జనవరి 2011


నర నరాన పాతుకు పోయిన  నిర్లక్ష్యం

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
ప్రభుత్వాలు… రాష్ట్రమైనా  కేంద్ర మైనా ప్రతీ సంవత్సరం భక్తులయడ వారి ప్రాణాల యడ  వ్యవహరిస్తున్ననిర్లక్ష్య వైఖరి,    తీరు, చాల దారుణంగా ఉంటోంది.
ఇందుకు  గత కొన్నేళ్లుగా తీర్ధ  యాత్రలలోనూ ,దైవ వార్షిక సమారోహాల్లోనూ ,ఉత్సవాలలోనూ మానవ హననానికి కారణ మౌతున్న  దుర్ఘటనలే తార్కాణం .నిన్న గాక మొన్న పంపా నదీ తీరంలో ఉద్భవించిన  దయనీయ దుర్ఘటన కు మానవ వైఫల్యం …అధికారుల, నిర్వాహకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణమని చెప్పక తప్పదు.
దేశంలో ఏ దైవ క్షేత్రానికి ఏ మాసంలో ఏయే ప్రాంతాలనుండి ఎంత
మంది భక్తులు చేరుకుంటారు?
అక్కడికి చేరేందుకు  రోడ్డు రవాణా సౌకర్యాలు  ఎలా వున్నాయి ?రైలు ద్వారా ప్రయాణ సౌకర్యాలేలా వున్నాయి?ఎంతమందికొరకు సరిపోతాయి ? ఎక్కువమంది వస్తే వారి రక్షణకై  చేయవలసిన ప్రత్యామ్నాయాలేమిటి? వారికి దైవ క్షేత్రానికి చేరుకొనేందుకు రోడ్డు సౌకర్యం ఎలా వుంది?
ఆయా ప్రాంతాలలో జన సాంద్రత వుద్ధ్రుతమైతే జరిగే విపరిణామాలు ఎలా  వుంటాయి? అందుకొరకు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలలేపాటివి ?.
దీర్ర్ఘ కాల ప్రయోజనాలకై   రోడ్లు, ఘాట్ రోడ్లు ,  రవాణా సౌకర్యాలూ సౌకర్యవంతమైన,క్షేమకరమైన వనరులుగా  మార్చి ,సక్రమమైన పర్యవేక్షణలో  భక్తుల వుద్రుతాన్ని దృష్టిలో వుంచుకొని అవసరానికి అనుగుణంగా అంచనాలు రూపొందించి ,రాబోయే దశాబ్ద కాలానికో ద్విశతాబ్ద కాలానికో అనుగుణమైన  ప్రణాళికలతో ఆచరణతో వ్యవహరించి  ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల ఎద్దడిని కూడా దృష్టిలోకి తీసుకొని  శుభ్రమైన ఆహార వసతులు , క్షేమకరమైన త్రాగు నీటి వసతులు,ఉండేందుకు గృహ వసతులు , సౌచాలయాలు, స్నానానికి గదులు నీరు వంటి  వసతులు ,ఉన్నాయా ?
ఎప్పుడు ఏసమయంలో ఏయే ప్రాంతాలకు ఏయే ప్రాంతాలనుండి ఎందరు భక్తులు తరలి వస్తారు ?ఆయా మార్గాల స్థితిగతులు ఆ రద్దీని తట్టుకొనే స్థితిలో ఉన్నాయా?  వారి సౌకర్యార్ధం  ముందు చర్యగా  మరింతగా అభివృద్ధి చేయవలసిన వనరులేమిటి?అంచనాలననుసరించి  అంత మంది భక్తులకు సురక్షితంగా  దర్శనమందిచేలా  ఎలా నియంత్రించాలి?సురక్షితంగా వారిని తిరిగి వారి వారి ప్రాంతాలకు తిరిగి  ఎలా పంపించాలి?  అక్కడ భద్రతా చర్యలేలా వుండాలి ? వైద్య సదుపాయాలేలా వుండాలి ? రక్షక భట వ్యవస్థ, అగ్నిమాపాపక వ్యవస్థ ఎలా వుండాలి ఎలా వున్నాయి ?వంటి వాటిని దృష్టిలోకి తీసుకొని , తదను గుణంగా      వ్యవహరించి ముందు జాగ్రత్తలు తీసుకో వలసినది పోయి ,
యే విధమైన ముందస్తు చర్యలూ అంచనాలకు అను గుణంగా  తీసుకోవడం లేదనే చెప్పాలి.
నిర్వాహకులకు ,ప్రభుత్వాలకూ ప్రణాళిక లన్న  యోచనే  వుదయించక పోవడం శోచనీయం.
అలసత్వంలో అధికారులు
ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతూ భక్తులు.
పట్టించుకోని ప్రభుత్వాలు.
