జనవరి 2011


వ్యసనంలా పోటీ పరీక్షలు.
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

బాల్యానికే

ఓ వ్యసనంగా

దాపురించి
యువతనూ
మత్తులో
ముంచి
చిత్తు చేస్తున్న
పోటీ పరీక్షలు
విద్యారంగ
దౌర్బల్యానికి
ప్రతీకలు
కార్పోరేట్ రంగం
సృష్టించే గమ్మత్తుల
మత్తునుంచి
తప్పించుకోలేని
నవ సమాజం.
ప్రపంచీకరణతో
బతుకులు బరువైనట్లే    .
వంగి  విరుగుతూ న్న
బాల్యం.
ముఖాలకు,ముక్కులకు
చడ్డీలు  వేయిస్తూ
కరడుగట్టిన కాలుష్యం
ప్రక్షాళన దిశగా
అడుగులిడని ప్రభుత  .

పందికొక్కులూ
జాతి మిము క్షమాపణ కోరుతోంది .
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
తేది :24-01-2011
యీ స్వాతంత్ర్య భారత గణతంత్ర వేళ
పందికొక్కులూ!
జాతి మిము క్షమాపణ కోరుతోంది
మము క్షమించండి
మిక్కిలిగా మితిమీరి తినేవారిని
మీతో పోల్చుతుంటాం
పందికొక్కుల్లా మెక్కుతున్నారని
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం
అని మమ్ము  మేము
పొగుడుకొనే  రోజులు
పోయాయిక
కోట్లాది బడుగు జనుల
జీవితాలు ఫణం పెట్టి
వేల కోట్ల రూకలతో
బొక్కసాలు నింపుకున్న
కామందులు మాముందు ఉండగా
ఏమీ చేయలేని ఆసక్తతలో మేమున్నాం
ఇంకా నిను నిందించడమా
తప్పు తప్పు తప్పు మా చెంపలు
మేమే కొట్టుకొంటాం
నిను తిట్టినందుకు
దోపిడిదారులను
నీతో పోల్చినందుకు.
అయినా నీవు మేక్కిన్దెంతలే
సంవత్సరానికి సరిపడా
ఓ రెండు బస్తాల ధాన్యం
నీ ఆకలి తీర్చుకొనేందుకు
మాత్రమేగా!
నీవేమి పోటీ పడగలవూ
వంద తరాలకూ
అనుభవించినా తరుగనంత
ప్రజాధనం దోచి దాచిన
ధూర్త మేధావులతో
రోడ్లూ ప్రోజేక్ట్లూ ,
కాలవలో పూడికలూ
నిత్యావసర సరుకులూ
అడియిది అని ఏమీ లేదు.
ఆఖరుకు
మురుగు కాల్వలూ
సమాధు లున్నూ
పిల్లలమందులు,
మధ్యాహ్న ఆహారాలు
ఒకటేమిటి అన్నీ
లక్షలాది కోట్ల రూకలు
ప్రజాధనం తమదిగా
కూడబెట్టిన కామందులు
మా రాజకీయుల  ,
అధికార గణాల
నల్లదన సంపదల
గణాంకాలు
అంచనాలు వేయలేక
గణితమే మూగబోతున్న వేళ
త్యాగధనుల స్వాతంత్ర్య ఫలం
గుప్పెడు దోపిడిదారుల గుప్పిట
యీ స్వాతంత్ర్య భారత గణతంత్ర వేళ
పందికొక్కులూ
జాతి మిము క్షమాపణ కోరుతోంది
మము క్షమించండి.

మము క్షమించండి.

కార్యశూన్యులు

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
క్షణ భంగుర జీవిత

గత కాలపు
కఠిన క్లిష్ట తర
అనుభవ
విన్యాసాల నీడలు
చలన చిత్రమై వర్తమానాన
క్షణాలు నిముషాలుగ
గంటలు రోజులు వత్సరాలై
నడయాడుతు నర్తిస్తూ
కనులమున్దరే వర్తిస్తే ….
పొగిలి పొగిలి ఏడుస్తూ
భవిష్యమును చర్చిస్తూ
నిర్లక్ష్యిస్తూ
కార్యశూన్యతన
కార్యాచరణానిర్దేశ కత
లోపించిన వారెందరో !
యీ  జీవనం ఎందుకు అని
తమకు తామే ప్రశ్నిస్తూ
నిరామయంగా నిస్తేజంగా

నగరంల పతంగులు … ఇండ్లకాడ ఎతలు!

