?
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

పోలిస్తే పరిమాణంలో

రేణువు

పృధ్వీతలమీ జగతిన

అందున
మానవమాత్రులింకెంతని ?
అయినా
అహంకారం
విరాట్ స్వరూపమై
నా జాతి,
నా ప్రాంతం,నా రాష్ట్రం ,నాదేశం
నా ఖడం…
భూ మాతకు కలిగించే  కడగండ్లు
అంతరంగ ఝాడ్జ్యాలు
అభిమతాలై
మతాలుగా  పరిఢవిల్లి
మమతలపై దాడి చేసి
మానవతను చిదిమి వైచి
విధ్వంస రచనా నచణ…
విక్రుతమై  మానవ
మస్తిష్కాలు
రహస్యాలు ఛేదించి
విశ్వాన్నే తనగుప్పిట
ఇముడ్చుకొనే తపన…
విలయాలను సృష్టిస్తూ
స్వయం హనన ప్రక్రియలో
మురిసిపోతూ
ధరిత్రిని చిద్రం చేస్తూ
తన ఉనికికే ప్రశ్నార్ధకం రాసుకుంటూ