ఏటికేడు అయ్యప్ప భక్తులో ,శైవ భక్తులో, వైష్ణవ భక్తులో క్రైస్తవ భక్తులో ముస్లిం భక్తులో భారత దేశంలోనే కాక ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు  వివిధ దైవ క్షేత్రాలకు వెళ్ళడం ,త్రోక్కిసలాటలో వందల సంఖ్యలో  అమాయక ప్రాణాలు బలవడం
నిత్య కృత్యం అయ్యింది.  ఆయా ప్రాంతాలలోని నిర్వాహకుల,అధికారుల ప్రభుత్వాల  నిర్వాకం వల్ల నిర్లక్ష్యం వల్ల యీ విపరిణామాలు జరుగుతున్నాయి.
ఇందుకు నిర్వాహకులే కాక , ఏయే పుణ్య  క్షేత్రాలకు ఏయే రాష్ట్రాలనుండి ఎంత మంది ప్రతీ సంవత్సరం
వెళుతున్నారో  ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలూ భాధ్యవహిన్చావలసిందే.
ఆ దామాషాలో ఆయా ప్రభుత్వాలు ఆయా పుణ్య స్థలాలలో నూ, అక్కడికి  చేరుకునేందు కూ   అన్ని  సౌకర్యాలు అభివృద్ధిచేసేందుకై  తమ వంతు   ద్రవ్య నిధులు అందించాలి.
ప్రభుత్వాల వద్ద ,వివిధ మీడియాల వద్ద అన్ని వివరాలూ వున్నాయి .ఎంతమంది భక్తులు ఏయే ప్రాంతాలనుండి ఏయే పుణ్య తీర్ధాలకు ఏయే మార్గాలలో చేరుకుంటారు? మార్గమధ్యంలో వారికి తగిన వసతులు ఎలా వున్నాయి  ? తీర్దానికో పున్యక్షేత్రానికో చేరిన తరువాత  అక్కడ వారు ఎంత సమయం వుంటారు? వారికి అక్కడ కావలిసిన వసతులున్నాయా ?లేకుంటే చేయవలిసిన కర్తవ్యం ఏమిటి?
అదో నిత్య కార్యంగా జరిగేదయితే శాశ్వత రీతిలో ఏర్పాటు చేయవలసిన వసతులు వనరులు ఏవేవి ? సంవత్సరానికోపరి కొన్ని రోజుల పాటు జరిగే ఉత్సవాలకు   చేయవలసిన ఏర్పాటులేమిటి?  శాశ్వత ప్రాతిపదికన చేయవలసినవి, తాత్కాలిక రీతిన చేయవలసినవి రెండు విభాగాలుగా విభజించుకొని పర్యవేక్షించ వలసిన అవసరం వున్నది..
ఆయా మార్గాల స్థితిగతులు ఆ రద్దీని తట్టుకొనే స్థితిలో ఉన్నాయా?  వారి సౌకర్యార్ధం  మరింతగా అభివృద్ధి చేయవలసిన వనరులేమిటి?  వంటి ముఖ్య విషయాలపై దృష్టి పెట్టి ఇలా చేతులు కాలాక ఆకులుపట్టుకోనేకంటే  ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆతిధ్య రాష్ట్రాలూ, అతిధి రాష్ట్రాలూ తమ భాద్యతలు విస్మరించి పర్యాటకంగా లభ్యమయ్యే నిధులను  ఎవరికీ వారు ఇబ్బడి ముబ్బడిగా దండుకొంటున్నాయి .
పెద్ద మొత్తాలలో జనం చచ్చిన తరువాత వారి కుటుంబాలకు సానుభూతి  ప్రకటించి చేతులు దులుపుకుంటూ  తాము ప్రకటించిన పరిహారం వారిదాకా చేరుతోందా  లేదా అన్న విషయాన్నికూడా  పట్టించుకోని  నిర్లక్ష్యంలో ప్రభుత్వాలు ఉంటున్నాయి.
ప్రమాదాల సమయంలో హడావుడీ చేసే అన్ని వార్తా మీడియాలూ ప్రభుత్వాలకు  సరైన సమయంలో సరయిన మార్గదర్శ క సూత్రాలందించి  ప్రభుత్వాల చేత ప్రణాళికలు ఆచరణలో  పెట్టించే వరకూ తమ ప్రయత్నాలు కొనసాగించి సాధించ వచ్చు.
కాని వారు  జరిగిన విపరిణామాలను  మాత్రం పదె  పదె   చూపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ  సొమ్ము చేసుకొనే యావ తప్ప, తమ వంతు సామాజిక భాద్యతగా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి ప్రభుత్వం జాగ్రత్త పడేలా తమ వంతు కృషి జరపక పోవడం,జరగబోయే విపరి ణామాల నుంచి ప్రజలను సంరక్షించే దిశగా అడుగులు వేయక పోవడం ,లాభాపేక్ష తప్ప,ఎ ప్రజలవల్ల ఆర్ధిక లాభాలు పొందుతున్నారో వారి సంక్షేమం వారికి పట్టక పోవడం    స్వతంత్ర భారతిలో ప్రజలు చేసుకున్న  దౌర్భాగ్యం.
యోచానాలోచనలు.
రచన : నూతక్కి

