మార్చి 2011


అంగాంగం కన్నీరే కారుస్తుంది

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

 

యీ వార్త…

నూతన్ ప్రసాదిక లేడట !!!

ఏదో అసంకల్పిత వేదన

గొండె లోలోతులనుండి

వెలువడిన

ఆర్తనాదం

విన్నావా! మన నూతన్ ప్రసాద్

చని పోయాడట

మనకిక లేడట…….

అతడెవరని నాకేమౌతాడని?

గుండెలోలోతుల నుండి తన్నుకొస్తున్న

యీ కన్నీళ్లు ఎందుకని ?

కేవలం అతనో నటుడే గా …

 

అంతేనా ! అంతకు మించిన

పండించిన నటన లో

స్పందనలో మానవతా వేదనలో

 

విలనైనా వినూత్న రీతి లో

ఆర్ద్రతలో ఆత్మీయతలో

హాస్యం అందించిన తీరు లో

నటనలో నభూతో న భవిష్యతి

 

విధి ఆడిన వికృత కేళి

నిర్భరమైనా

నిబ్బరంగా ఆడి అబ్బురంగా జీవించి

ఇంటింటా మావాడనిపించుకున్న

వాడా నూతనుడిక లేడంటే

కన్నే కాదు

గుండే కాదు

అంగాంగం

కన్నీరే కారుస్తుంది

 

మూర్ఖతలో  …( మానవుడు )

రచన :నూతక్కి

29-03-2011

నవ మాసాలు

మాత్రు గర్భ కుహరంలో

అమ్మ అంతః శ రీర

ఛిద్రిత కణ జాల

అణు సమూహాలు

ఒకటొక్కటిగా

దరి చేరి రూపొంది

బాహ్య ప్రపంచాన

శిశువుగా బయల్వెడలి

భువిపై ఎదిగి

మానవ రూపం…

వివిధ భావావేశ కావేశాల

అంతరంగ విన్యాసంతో

అహంకారిగా

సహన శీలిగా

దయామయునిగా

స్వభావ రీత్యా

మరేన్నెన్నోవికృతాలు

భావ స్వరూపాలై

రూపాంతర మొంది

అనుక్షణం

సహ మానవ జీవులు

అద్రుష్టాద్రుష్ట

దృశ్యా దృశ్య

ప్రకృతి శక్తులు,

జంతు జాలములు,

ఎన్నెన్నో ఎందరెందరో

సహకరించినా

కృతజ్ఞతా రాహితిలో

తానొక్కడే తనకు తానుగా

యీ తీరున ఎదిగినట్లు ……

తన నెదిరించే వాడే లేడన్నట్లు

మూర్ఖత లో

మానవుడు

 

వ్యత్యాసం.

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు

మనకు జరిగిన

మంచి
మరొకరికి చెడుగా
పరిణమించి
బాధించి
వుండవచ్చు…..
మీరేమంటారు?
సు స్వాగతం
రచన   :నూతక్కి

ఖరం  కదలి

మన

దరి  కొచ్చెను
ఆహ్వానిద్దాం
సంవత్సర
పర్యంతం
ఖరగానం
ఆస్వాదిద్దాం
వికృత కేళి
రచన : నూతక్కి.