కథ : నూతక్కిరాఘవేంద్ర రావు.
(సూచన:  మాండలీకంలో ఉద్దేమ గీతం రాయాల్నంటే  నాకు జర సమయం పడతది.

అంతదంక  కత జెబుత.)

ఉదయాన్నే వాష్ బేసిన్ కాడ అద్దంలో జూస్కుంట వైన వైనాలుగా పండ్లు తోమ్కుంటున్నజూసెతోల్లెవరు లేర్లేమ్మని.       ఇంగా అందరు లేవలే. గిన్తట్ల ఆడెవడో డిస్టర్బ్ చేసిండు  ..   బయ్యిన బజర్ కొట్టిండు .
ఆయిగా  పండ్లుగూడ తోమనీ కుంట ఇదేన్దిరో! . ఆల్లోకి తొంగి టైం జూసిన.    ఆరు గంటల్గొట్టి  పదినిమసాలాయే.ఆరు గంటల్కొ ట్టకుండానే    న్తనే , గేటు తాళం దియ్యకుంటనే,   పాలు ప్యాకెట్లు, పేపరు, లోన్కి    దెచ్చినుంటి .యింత పోద్దుగాల  ఒచ్చేటోల్లెవల్లై ఉండొచ్చు?.
అవ్!  గేటు తాళం దియ్యలె గద .లోని కెట్లోస్తడు ?గోడగిట్ల దుమికిండ?
ఇంట్ల ఇంకెవ్వరు లేసినట్టు లేదు. నోట్ల నీల్లోంపు కోని బుక్కిలిచ్చుకుంట,మూతి దుడుసుకొని  టవల్ బుజానేసుకుంట కట్టె బట్టుకొనిబోయి బీగాల్దీసి  తలుపులోరంగా దీసి జూద్దును   గద ఎదురుంగ ఇద్దరు,  ఆల్లెనక ఇంకిద్దరు పిలగాండ్లు . పైకి   ఎత్తి పట్టిన కట్టె  దించి కోపంగా జూసిన. .పోరగాండ్లు… అంకుల్!   పైకి బోవాలె ,కోరస్ గ డిమాండ్ జేస్తున్నారు. ఇదేన్దిరో నా ఇంటికాడ గీ పోరల జబర్దస్తి.పైకి గిన పోనీకి నాయిల్లే జూసుకున్నావురా అని అందామనుకున్న గని  సమలాయిన్చుకున్న .   అందల ఎదురుగ్గున్న లేన్లో మూడో  యింటోల్ల పిలగాన్డ్లిద్దరున్నరు. కోపం తన్నుకొచ్చేగని తెలిసినోల్లాయిరి.ఒక్కతానుండే తోల్లం .
లోనికేట్లోచ్చిన్రు ?,’బే’ అందమనుకున్నగని,
సమ్లాయిన్చుకొన్న.
ఒకే  గల్లిల వుండే టోల్లం గంద.          అంకుల్ అడ్డు లేస్తే  పైకెళ్ళి పతంగి దెచ్చుకొంటమంకుల్ .జల్ది బోవాలె, ఆ రాజేష్ గాని  పతంగి ని గూడా అఫా జేయాలే,……ఆ రాజేష్ గాదంటే మా పక్కన మూడో యింతోల్ల పిలగాడు. యీల్ల పతన్గిని అఫా జేసినట్లున్నాడు  ….  నా అనుమతి అవసరం లేదన్నట్టు లోనికి బోవాల్నని మెట్లే డున్నయో జూసుకొంటున్నరు.
నాకింక కోపమింకేడుంటది, నాకు నవ్వొస్తున్నది. గా  పోరల జబర్దస్తిజూసి.
