అంగాంగం కన్నీరే కారుస్తుంది

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

 

యీ వార్త…

నూతన్ ప్రసాదిక లేడట !!!

ఏదో అసంకల్పిత వేదన

గొండె లోలోతులనుండి

వెలువడిన

ఆర్తనాదం

విన్నావా! మన నూతన్ ప్రసాద్

చని పోయాడట

మనకిక లేడట…….

అతడెవరని నాకేమౌతాడని?

గుండెలోలోతుల నుండి తన్నుకొస్తున్న

యీ కన్నీళ్లు ఎందుకని ?

కేవలం అతనో నటుడే గా …

 

అంతేనా ! అంతకు మించిన

పండించిన నటన లో

స్పందనలో మానవతా వేదనలో

 

విలనైనా వినూత్న రీతి లో

ఆర్ద్రతలో ఆత్మీయతలో

హాస్యం అందించిన తీరు లో

నటనలో నభూతో న భవిష్యతి

 

విధి ఆడిన వికృత కేళి

నిర్భరమైనా

నిబ్బరంగా ఆడి అబ్బురంగా జీవించి

ఇంటింటా మావాడనిపించుకున్న

వాడా నూతనుడిక లేడంటే

కన్నే కాదు

గుండే కాదు

అంగాంగం

కన్నీరే కారుస్తుంది