజిక విలువలతో కూడిన ఉచిత విద్య, క్రమ శిక్షణ, యువతకు వుపాధి వనరులు, వృద్ధులకు,వికలాంగులకూ సర్వ విధాల ఆదరణ, అందించే ప్రభుత్వాలు….
ప్రపంచ వ్యాప్తంగా సకల దేశాల ప్రజలకూ లభించేలా , ప్రజలు తమదైన భాత్యతలను గుర్తించి నిర్వర్తించేలా ,ఈ క్రొంగ్రొత్త వత్సరం 2011 ప్రపంచ వ్యాప్త మానవాళి సంక్షేమాన్ని కాపాడుతుందని ఆకాంక్షిస్తూ ……
భూమాతను తొలచి వొలిచి ధ్వంసం చేసి తమ ఉనికికే ప్రమాదం తెచ్చుకోకుండా ,భూమాతకు అరుణుని ఆల్ట్రా వైలట్ కిరాణా లనుండి రక్షణనందిస్తున్న ఓజోను రక్షణ వలయాన్ని సంరక్షించుకొనే దిశగా చర్యలు తీసుకొంటూ……..,
ప్రక్రుతి అందిస్తున్న సూర్య శక్తి, వాయు శక్తీ, సముద్ర జల శక్తీ,వంటి భూ బాహ్య వనరులనుండి శక్తిని గ్రహించి
వినియోగించుకొనే దిశగా శాస్త్ర విజ్ఞాన్ని వినియోగించుకొని ,ముందుకు నడచి ప్రతీ మనిషీ, ఖండాలూ , దేశాలూ, ప్రాంతా లూ ,అనే కుస్చ్చితనిస్చ్చితాలు లేకుండా,తమ హక్కులను వినియోగించుకొనే విధంగా, కుల మత వర్గ భావ రహితంగా తోటి మానవుని మనుగడను గౌరవించి సహకరించాలని ,తోటి జీవకోటిని సంరక్షించి, తమ మనుగడను కాపాడుతున్నప్రకృతిని చిద్రం చేయకుండా సంరక్షించుకోవాలని ఆకాంక్షిస్తూ,కోపం ఉద్రేకం ఉద్వేగం వంటి పలు తాపాలను నియంత్రించు కొని ఆరోగ్యవంతమైన మనసులున్న మనుషులుగా మానవ సమాజోద్దరణకు,జీవావరణ సంరక్షణకూ తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఇవే మా నూత్న వత్సర శుభాకాంక్షలు…..నిత్య శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
డిసెంబర్ 31, 2010 at 10:15 సా.
నూతన వత్సర శుభాకాంక్షలు
డిసెంబర్ 31, 2010 at 11:55 సా.
Thanks Nelabaalaa. నూతన వత్సర శుభాకాంక్షలు…Nutakki
జనవరి 1, 2011 at 10:49 ఉద.
రాఘవేంద్రరావు గారు
మీకు, మీ కుటుంబానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు.
జనవరి 1, 2011 at 6:59 సా.
డియర్ శ్రీవాసుకీ, ఎన్ని నాళ్లకు, ఎన్ని నాళ్లకు !! ధాంక్యూ వెరీ మచ్. మీరూ మీ కుటుంబ సభ్యులు,ఎలా వున్నారు ? అందరికీ నా వ్యక్తిగత నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మొన్న ఈ మధ్యనే నెలబాలుని కలిసి మాట్లాడటం జరిగింది. ఈ మధ్యనే…. ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహన రావు గారు విచ్చేసిన సందర్భంగా , ప్రముఖ హాస్య, వ్యంగ్య కధా రచయిత, మరియూ ,కొకిలమ్ సాహితీ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అద్యక్షులు శ్రీ పులిగడ్డ విశ్వనాధ రావు గారు ,ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో …శ్రీ అద్దేపల్లి వారినీ ,ప్రముఖ కవి , రచయిత శ్రీ సాంధ్య శ్రీ గారిని, ప్రముఖ కధా రచయిత కధా ఋషిశ్రీ మునిపల్లె రాజు గారిని,ప్రముఖ పాత్రికేయుడు,రచయిత శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రి గారినీ , పాత్రికేయులూ, రచయిత శ్రీ మరింగంటి రంగా చార్యులు గారినీ కలిసి సంభాషించడం జరిగింది. ‘వసుంధర అక్షరాజాలం’ బ్లాగరు శ్రీ వసుంధర గారితోనూ, బ్లాగరు శ్రీ పసనూరి శ్రీధర బాబు గారితోనూ, శ్రీ శ్రీకారం శ్రీపతి శర్మ గారితోనూ ఫోను ద్వారా సంభాషించడం జరిగింది. అలా కాలక్షేపం జరిగి పోతోంది. అప్పుడప్పుడూ ఇలా పలకరిస్తూందండి. వుంటాను. శ్రేయోభిలాషి …నూతక్కి.
జనవరి 3, 2011 at 6:52 సా.
రాఘవేంద్రరావు గారు
మీరు అదృష్టవంతులు చక్కగా హైదరాబాద్లో ఉండి అందరినీ కలవగలుతున్నారు. బ్లాగ్ మిత్రులను అలా కలవడం మంచి ఆనందాన్ని ఇస్తుంది. నాకు ప్రస్తుతం హైదరాబాద్ వచ్చే అవకాశం లేదు. వచ్చినప్పుడు మీకు చెబుతాను మనం కలుద్దామండీ.
జనవరి 3, 2011 at 11:08 సా.
తప్పకుండా కలుద్దాం శ్రీవాసుకీ గారూ..హైదరాబాద్ కు ఎప్పుడొస్తున్నారు ? నా కు మెయిల్ చేయండి.మీ కాంటాక్ట్ నం. యివ్వండి…శ్రేయోభిలాషి …నూతక్కి.
సెప్టెంబర్ 12, 2011 at 3:08 సా.
Dear sreevaasuki nannu poortigaa marachi natlunnaaru. elaa vunnaaru ….sreyobhilaashi …Nutakki Raghavendra Rao.
ఫిబ్రవరి 29, 2012 at 10:28 సా.
Dear sreevaasuki elaa vunnaaru? Prastutam antarjaalam lo meerekkada chikkukunnaaru? prastam mukha pustka kudyaanike parimitamai nenu. appudappudoo ilaa naa blaagulo adapaa dadapaa. meeru bhaagyanagaram eppudu vastunnaaru? naa ..mail address ….www.nutakki.wordpress.com.ku mail ivvandi veelainappudu. …sreyobhilaashi …Nutaqkki Raghavendra Rao.