కళ్ళు మూసుకొంటే

పడక కుర్చీలో
ముందు
వెనుకలకూగుతూ
జ్ఞాపకాల తెరల
పొరల వెనుక
తడిమి చూస్తే
లుకలుకలాడుతూ
నాటి సజీవ జీవ
విన్యాసాల
తటాకమది

కృష్ణార్పణం


రచన: నూతక్కి

సర్వులకూ శుభ సంక్రాంతి

 

కృష్ణార్పణం ……

అంటూ ఆ హరి దాసు….

ఆతని పేరేమిటో,

వూరేమిటో ఏమీ తెలియదు

గాని,

ఆ అనుబంధం

అంతరించి

అర్ధ శతాబ్ది దాటినా

ఇప్పటికి …

ఆ పదం ..

కృష్ణార్పణం…

శ్రవణా నంద కరం

ఆ ఆహార్యం

ఆ గానం, గాత్రం ,నృత్యం ,

వాద్యం,పలుకు, నడక,

నడత అంతా ,ఆ జ్ఞాపకాల

అలజడులు కంపనలు

నా మస్తిష్కపు ,లోలోతుల ,

నా తనువున కణ కణా న,

నా మది లోపలి పొర పొరలో

పదిలంగా భద్రంగా…

..కృష్ణార్పణం..

 

సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్త తెలుగు సాహితీ హితులు,

బ్లాగ్మిత్రులు, స్నేహితులకు అందరికీ
యీ సంక్రాంతిపర్వదినం సకల శుభాలూ
చేకూర్చాలని ఆకాంక్షిస్తూ 

హృదయపూర్వక  సంక్రాంతి  శుభాకాంక్షలతో
మీ శ్రేయోభిలాషి ….నూతక్కి రాఘవేంద్ర రావు

ప్రస్తుతం  మన ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థ ఓ బ్లాక్ హోల్  .

రచన :నూతక్కి  (లోగడ ఒకరి వ్యాసానికి  నేను తెలియబరచిన అభిప్రాయం. )

భవిష్యత్ పరిణామాలను అంచనా వేయలేని ప్రభుత్వాలు ,జేబులు నింపుకొనే యత్నంలో రాజకీయులూ విచ్చలవిడిగా  వీధి బడుల్లా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు విసిరేస్తే, బ్లాక్ మనీ ఏమిచేయాలో సీలింగు భూములు ఎలా పరిరక్షించుకోవాలో తెలియక సతమతమౌతున్న అనేక వర్గాల   కామందులు అవకాశాన్ని తమకనుకూలంగా మార్చుకొని ఇంజనీరింగ్ కాలేజీలనే  విద్వత్తు ను అందించలేని  బ్లాక్ హోల్స్   సృష్టించి  యువతను ఆకర్షించి అసంబద్ధ ఆకర్షణలు రేకెత్తించి  వారి భవిష్య శక్తిని బక్షించి భారత భవితను నిర్వీర్యం చేస్తున్నారు.