కవల సౌధాలు

కూలినపుడు
కూల్చబడినప్పుడు
మానవుడే
మానవునిపై
జరిపిన దారుణ
వికృత చర్యగా
విస్తుపోయాం
ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యపు
సకల వ్యవస్తలు నేలకూలి
నిర్వీర్యమై
ప్రపంచ ఆర్ధిక చిత్రం
వర్ణ రహితమై అస్తవ్యస్తమై ….
క్రమేణా క్రమ రీతిన
జవసత్వాలు
సమ కూరుతున్న
యీ తరుణాన ….
ప్రపంచ ఆర్ధిక వ్యవస్తకు
శాస్త్ర వినియోగానికి ఉత్పాదనకు
తానో ప్రముఖ తార్కాణం…
బలీయమైన
ప్రపంచ  ఆర్ధిక ఉత్పాదక
కార్మిక వ్యవస్థ జపాన్
నేడు
విలవిల లాడుతోంది
ప్రకృతి జలఖడ్గ  తాడనాన
భూ కంప తీవ్రతన
అగ్ని పర్వతాల విస్ఫోటనల
అణుధార్మికతా జలకాల
లావా ప్రవాహాల ప్రకోపనల
భయ భీకర భూకంపనాల
నగరాలకు నగరాలు
ఆకాశ హర్మ్యాలు
సమోన్నత పారిశ్రామిక
భవన సముదాయాలు ,
వోడలు కారులు
ఒకదానిపై మరొకటి
పోటీపడి  అధిరోహిస్తూ
భవనాలపై  పయనిస్తూ
క్షణాలలో తుత్తునియలై
చెత్తగా  మారి  జలప్రళయ
విలయ ప్రవాహంలో
కొట్టుకు పోతుంటే
వేలు లక్షల జనులు
తమ ప్రాణాలు
తమ కళ్ళ ముందే
ఊపిరందక ఎగ  శ్వాసతో
పైకెగసి పోతుంటే
తనవారేక్కడో రక్షించుకొనే
తావెక్కడ ?తనను
రక్షించే వారింకెక్కడ  ?
దోషిగా
ఎవరిని నిందిద్దా మిక్కడ ?
శాస్త్ర జ్ఞాన పుణ్యమా
యని
యీ ప్రాకృతిక విక్రుతాలను
గతం లో ఎన్నెన్నో వీక్షించినా ….
మానవాళి పై  ప్రకృతి
విన్యసించిన యీ శతాబ్ద
వికృతం
ఓ జాతినే తుడిచి పెట్టాలని
ప్రకృతి విరచించిన వ్యూహమా !
తా తలచినచొ   ఏ జాతీ
తనపై  మనలేదని
సూచనగానా?
యీ విన్యాసం!  బీభత్సం !
అంతరాలలో
భావావేశాలు -అంతరంగాలు
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

కష్ట సుఖ దుఖః

భయాభయ
వేదనాశ్చర్య

క్రోధ మద మాత్సర్య
ఈర్ష్యా ద్వేషా క్రోశ
శోక
సంతోషానంద
సమ్మిళితమై
అంతరంగాలు
నిరంతరమై
అనంతానంత
యానంలో
అన్వేషణలో
సంతుష్టాసంతుష్ట
సందిగ్ధా సందిగ్ధతల
శిఖరాగ్రాంతర
వ్యత్యాసాల లోయలు
ఉభయ  సంధ్యలు .
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

చెట్లపై పక్షుల

కలకలా
రావాలు

సాయం సంధ్య
చెట్లపై పక్షుల
కిల కిలా
రావాలు
ఉదయ సంధ్య

ఓ చిట్కా

రచన : నూతక్కి.

ప్రకృతి విలయ తాడనలో అణు ధార్మిక పదార్ధాల విస్పో టనలతో ….ప్రస్తుతమ్ ప్రపంచాన్ని చుట్టుము ట్ట బో తున్న అణుధార్మిక భూతపు భయంకర స్థితిగతుల నేపధ్యంలో….

ప్రపంచ దేశాలు, ….(అన్నీ కలిసి) కనీసం భవిష్యత్తు కొఱకు, సత్వరమే ఓ ఆచరణీయమైన నిర్ణయానికి వచ్చి జీవావరణాన్నిపరి రక్షించుకోవలసిన రావలసిన ఆవశ్యకత వుంది.అదెలాగంటే …..

నూనె , బొగ్గు, అణు ఇంధనం, ఆవశ్యకత లేని, దేశ సార్వభౌమాదికారాలను అగ్ర రాజ్యాలకో మరో దేశానికో తాకట్టు పెట్టనవసరం లేని …

.సూర్య రశ్మి ,వాయు శక్తి, సముద్ర అలల శక్తి వంటి సహజ వనరులు వినియోగించుకొని సాంప్రదాయేతరరీతుల లో విద్యుదుత్పాదనను సాధించడం పై దృష్టి సారించి

పర్యావరణ పరి రక్షణనూ దృష్టిలో వుంచుకొని చేయి చేయి కలిపి ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నది నా అభి ప్రాయం. మీరేమంటారు?

 

అక్షరాలు -4
రచన :నూతక్కి
తేది :12 -03-2011
ఏహ్యతలో
సహ్యతలో
అసహనంలో
సహనంలో
సాంత్వనలో
నిర్వేదనలో
దాపునున్న
ఒదార్పులో
సర్వ కాల
సర్వావస్తల
వ్యకావ్యక్త
విన్యసిత
మహత్తర
భావ
తుణీరాలై
అక్షరాలు
అక్షరాలు -3
రచన :నూతక్కి
తేది :12 -03-2011
వేదనలో
సుఖ దుఃఖ
విభావరిలో
పుట్టుకలో
చావులో
విముఖతలో
సుముఖతలో
వ్యకావ్యక్త
విన్యసిత
మహత్తర
భావ
తుణీరాలై

తర్వాత పేజీ »