మనో భావ వైవిధ్యం
రచన: నూతక్కి
తేది :04-02-2011

కోపం దుక్ఖం బాధ

రోదన వేదన,
సంశయ సంభ్రః
మానందాశ్చర్య

మానస విన్యాసాలు

కావేవీ
అవి
వ్యక్తికి
సమాజానికి
వైపరీత్యాలు
వినాశ హేతువులు
మనసులకవి
సాంత్వనలు .
క్రోధం ద్వేషం
రోషం కక్ష
కార్పణ్యం
పగలు పంతాలు
విచక్షణా రహితమై
వ్యక్తిపర సమాజ
విధ్వంస కారక
ఛిద్ర   హేతువులు
మమతలకవి
దుఃఖ భాజనలు