ప్రస్తుతం  మన ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థ ఓ బ్లాక్ హోల్  .

రచన :నూతక్కి  (లోగడ ఒకరి వ్యాసానికి  నేను తెలియబరచిన అభిప్రాయం. )

భవిష్యత్ పరిణామాలను అంచనా వేయలేని ప్రభుత్వాలు ,జేబులు నింపుకొనే యత్నంలో రాజకీయులూ విచ్చలవిడిగా  వీధి బడుల్లా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు విసిరేస్తే, బ్లాక్ మనీ ఏమిచేయాలో సీలింగు భూములు ఎలా పరిరక్షించుకోవాలో తెలియక సతమతమౌతున్న అనేక వర్గాల   కామందులు అవకాశాన్ని తమకనుకూలంగా మార్చుకొని ఇంజనీరింగ్ కాలేజీలనే  విద్వత్తు ను అందించలేని  బ్లాక్ హోల్స్   సృష్టించి  యువతను ఆకర్షించి అసంబద్ధ ఆకర్షణలు రేకెత్తించి  వారి భవిష్య శక్తిని బక్షించి భారత భవితను నిర్వీర్యం చేస్తున్నారు.

తలిదండ్రులంటారా,బిఎస్సీ బదులు ఇదీ .అనే నిర్లిప్తత.ఎలాగోలా  ఎన్నిబాధలు పడినా మన వంతుగా మామూలు డిగ్రీ బదులు ఇంజినీరింగ్ చదివిద్దాం   .  వస్తే మంచి వుద్యోగం వచ్చి బిడ్డ  జీవితం బాగు పడుతుంది. లేకుంటే మామూలు డిగ్రీ వాడిలాగానే జీవితం కొన సాగిస్తాడు.ఇది మధ్య తరగతి జీవి తపన.

ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు భవిష్య ప్రణాళికలు ,అంచనాలూ లేకుండా దూర దృష్టి లోపించి వ్యవహరించడం వల్లనే ఈ స్థితి.

ప్రపంచంలోనే మహాద్భుతమైన  మాననవ వనరులు  వుండీ సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళి కలే  లేని మన  దేశంలో  ప్రభుత్వాలు,  నిరుద్యోగ నివారణ ఇలాగైనా కొంత వరకు సాధించ వచ్చనుకొనియువతకు  విదేశీ బాట చూపుతున్నారు.
పుట్టిన నాటినుండి చదువే వ్యాపకమైన నేటి సమాజంలో సామాజిక విషయాల పై అవగాహనా లోపం వల్ల కొంత మంది యువత మీరు ఉదహరించినట్లు ప్రవర్తించ వచ్చుగాక . అంత మాత్రాన యువతదో తలిదంద్రులదో తప్పుగా నిర్దారించ వద్దు. విద్యలో ప్రతీ రంగం స్వయం వుపాధినందిన్చేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించి యువతకు నమ్మకం కలిగిస్తే ప్రస్తుతమున్న  ఇంజినీరింగ్  విద్య లాటి అజాగళ స్తనాస్వాదనలో తలమునకలు కారు.