ర్యాగింగ్ దినాల్ల
రచన: నూతక్కిరాఘవేంద్ర రావు.
నేన్గురిబెట్టిన బందూక్
అవ్వాయి సువ్వాయిలెక్క
ఎనిక్కిదిర్గి
రయ్యిన దూసుకుంటోచ్చి
నా గుండెల్ల నే  దాకి
నా ప్రేమకే గాయం జేస్కుంట
తూట్లు తూట్లు జేస్తదని
నేనెన్నడు  అన్కోలె
ఎవురి గుండెల మీకేల్లి
దూస్కపోవాల్నని గురి జూసి
గోసబెట్టాల్నని జూసిన్నో
ఆనికి తగిలుంటే గిన
ఎంతటి తకలీఫయితదో
సమఝాయ్యినంక
రాసుడు గీసుడు
గురిజూసిగొట్టుడు
ఆఖర్కిర్యాగింగ్జేసుడే
బంద్జేసినుంటి.