దినాం రఫ్ మాటాడకుంటే నాకు  నడవది మరి,  నా జాబు గసుమంటిది.ఇక్కడట్ల కుదరదాయే.  . .  లోనికేట్లోచ్చిన్రో గూడ అడుగుడే మర్సిన .
పైకి ఎందుకు బిడ్డా ?
ఆ…మ్కూ …ల్  ! బోవాల్నంకుల్ యీ బిల్డింగ్ మీన మా పతంగి పడిందంకుల్,పోనీయన్రి  అంకుల్ .తెచ్చు కున్టం.
యింత పొద్దుగాల్నే పతన్గులేందిరా? నేనియ్య పోన్రి. మల్లెయ్యమంకుల్, అంకుల్  పతంగి దెచ్చుకుంటమంకుల్.   ప్లీజ్ ప్లీజ్ అంకుల్ . ప్లీజ్ అన్న లబ్జ్ ఎవడు  కనిపెట్టిన్డొ గని సల్లబడిపోయిన.  సరె,  ఎవలో ఒకల్లోచ్చితీసుకోన్రి…..
అంకుల్! అందరం బోవాలె ఆడ చెట్టు పైన పట్టిందంకూల్ వైనంగా  దీర్గాల్దీస్తున్నడొకడు .రూం పైకెక్కి , ఆడికెల్లి కొమ్మ మీనికి పోవాల పతంగి ఇడిపిచ్చుకొని  దెచ్చు కోవాలె, మాంజా జుట్టాలే .  .ఒక్కళ్ళం బోతే కాదంకుల్.
ఈళ్లుగిన  పైకి బోయిన్రంటే చేట్టుగినేక్కితే  ఎమన్నగిన అయితే  నాయ్నో   ….ఆ పాట్లు బోయినేడాది జూసిన గద. ఇగ లాబం లేదన్కొని,… పోయి మీ నాయనల  దోల్కరాన్రి దీసిస్త. పోన్రి. అంకులన్కుల్  బతిమలాడుడు. ఆ ళ్ళని గల్లిలోంకి తోలి, తలుపుకు బొల్టేట్టినగని ,ఆళ్ళని తిప్పలేన్డ్కు బెట్టాలే ….    ,నిచ్చెన  దీస్కోని  పైకి పోయిన….ఏమ్జేయాలే మల్ల, పైకి ఆల్లుగి నొచ్చిన్రంటే …..అదో పెద్దక తైతది. గా కత మల్లోపారిజేప్పుకున్దారి. ఆల్లకు పతన్గిదీసిచ్చి చాయ్తాగనీకి బోవాల్ననుకుంట,  పైకి బోయి జూసిన కద  !! పది దాక పతంగులు చెట్టుకు పట్టి ఎగురుతున్నయ్.నన్జూసి, పక్కనున్న దాబాల మీకెల్లి పిలగాండ్లు అంకుల్ ,మా పతన్గుల్గూడ దీసియ్య రాదంకుల్ ? రిక్వేస్ట్లు .   చెయ్యి నెత్తినెట్టుకుని కూర్సొండి పోయిన.
(బోయినేడాది జరిగిందేందో ఆ కత మరోపాలి  జెబ్తలే తియ్యున్రి .)
కతలెక్క గొడితే కామేన్ట్లేయిన్రి.
లావా !
రచన  : నూతక్కి
పుష్పించిన
అగ్నిపర్వత
శిఖరాగ్ర
కన్నియ
రుతుస్రావ
ప్రవాహ
వేగమున
శి లాదాతువై
ప్రవాహమై
ఆవిష్కృతం
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