తలిదండ్రులంటారా,బిఎస్సీ బదులు ఇదీ .అనే నిర్లిప్తత.ఎలాగోలా  ఎన్నిబాధలు పడినా మన వంతుగా మామూలు డిగ్రీ బదులు ఇంజినీరింగ్ చదివిద్దాం   .  వస్తే మంచి వుద్యోగం వచ్చి బిడ్డ  జీవితం బాగు పడుతుంది. లేకుంటే మామూలు డిగ్రీ వాడిలాగానే జీవితం కొన సాగిస్తాడు.ఇది మధ్య తరగతి జీవి తపన.

ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు భవిష్య ప్రణాళికలు ,అంచనాలూ లేకుండా దూర దృష్టి లోపించి వ్యవహరించడం వల్లనే ఈ స్థితి.

ప్రపంచంలోనే మహాద్భుతమైన  మాననవ వనరులు  వుండీ సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళి కలే  లేని మన  దేశంలో  ప్రభుత్వాలు,  నిరుద్యోగ నివారణ ఇలాగైనా కొంత వరకు సాధించ వచ్చనుకొనియువతకు  విదేశీ బాట చూపుతున్నారు.
పుట్టిన నాటినుండి చదువే వ్యాపకమైన నేటి సమాజంలో సామాజిక విషయాల పై అవగాహనా లోపం వల్ల కొంత మంది యువత మీరు ఉదహరించినట్లు ప్రవర్తించ వచ్చుగాక . అంత మాత్రాన యువతదో తలిదంద్రులదో తప్పుగా నిర్దారించ వద్దు. విద్యలో ప్రతీ రంగం స్వయం వుపాధినందిన్చేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించి యువతకు నమ్మకం కలిగిస్తే ప్రస్తుతమున్న  ఇంజినీరింగ్  విద్య లాటి అజాగళ స్తనాస్వాదనలో తలమునకలు కారు.
ఓల్డ్ డైరీ
రచన :గిజిగాడు
తేది:07-01-2011
ఇప్పుడె నేనో పాతెస్ట్ డెయిరీని
బూజు దులిపి అదేలెండి
దుమ్ము దులిపి
పేజీలు  తిరగేస్తే
ఏడు పైసలకు ఒక్కటి తక్కువై
హైదరాబాద్లో ఆర్టీసీ బస్సెక్కలేక
పందొమ్మిది వందల డెబ్బయి లో సంగతి
మూడు కిలోమీటర్లు నడచి న జ్ఞాపకాలు
ఒక్క సారిగా వెదజల్లబడి.  .
సమాజ హితం కోరి ...
రచన: గిజిగాడు.
తప్పుకు ఒప్పుకు మధ్య తరతరాల సమాజాల అనుభవాల ప్రతీకగా గీయ బడిన గీతలు నాటుగా కనబడినా  సమాజానికి నేటికీ అవి గీటు రాళ్ళే .అర్ధం చేసుకొని ఆచరించడానికి అహంకారం అడ్డొస్తోంది.
పట్టపగలు నడిరోడ్డున నాగరికసభ్య సమాజపు  నగరంలో జనావాసాలమధ్య జరిగిన,దాడులూ  హత్యలు దురంతాలు ఏవైనా మానవ సమాజం ఖండించి తీరాలిసిందే.
మనిషికి జంతువులనుండి, ప్రక్రుతి భీభాత్సాల నుండి  సంరక్షించుకొనే దిశగా మానవ సమాజాలు ఏర్పడ్డాయి. కాని తానె నిర్మించుకున్న   రక్షక భట పటిష్టతల మధ్య మనిషికి మనిషి నుండి రక్షణ కరువైన ఉదంతాలు మనం తరచూ చూస్తున్నాం.
నేరచరిత్రలో పుట్టి,  నేరచరిత్రలో పెరిగి, నేరచరిత్రలో  చచ్చినవారి చరిత్రలు, సమాజాన నెత్తుటి చారిక గా మారి  రక్త చరిత్రలుగా నిలచిపోతున్నాయి.వీటికి  మీడియా ప్రాచుర్యం ,ప్రాముఖ్యం యివ్వడం వల్ల,నేరస్తులు హీరోలవుతున్నారు.
వాస్తవానికి చరిత్ర  పుటల్లో కధా నాయకుల కధతో పాటు విలన్లనూ ప్రస్తావిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో  మీడియా చలవతో   విలనీనే హీరోయిజమౌతోంది.
సందర్భోచితంగా  మీడియా సంయమనం పాటించి ఎంత క్లుప్తంగా చర్చించితే సమాజానికి అంత హితం చేసినవారౌతారు..
సమాజానికి వెన్నుకాచిన హీరోలు జీరోలుగా  మారి,వారికి  నీరవ నిశ్శబ్ద చరిత్రలూ కరువౌతున్నాయి.భావి తరాలకే కాదు నేటి బాల్యానికీ తప్పుడు సంకేతాలు అందుతున్నాయి.
భావి తరాలకు  తప్పొప్పుల తీరులపై తప్పుడు సంకేతాలందిస్తున్నామన్న భావన, అన్ని మీడియాలూ అర్ధం చేసుకుంటే  సిగ్గిలవలసిన స్థితి.
సమాజనికి  హితము  ,అహితము మధ్య  అక్షర మాత్రపు వ్యత్యాసంగా మాత్రమే భావిస్తున్న మీడియా  …. పరిస్థితుల సున్నితత్వాన్ని గ్రహించలేని  వారి అవగాహనా రాహితి క్షమించ రానిది.
రోజులకు రోజులు ఒకే  విషయమై అదేదో  ప్రపంచానికే చావు బ్రతుకుల సమస్యలా   ఊదర కొడుతూ…  వుంటే  నేరస్తులు హీరోలవుతున్నారు. యిది ప్రజా స్వామ్య  దేశానికి పట్టిన దుర్గతిగా భావించాలి.
అన్ని మీడియాలూ  భావ ప్రకోపాలు రెచ్చ గొట్టక వాస్తవాలు మాత్రమే వ్యక్తీకరించే రీతిలో ప్రక్షాళన దిశగా  ప్రయత్నాలు కొనసాగాలి. జరిగిన తప్పులు దిద్దుకొని  మీడియా ప్రముఖులు కర్తవ్య నిష్ఠ పై దృష్టి సారించాలి. అది సమాజానికి హితమౌతుంది.

