నూతన వత్సర శుభాకాంక్షలు.
స్వాగత వీడ్కోలులు.
రచన : నూతక్క్కి

దుర్భర స్థితిగతుల 2010 కి
వీడ్కోలునందిస్తూ
2011 ను  స్వాగతిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

యుద్ధాలూ,

మానవ హననాలూ,
ఉగ్రవాద విక్రుతాలూ,
మత ద్వేషాలూ ..

ప్రపంచ వ్యాప్తంగానూ…….,

విదేశీ దురాక్రమణ ల
విపరీత ధోరణులూ,
ప్రాంతీయ వేర్పాటు వాదనలు,
జలవనరుల పంపకాల
అసమానలతలు,
అంతర్గత
వైషమ్యభావనలు ,
తీవ్ర వాద వికృత
విన్యాసాలు,
దేశ వ్యాప్తంగానూ……..,
బందులూ, రాస్తారోకోలూ,
ప్రయాణ సాధనాల
ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల
విధ్వంసాలూ
దహనాలూ,దోపిడీలూ,
దొంగతనాలూ,అందోళనలూ,
హంగర్ స్ట్రైక్ లూ
అనారోగ్యాలూ,ఆత్మహత్యలూ,
హత్యలూ,
అత్యాచారాలూ,మానభంగాలూ,
యాసిడు దాడులూ,
యాచకత్వం,దొంగతనాలూ,

లంచాలు,అధికారుల అక్రమాలూ ,
రాజకీయుల అనైతిక విన్యాసాలూ
అధికార,ప్రజా  ధన
దుర్వినియోగాలూ ,
ఆశ్రిత పక్షపాతాలూ ,
దురాగతాలూ,
ప్రాకృతిక ప్రకోపాలూ,
కరువులూ ,వరదలూ
తుఫానులూ,
అన్నదాతల ఆక్రోశాలూ,
భవిష్య నిర్దేశ కత
కాన రాక
యువత పట్టిన  పెడ దారుల
పయనాలూ,
నిరుద్యోగం,
ఆకలి చావులూ ,
బ్రతుకు అగమ్యమై
ఆకలి తీర్చే అన్న దాత
ఆత్మ హత్యలూ,
తనువును  కప్పి శీతో ష్ట్నాలనుంచి
మనిషిని కాపాడేందుకు  బట్టను సృష్టించి
తన తనువును కాపాడుకోలేని
నేతన్నల దుర్మరణాలూ
ఆరుగాలం శ్రమించినా
ఆకలి తీరని అభాగ్య
వ్రుత్తి   జీవుల వేదనలూ …..
ఆకాశాన్నంటి అత్యవసర
నిత్య వినియోగ   సరకుల
ధరలు అందుకోలేక …జన సామాన్యం
ప్రాంతీయంగానూ ….
ఇవేవీ
కానరాని కొంగ్రొత్త సంవత్సరం… ఈ నూత్న వత్సరం 2011 కావాలని ……. శుభ ఆకాంక్షలతో ,
ప్రపంచ మంతటా అన్ని దేశాల ప్రజలకూ తిండీ, గుడ్డా, నీడా, మంచి నీరూ, మంచి గాలీ,నాణ్యమైన….  వైద్య సదుపాయాలూ, ప్రయాణ సదుపాయాలూ,వినోదవనరులూ,,స్త్రీ జాతికి గౌరవం, రక్షణ,శిశువులకు సంరక్షిత ఆహార వైద్య  సంవిధానాలూ,  విద్యార్ధులకు సామాజిక విలువలతో కూడిన ఉచిత  విద్య,  క్రమ శిక్షణ, యువతకు వుపాధి వనరులు, వృద్ధులకు,వికలాంగులకూ  సర్వ  విధాల ఆదరణ,   అందించే ప్రభుత్వాలు….
ప్రపంచ వ్యాప్తంగా  సకల దేశాల ప్రజలకూ లభించేలా  , ప్రజలు  తమదైన భాత్యతలను గుర్తించి   నిర్వర్తించేలా ,ఈ క్రొంగ్రొత్త వత్సరం 2011 ప్రపంచ  వ్యాప్త మానవాళి సంక్షేమాన్ని కాపాడుతుందని ఆకాంక్షిస్తూ ……
భూమాతను తొలచి వొలిచి ధ్వంసం చేసి తమ ఉనికికే ప్రమాదం  తెచ్చుకోకుండా ,భూమాతకు అరుణుని  ఆల్ట్రా వైలట్ కిరాణా లనుండి  రక్షణనందిస్తున్న ఓజోను రక్షణ వలయాన్ని సంరక్షించుకొనే దిశగా చర్యలు తీసుకొంటూ……..,
ప్రక్రుతి అందిస్తున్న సూర్య శక్తి, వాయు శక్తీ, సముద్ర జల శక్తీ,వంటి  భూ బాహ్య వనరులనుండి  శక్తిని గ్రహించి
వినియోగించుకొనే దిశగా శాస్త్ర విజ్ఞాన్ని వినియోగించుకొని ,ముందుకు నడచి ప్రతీ మనిషీ, ఖండాలూ , దేశాలూ, ప్రాంతా లూ ,అనే కుస్చ్చితనిస్చ్చితాలు లేకుండా,తమ హక్కులను వినియోగించుకొనే విధంగా, కుల మత వర్గ భావ  రహితంగా   తోటి మానవుని  మనుగడను    గౌరవించి సహకరించాలని ,తోటి జీవకోటిని సంరక్షించి, తమ మనుగడను కాపాడుతున్నప్రకృతిని చిద్రం చేయకుండా సంరక్షించుకోవాలని ఆకాంక్షిస్తూ,కోపం ఉద్రేకం ఉద్వేగం  వంటి పలు తాపాలను  నియంత్రించు కొని ఆరోగ్యవంతమైన మనసులున్న మనుషులుగా  మానవ సమాజోద్దరణకు,జీవావరణ సంరక్షణకూ  తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఇవే మా నూత్న వత్సర శుభాకాంక్షలు…..నిత్య శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.