నర నరాన పాతుకు పోయిన  నిర్లక్ష్యం

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
ప్రభుత్వాలు… రాష్ట్రమైనా  కేంద్ర మైనా ప్రతీ సంవత్సరం భక్తులయడ వారి ప్రాణాల యడ  వ్యవహరిస్తున్ననిర్లక్ష్య వైఖరి,    తీరు, చాల దారుణంగా ఉంటోంది.
ఇందుకు  గత కొన్నేళ్లుగా తీర్ధ  యాత్రలలోనూ ,దైవ వార్షిక సమారోహాల్లోనూ ,ఉత్సవాలలోనూ మానవ హననానికి కారణ మౌతున్న  దుర్ఘటనలే తార్కాణం .నిన్న గాక మొన్న పంపా నదీ తీరంలో ఉద్భవించిన  దయనీయ దుర్ఘటన కు మానవ వైఫల్యం …అధికారుల, నిర్వాహకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణమని చెప్పక తప్పదు.
దేశంలో ఏ దైవ క్షేత్రానికి ఏ మాసంలో ఏయే ప్రాంతాలనుండి ఎంత
మంది భక్తులు చేరుకుంటారు?
అక్కడికి చేరేందుకు  రోడ్డు రవాణా సౌకర్యాలు  ఎలా వున్నాయి ?రైలు ద్వారా ప్రయాణ సౌకర్యాలేలా వున్నాయి?ఎంతమందికొరకు సరిపోతాయి ? ఎక్కువమంది వస్తే వారి రక్షణకై  చేయవలసిన ప్రత్యామ్నాయాలేమిటి? వారికి దైవ క్షేత్రానికి చేరుకొనేందుకు రోడ్డు సౌకర్యం ఎలా వుంది?
ఆయా ప్రాంతాలలో జన సాంద్రత వుద్ధ్రుతమైతే జరిగే విపరిణామాలు ఎలా  వుంటాయి? అందుకొరకు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలలేపాటివి ?.
దీర్ర్ఘ కాల ప్రయోజనాలకై   రోడ్లు, ఘాట్ రోడ్లు ,  రవాణా సౌకర్యాలూ సౌకర్యవంతమైన,క్షేమకరమైన వనరులుగా  మార్చి ,సక్రమమైన పర్యవేక్షణలో  భక్తుల వుద్రుతాన్ని దృష్టిలో వుంచుకొని అవసరానికి అనుగుణంగా అంచనాలు రూపొందించి ,రాబోయే దశాబ్ద కాలానికో ద్విశతాబ్ద కాలానికో అనుగుణమైన  ప్రణాళికలతో ఆచరణతో వ్యవహరించి  ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల ఎద్దడిని కూడా దృష్టిలోకి తీసుకొని  శుభ్రమైన ఆహార వసతులు , క్షేమకరమైన త్రాగు నీటి వసతులు,ఉండేందుకు గృహ వసతులు , సౌచాలయాలు, స్నానానికి గదులు నీరు వంటి  వసతులు ,ఉన్నాయా ?
ఎప్పుడు ఏసమయంలో ఏయే ప్రాంతాలకు ఏయే ప్రాంతాలనుండి ఎందరు భక్తులు తరలి వస్తారు ?ఆయా మార్గాల స్థితిగతులు ఆ రద్దీని తట్టుకొనే స్థితిలో ఉన్నాయా?  వారి సౌకర్యార్ధం  ముందు చర్యగా  మరింతగా అభివృద్ధి చేయవలసిన వనరులేమిటి?అంచనాలననుసరించి  అంత మంది భక్తులకు సురక్షితంగా  దర్శనమందిచేలా  ఎలా నియంత్రించాలి?సురక్షితంగా వారిని తిరిగి వారి వారి ప్రాంతాలకు తిరిగి  ఎలా పంపించాలి?  అక్కడ భద్రతా చర్యలేలా వుండాలి ? వైద్య సదుపాయాలేలా వుండాలి ? రక్షక భట వ్యవస్థ, అగ్నిమాపాపక వ్యవస్థ ఎలా వుండాలి ఎలా వున్నాయి ?వంటి వాటిని దృష్టిలోకి తీసుకొని , తదను గుణంగా      వ్యవహరించి ముందు జాగ్రత్తలు తీసుకో వలసినది పోయి ,
యే విధమైన ముందస్తు చర్యలూ అంచనాలకు అను గుణంగా  తీసుకోవడం లేదనే చెప్పాలి.
నిర్వాహకులకు ,ప్రభుత్వాలకూ ప్రణాళిక లన్న  యోచనే  వుదయించక పోవడం శోచనీయం.
అలసత్వంలో అధికారులు
ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతూ భక్తులు.
పట్టించుకోని ప్రభుత్వాలు.
