వైచిత్రి.

వైచిత్రి

రచన: నూతక్కి

ఎవరు నిర్దేశించారు ?
యీ లయబద్ధిత
రూప  లావణ్యా లు
ఇలాగే వుండాలని
ఎవరు నేర్పారు
లెక్కలు గణాంకాలు
ఇన్నే ఆకులు
ఇన్నిన్నే  ఈనెలు
నిర్దేసితమై
ఇదే ఆకారంలో
కణుపు కణుపుకూ
నిర్ణీత పరిధులలో
పెరగాలని
ఎవరు నేర్పేరు
యీ వర్ణ రాగరంజిత
కళా నైపుణ్యాలు
ఇంతందంగా నిర్ణితమై
రంగులద్దుకోవాలని
ఎవరు నేర్పారు?…….
చెట్లకు నీళ్ళు పెడుతూ
ఆరోగ్యంగా పెరుగుతున్న
ములగ మొక్కను
మూడు తరాల రెమ్మలను
వివిధ ఛాయలలో
వీక్షిస్తూ
ప్రకృతి వైచిత్రికి
వివశుడనై
యోచనలో …