క్షణ కాలపు
యోచన లో
ఉప్పొంగిన
భావనావిర్భవిత
రూపవిన్యాసాలు
ఘనీభ వించి
కళా రూప
మాలికలై
మహాద్భుతమై
ఆవిర్భావిస్తూ
శాశ్వతత్వాన్ని
సంతరించుకొంటూ
ఆవిష్క్రుతమై  …
అంతరంగాలు

వైచిత్రి.

వైచిత్రి

రచన: నూతక్కి

ఎవరు నిర్దేశించారు ?
యీ లయబద్ధిత
రూప  లావణ్యా లు
ఇలాగే వుండాలని
ఎవరు నేర్పారు
లెక్కలు గణాంకాలు
ఇన్నే ఆకులు
ఇన్నిన్నే  ఈనెలు
నిర్దేసితమై
ఇదే ఆకారంలో
కణుపు కణుపుకూ
నిర్ణీత పరిధులలో
పెరగాలని
ఎవరు నేర్పేరు
యీ వర్ణ రాగరంజిత
కళా నైపుణ్యాలు
ఇంతందంగా నిర్ణితమై
రంగులద్దుకోవాలని
ఎవరు నేర్పారు?…….
చెట్లకు నీళ్ళు పెడుతూ
ఆరోగ్యంగా పెరుగుతున్న
ములగ మొక్కను
మూడు తరాల రెమ్మలను
వివిధ ఛాయలలో
వీక్షిస్తూ
ప్రకృతి వైచిత్రికి
వివశుడనై
యోచనలో …

నాదం
రచన: నూతక్కి
నాదోశ్చరణ
అక్షరమై
అక్షరాల సంకలనమే
పదమై

పదం పదం

సజీవ భావ చిత్రమై!
ప్రమోదమై
హావభావయుత
కవిత్వమై ,  కావ్యమై
నృత్యగాన సంఘటితమై
విశృంఖల భావ విన్యాసమై
లోహ శిలా దారు పత్ర
లిఖితమై
మహోత్కృష్ట
గ్రంధమై
ఉపనిష త్తులై
వుపన్యిసతమై
సకల వ్యక్తావ్యక్త
భావ  వ్యక్తీకరణా
మూలాధారమై
విశ్వవ్యాప్త
నాదమై ఓంకార మై !!!
ర్యాగింగ్ దినాల్ల
రచన: నూతక్కిరాఘవేంద్ర రావు.
నేన్గురిబెట్టిన బందూక్
అవ్వాయి సువ్వాయిలెక్క
ఎనిక్కిదిర్గి
రయ్యిన దూసుకుంటోచ్చి
నా గుండెల్ల నే  దాకి
నా ప్రేమకే గాయం జేస్కుంట
తూట్లు తూట్లు జేస్తదని
నేనెన్నడు  అన్కోలె
ఎవురి గుండెల మీకేల్లి
దూస్కపోవాల్నని గురి జూసి
గోసబెట్టాల్నని జూసిన్నో
ఆనికి తగిలుంటే గిన
ఎంతటి తకలీఫయితదో
సమఝాయ్యినంక
రాసుడు గీసుడు
గురిజూసిగొట్టుడు
ఆఖర్కిర్యాగింగ్జేసుడే
బంద్జేసినుంటి.

సవ్వకు దమ్మి సచ్చి సాదించెడి దేమున్నది

రచన:రాఘవేంద్ర రావు నూతక్కి
బతి కుంటె నే గద  తమ్మి
నీ మనసుల నువ్వనుకొన్నది
పోరాడినా కుమ్ములాడినా
శోధించిన గని, సాధించిన గని
నువు బతికున్దాల దమ్మి
గని తమ్మి ఉద్రేకంల
పానాల్దీసుకోనుడు
అమ్మకు అయ్యకు కడుపు కోతల్దప్ప
నిను కన్నందుకు నీవిచ్చేడి  దేమున్నదని
వుద్దేమాల నడిసేతోన్కి ముందు నడ్సి
నువ్  దారి జూపాలే దమ్మి
పోరాడినా కుమ్ములాడినా
శోధించిన గని, సాధించిన గని
బదికుంటే నే గద తమ్మి
వుద్దేమాల్ల్ల ఉద్రేకంల
పానాలిచ్చిన వనుకో
వహ్వా ,ఓహో , జాన్దియా వతన్  కేలియే
గట్లని నాల్దినాల్
మంచిగా బొగుడ్తరు  గని
యినేతందుకే నువ్వుండవు.
రెండు దినాల్   సోకదినాల్బెడతారు
ఏడాదికో పారి స్మరణ దినాల్జే స్తరు
గాడ ఉపన్నాస మిచ్చెడి
లీడర్లకు భీ యాదున్డది
దేనికొరకు నువు
నీ పాణం దీసిస్తివో
అమ్మనాయన్లకు
కడుపుకోత మిగులుడు దప్ప
బతికుండే  పోరాడు తమ్మి
జయం నీఎంటుంటది
మొద్గాల సవ్వమన్నోన్ని
జంపి జంపి ఒదిలిబెట్టు.
సవ్వకు తమ్మి నువ్వు
సచ్చి సాదించెడి దేమున్నది ?

తర్వాత పేజీ »