అరాచకం .
రచన …నూతక్కి రాఘవేంద్ర రావు.

సిగ్గు చేటు సిగ్గు చేటు
విద్వాంస ణచనలో
చిద్రమైన తెలుగు
వెలుగుల జ్ఞాపకాలు
తెలుగుల కైనా
తెలన్గులకైనా

ప్రభుత్వ వైఫల్యం
వుద్యమ కారుల
ఆధిపత్యం
ఉన్మాదుల వికృత చర్యలు.
అరాచక శక్తుల ముసుగుల్లో
రెచ్చి పోయిన ఉగ్ర తాడనం
ప్రభుత్వం యింకెందుకు
అధికారం నియత్రిచలేని
ఆదిపత్యమింకెందుకు    …
చాత కాదని
తలనెక్కడో పెట్టుక గద్దె దిగక.
వుద్యమ కారులు పెళ్ళికి వచ్చి
భోజనాలు చేసి ఆశీర్వదించి
పోతారని భావించారా?

కావాలని  ఉద్యమకారులు

ట్యాంక్ బండునే

కేంద్రంగా , సమావేశ స్థలిగా
ఎన్ను కోవడంలో అర్ధం
ప్రభుత్వ మేధ కు  తట్టలేదా
వుద్యమ కారులు అంతకుముందే
చేసిన హెచ్చరికలు  జ్ఞప్తికి లేవా ?
గూఢ చారి వ్యవస్థ చచ్చిందా
తుత్తినియలై పొతే పోనీయని
గతకాలపు రాజకీయ పీడలు
జ్ఞాపకాలుగా మిగిలినవేవో
తొలగి పోతాయని యోచనా ?
వుద్యమ నేపధ్యంలో
రక్షకభటుల ఆధ్వర్యంలో
వికృత  విధ్వంస కాండకు
మదోన్మ త్త    యోజనయా ?
మహోన్నత వ్యక్తుల
విగ్రహాల విధ్వంసం.
నాగరీక సమాజపు
పాలక నేతల
నికృష్ట  వైఫల్యమా ?
ఉద్యమకారుల
రాక్షసత్వ మృగానంద మా   ?
నాడెప్పుడో ఘజనీ ఘోరీల
నికృష్ట చర్యల  గూర్చి విన్నాం
బాబ్రీ మసీదు విధ్వంసమూ విన్నాం
ఆయా  అధినాయకగణ  ఆదరణలో
వ్యూహ రచనలో
నేడు  చిద్రమైన
తెలుగు వెలుగుల జ్ఞాపకాలు
అంతకన్నా  తక్కువా?
ప్రభుత్వముండీ
రక్షక వ్యవస్తలుండీ
రక్షించలేని
నికృష్ట ప్రభుత్వాలు
వుండి ఎందుకు ?
రేపు ప్రజలకూ ఇదే గతైతే …
ఉద్యమం వెనుక నుండి
నడిపించే  శ క్తులెవరు
తెలుగుల ఖ్యాతిని
ఓర్వని  మరింకేవరో! వారెవరో!
తెలుసుకోను ప్రభుత్వం
అంటూ ఒకటి ఉంటేగా ..  .