Posted by Gijigaadu under
expressions
2 వ్యాఖ్యలు
పాపం బాపు !
(వెంకటరమ ణుడు ఒంటరిగా వెడలి పొతే)
రచన …నూతక్కి
జీవిత కాలం తన వాడయి
తనతో ఒకడై తనలొ ఒకడై
తానొక్కడుగా ఒక్క మాటా
చెప్పకుండా తరలి పొతే
ముళ్ళపూడి
ఒంటరిగా కుమిలి పోతూ…బాపు
అయినా …
ఒంటరివాడు కాదు బాపు .
తెలుగు సాహితీలోకానికి
వెంకటరమణునితో కలిసి
రమణీయ రేఖలతో
భావ వర్ణాలు అద్దిన బాపు
ముళ్ళపూడి ప్రతీ రాతనూ
గీత గా మార్చి ప్రతీగీతనూ
నవ్వుల ఝల్లుగా
అర్ధాన్నిపూయించిన బాపు .
వెంకట రమణతో
కలిసి మెలిసి
తెలుగు హాస్యమై
జల్లులుగా కురిసిన బాపు
తెలుగుల ఆనందాల
లోకానికే బాపూ.తెలుగు సాహితీ
హితులున్నంత కాలం
బాపువెంకట రమణులు
వేర్వేరుగా లేరు కాలేరు.
భౌతికంగా వెంకటరమనుడు
ఒంటరిని చేసి పోయినంతనే
ఒంటరివాడు కానేరడు బాపు
అక్షరాహాస్యం ముళ్ళపూడి
అక్షరాలు పదాలై
హాస్య భావ ప్రకటితమై
నవ్వని వాడినీ కుదిపి
నవ నాడులనూ
స్పందింపజేసి
నవ్వింప జేసి
తెలుగుల గుండెల్లో
పీఠం సుస్తిర పరచుకున్న
మన వెంకట రమణ
చచ్చి ఎక్కడికి పోతాడు
మరెక్కడికీ పోలేడు
మనలోనే ఉంటాడు
Posted by Gijigaadu under
expressions
2 వ్యాఖ్యలు
?
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
పోలిస్తే పరిమాణంలో
రేణువు
పృధ్వీతలమీ జగతిన
అందున
మానవమాత్రులింకెంతని ?
అయినా
అహంకారం
విరాట్ స్వరూపమై
నా జాతి,
నా ప్రాంతం,నా రాష్ట్రం ,నాదేశం
నా ఖడం…
భూ మాతకు కలిగించే కడగండ్లు
అంతరంగ ఝాడ్జ్యాలు
అభిమతాలై
మతాలుగా పరిఢవిల్లి
మమతలపై దాడి చేసి
మానవతను చిదిమి వైచి
విధ్వంస రచనా నచణ…
విక్రుతమై మానవ
మస్తిష్కాలు
రహస్యాలు ఛేదించి
విశ్వాన్నే తనగుప్పిట
ఇముడ్చుకొనే తపన…
విలయాలను సృష్టిస్తూ
స్వయం హనన ప్రక్రియలో
మురిసిపోతూ
ధరిత్రిని చిద్రం చేస్తూ
తన ఉనికికే ప్రశ్నార్ధకం రాసుకుంటూ
కుళ్ళి పోతున్న ప్రజా స్వామ్య విలువలు
రచన: నూతక్కి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో17-02-2009 న
ప్రజాస్వామ్య అధికారిక వేదిక
లెజిస్లేచర్ అసెంబ్లీ లో
ప్రజా ప్రతినిధుల క్రూర వికృత విన్యాసం
ప్రజాస్వామ్యాన్ని విస్చ్చిన్నం చేసే యత్నం
నియంతృత్వ విధానాలతో మాత్రమే మేము
నియంత్రించ బడతామని తమకు తామే
చెప్పకనే చెప్పుకున్న బానిసత్వ
మానస ప్రవృత్తితో వికృత ప్రజా ప్రతినిధులు .
రాజ్యాంగ ప్రతిష్టంబనకు దారి చూపేలా
జరుగుతున్న సంఘటనలను
నీవు కూర్చున్న కొమ్మను
నీకు నీవె నరుక్కో వద్దని
చెప్పిన జయప్రకాష్ నారాయణపై
దాడిని
ప్రతీ పౌరుడూ ఖండించవలసిన తరుణం.
జె పి పై దాడి ప్రజాస్వామ్యంపై దాడి.
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
ముప్పేట దాడి.
రచన: నూతక్కి
మనోబాహ్యవలయాలకు
వెలుపల
ముప్పిరిగొని
వైవిధ్య భావ
సంచయాల అలికిడి
చుట్టుముట్టిన …..
వేవేల ఈగల తేటుల
ధ్వని తరంగ
ద్వానంలా …
అసహనమై నా మది
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
Posted by Gijigaadu under
expressions
వ్యాఖ్యానించండి
నేస్తం!
(నీ పేరన్నా చెప్పి చావవా !)
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
31-01-2011
నేస్తం ఇది న్యాయమా !
హటాత్తుగా
యీ క్షణం నా ముందు
నిలిచి ..
“నీ బాల్య మిత్రుని నను
పోల్చుకోమ్మ్మని
పేరు చెప్పుకొమ్మని”
నీ వనడం ?
ఎన్ని నాళ్ళు
ఎన్ని యేళ్ళు
ఎన్నెన్నని దశాబ్దాలు …
గడచిన కాలపు గ్నాపకాల
దొంతరలు తిరగేసుకుంటూ….
బాల్యపు స్మృతుల పుటల్లో
నడయాడుతు నా వెదుకులాట ….
వుడుత కొట్టిన
జామ కాయ
కాకెంగిలి చేసుకు
నాతో పంచుకుతిన్న
కామేశానివా ?
ఉప్పు కారాల పొట్లం లో
చెట్టు కొమ్మపై కూర్చొని
పూల్లమామిడి కాయలు
నాతో కలిసి నంజుకుతిన్న
కిష్టిగాడివా!
కోతికొమ్మచ్చిలో
తొండి చేసి పారిపోయి
తొందరలో భయంతో
నిమ్మ చెట్టు పొదల ముళ్ళల్లో
ఇరుక్కున్న
వుమ్మిగాడివా!
మోట బాయి బానలో
నా వెంట దిగి
నీళ్ళల్లో మునిగి
బెంబేలెత్తి
గావుకేకలేట్టిన
కోటి గాడివా.!.
పెద కాలవ గట్టు మీద
నేరేడు కొమ్మేక్కిన
నను కాలవలో తోసి
పారిపోయిన పుల్లిగానివా!
.
ఎవడివిరా
నువ్వెవరయి ఉంటావు?
గడచిన గత కాలపు
జ్ఞా పకాల
దొంతరలోఅందరినీ
తిరగేస్తూ
నీ కోసం వెదుకుతున్నా….
బాల్యపు స్మృతుల పుటల్లో
కనిపించే రూపులలో
నిను ,నీ ఆహార్యం,వాచికం
సరిపోల్చుతూ
స్పష్టాస్పష్టంగా
నా అంతరంగాన
నీ అప్పటి రూపును
శిల్పిస్తున్నా
మధించి చూస్తున్నానాగు
ఆగలేకుంటే ..సరి
వెధవా నీ పేరన్నా చెప్పి చావు. …. ..