మీకు తెలుసా !.1

సేకరణ : నూతక్కి
మూలాధారం : వికీపీడియా.

1) నిర్జన ప్రదేశమైన సహారా ఎడారి షుమారు 9 మిలియన్ మైళ్ళ లో విస్తరించి ఉందని…….
2) నివాస యోగ్యం కాని ఆ ప్రాంతం  సోలార్ ప్యానెల్స్ తో కనుక కవర్   చేసినట్లయితే 630 T.w (Terra watts) ఎలెక్ట్రికల్ పవర్ ఉత్పత్తి చేయ వచ్చని ………
3)) అది ప్రస్తుత  భూ ప్రపంచ విద్యుదుత్పత్తి కి షుమారు 46  రెట్లు ఎక్కువనీ …….
4)  ప్రస్తుత  ప్రపంచ విద్యుత్ వినియోగం…. అంటే  నూనె,గ్యాస్ ,బొగ్గు,అణు విద్యుత్,జల విద్యుత్  ప్రక్రియల  ద్వారా   ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి  అవుతూ, వివిధ అవసరాలకు  వినియోగ పడుతున్నమొత్తం విద్యుత్ ఎనెర్జీ    13.5 T.w  అని. ……
4) 1 sqmt సోలార్ ప్యానెల్ తో 1k.w విద్యుత్ ఉత్పత్తి చేయ వచ్చని……..
మీరేమంటారు మాష్టారూ
‘గిజిగాడు”

గత వర్షంలో
తెలుగు బ్లాగ్లోకాన
చిద్రమైన తన గూటిని
నూతన వర్షంలో
బాగు చేసుకుందామని
ఆకాంక్షగా
రెక్కలల్లారిచి
త్వరితగతిన
మీ ముందుండాలని
అభిలషిస్తూ ….
స్వాగతిస్తే
సంతసిస్తా
మరి మీరేమంటారు మాష్టారూ అంటూ !
…..మీ గిజిగాడు

« గత పేజీ