ఏటికేడు అయ్యప్ప భక్తులో ,శైవ భక్తులో, వైష్ణవ భక్తులో క్రైస్తవ భక్తులో ముస్లిం భక్తులో భారత దేశంలోనే కాక ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు  వివిధ దైవ క్షేత్రాలకు వెళ్ళడం ,త్రోక్కిసలాటలో వందల సంఖ్యలో  అమాయక ప్రాణాలు బలవడం
నిత్య కృత్యం అయ్యింది.  ఆయా ప్రాంతాలలోని నిర్వాహకుల,అధికారుల ప్రభుత్వాల  నిర్వాకం వల్ల నిర్లక్ష్యం వల్ల యీ విపరిణామాలు జరుగుతున్నాయి.
ఇందుకు నిర్వాహకులే కాక , ఏయే పుణ్య  క్షేత్రాలకు ఏయే రాష్ట్రాలనుండి ఎంత మంది ప్రతీ సంవత్సరం
వెళుతున్నారో  ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలూ భాధ్యవహిన్చావలసిందే.
ఆ దామాషాలో ఆయా ప్రభుత్వాలు ఆయా పుణ్య స్థలాలలో నూ, అక్కడికి  చేరుకునేందు కూ   అన్ని  సౌకర్యాలు అభివృద్ధిచేసేందుకై  తమ వంతు   ద్రవ్య నిధులు అందించాలి.
ప్రభుత్వాల వద్ద ,వివిధ మీడియాల వద్ద అన్ని వివరాలూ వున్నాయి .ఎంతమంది భక్తులు ఏయే ప్రాంతాలనుండి ఏయే పుణ్య తీర్ధాలకు ఏయే మార్గాలలో చేరుకుంటారు? మార్గమధ్యంలో వారికి తగిన వసతులు ఎలా వున్నాయి  ? తీర్దానికో పున్యక్షేత్రానికో చేరిన తరువాత  అక్కడ వారు ఎంత సమయం వుంటారు? వారికి అక్కడ కావలిసిన వసతులున్నాయా ?లేకుంటే చేయవలిసిన కర్తవ్యం ఏమిటి?
అదో నిత్య కార్యంగా జరిగేదయితే శాశ్వత రీతిలో ఏర్పాటు చేయవలసిన వసతులు వనరులు ఏవేవి ? సంవత్సరానికోపరి కొన్ని రోజుల పాటు జరిగే ఉత్సవాలకు   చేయవలసిన ఏర్పాటులేమిటి?  శాశ్వత ప్రాతిపదికన చేయవలసినవి, తాత్కాలిక రీతిన చేయవలసినవి రెండు విభాగాలుగా విభజించుకొని పర్యవేక్షించ వలసిన అవసరం వున్నది..
ఆయా మార్గాల స్థితిగతులు ఆ రద్దీని తట్టుకొనే స్థితిలో ఉన్నాయా?  వారి సౌకర్యార్ధం  మరింతగా అభివృద్ధి చేయవలసిన వనరులేమిటి?  వంటి ముఖ్య విషయాలపై దృష్టి పెట్టి ఇలా చేతులు కాలాక ఆకులుపట్టుకోనేకంటే  ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆతిధ్య రాష్ట్రాలూ, అతిధి రాష్ట్రాలూ తమ భాద్యతలు విస్మరించి పర్యాటకంగా లభ్యమయ్యే నిధులను  ఎవరికీ వారు ఇబ్బడి ముబ్బడిగా దండుకొంటున్నాయి .
పెద్ద మొత్తాలలో జనం చచ్చిన తరువాత వారి కుటుంబాలకు సానుభూతి  ప్రకటించి చేతులు దులుపుకుంటూ  తాము ప్రకటించిన పరిహారం వారిదాకా చేరుతోందా  లేదా అన్న విషయాన్నికూడా  పట్టించుకోని  నిర్లక్ష్యంలో ప్రభుత్వాలు ఉంటున్నాయి.
ప్రమాదాల సమయంలో హడావుడీ చేసే అన్ని వార్తా మీడియాలూ ప్రభుత్వాలకు  సరైన సమయంలో సరయిన మార్గదర్శ క సూత్రాలందించి  ప్రభుత్వాల చేత ప్రణాళికలు ఆచరణలో  పెట్టించే వరకూ తమ ప్రయత్నాలు కొనసాగించి సాధించ వచ్చు.
కాని వారు  జరిగిన విపరిణామాలను  మాత్రం పదె  పదె   చూపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ  సొమ్ము చేసుకొనే యావ తప్ప, తమ వంతు సామాజిక భాద్యతగా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి ప్రభుత్వం జాగ్రత్త పడేలా తమ వంతు కృషి జరపక పోవడం,జరగబోయే విపరి ణామాల నుంచి ప్రజలను సంరక్షించే దిశగా అడుగులు వేయక పోవడం ,లాభాపేక్ష తప్ప,ఎ ప్రజలవల్ల ఆర్ధిక లాభాలు పొందుతున్నారో వారి సంక్షేమం వారికి పట్టక పోవడం    స్వతంత్ర భారతిలో ప్రజలు చేసుకున్న  దౌర్భాగ్యం.