కుళ్ళి పోతున్న ప్రజా స్వామ్య విలువలు

రచన: నూతక్కి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో17-02-2009 న
ప్రజాస్వామ్య అధికారిక వేదిక
లెజిస్లేచర్ అసెంబ్లీ లో
ప్రజా ప్రతినిధుల క్రూర  వికృత విన్యాసం
ప్రజాస్వామ్యాన్ని విస్చ్చిన్నం చేసే యత్నం
నియంతృత్వ విధానాలతో మాత్రమే  మేము
నియంత్రించ బడతామని తమకు తామే
చెప్పకనే చెప్పుకున్న  బానిసత్వ
మానస ప్రవృత్తితో  వికృత ప్రజా ప్రతినిధులు .
రాజ్యాంగ ప్రతిష్టంబనకు దారి చూపేలా
జరుగుతున్న సంఘటనలను
నీవు కూర్చున్న కొమ్మను
నీకు నీవె నరుక్కో వద్దని
చెప్పిన జయప్రకాష్ నారాయణపై
దాడిని
ప్రతీ పౌరుడూ ఖండించవలసిన తరుణం.
జె పి  పై దాడి ప్రజాస్వామ్యంపై దాడి.