మూర్ఖతలో  …( మానవుడు )

రచన :నూతక్కి

29-03-2011

నవ మాసాలు

మాత్రు గర్భ కుహరంలో

అమ్మ అంతః శ రీర

ఛిద్రిత కణ జాల

అణు సమూహాలు

ఒకటొక్కటిగా

దరి చేరి రూపొంది

బాహ్య ప్రపంచాన

శిశువుగా బయల్వెడలి

భువిపై ఎదిగి

మానవ రూపం…

వివిధ భావావేశ కావేశాల

అంతరంగ విన్యాసంతో

అహంకారిగా

సహన శీలిగా

దయామయునిగా

స్వభావ రీత్యా

మరేన్నెన్నోవికృతాలు

భావ స్వరూపాలై

రూపాంతర మొంది

అనుక్షణం

సహ మానవ జీవులు

అద్రుష్టాద్రుష్ట

దృశ్యా దృశ్య

ప్రకృతి శక్తులు,

జంతు జాలములు,

ఎన్నెన్నో ఎందరెందరో

సహకరించినా

కృతజ్ఞతా రాహితిలో

తానొక్కడే తనకు తానుగా

యీ తీరున ఎదిగినట్లు ……

తన నెదిరించే వాడే లేడన్నట్లు

మూర్ఖత లో

మానవుడు