మార్చి 2011


కాపాడు తండ్రీ !
రచన : నూతక్కి
నీవె  రూపాన  వున్నా ,
ఏ పేరున పిలవబడిన
ఏల తండ్రి యింత క్రోధం ?
ఏల తండ్రి  యింత ధ్వంసం
ప్రపంచ మానవాళి
తమ అభిమతా లైన
మతాలలో
నిన్నే రూపాననైన
నిన్నే పేరునైన
నమ్మనీ
ప్రేమించనీ
ప్రార్ధించ నీ
భగవంతుడా
శివుడ వో,విష్ణు డవో
రాముడవో, కృష్ణు డవో
క్రీస్తుడవో  మొహమ్మదువో
బుద్ధుడవో సిక్కుల దైవానివో
వెంక టేసు డవో
యే రూపాన నీవున్నా
యింకా ఏయే రూపానన నీ వున్నా
యే యే నమ్మకాలలో
కలగలిసి   వున్నా
మా  విన్నపం
మన్నించు  తండ్రీ
భయ భీకర
విలయంలో
చిక్కుకున్న
సోదరులు
జపనీయుల
కరుణించు తండ్రి
జలప్రళయ,
భూకంపనల,
మహోగ్ర
విలయాగ్ని నుండి
స్వయంకృత
అపరాధాలనుండి
రక్షించగ  ఒదార్చగ
వేవేగమె తరలివచ్చి
కాపాడు తండ్రి
అక్షరాలు -2
రచన :నూతక్కి
తేది :12 -03-2011
భావోద్భవ
తరంగమై
వాక్చాతుర్యమై
వుపన్యాసమై
మహత్తర గాన
మాధుర్యమై
మృదు మధుర
నాద  మై
సంగీతమై
రోదనలో
వ్యకావ్యక్త
విన్యసిత
మహత్తర
భావ
తుణీరాలై
అక్షరాలు

అక్షరాలు -1
రచన :నూతక్కి
తేది :12 -03-2011
శిల్పమై
చిత్రమై,
లిఖిత భావ
దృశ్యమై
చలిత
హ్రుద్యంగ
విన్యసిత
మహత్తర
భావ మై
తూణీ రమై
అక్షరాలు

ప్రకృతే విలయిస్తే !!!

రచన: నూతక్కి
తేది:11-03-2011

జపానులో నేడైనా …

జల ప్రళయం భూ కంపం
అగ్నిపర్వత విస్పోటనలు
గ్రహ శకలాల తాకిళ్ళతో
మహోధృత విధ్వసనలు
జనజీవ  హననం   

జీవులు విలపించే
అవకాశాలూ ఉండవు
హే భగవాన్ రక్షించని
వేడుకొనే క్షణాలూ దక్కవు
అహంకారాలు
హూంకారాలు
క్రూర ఘోర ప్రవృత్తుల
కుస్చ్చితాల వికృతాలు
భగవంతునిపేర మానవ
జాతి విభాజనలు
విధ్వంసనలు ..
జలప్రళయ వికృతం
విసుగు చెంది ప్రకృతి
చేసిన కరాళ నృత్యం….
కాని …
నిత్య జీవన విన్యాసాలకు
యే విధ్వంసం లేకుండా…
నేను ,నాది, నా మతం ,
నా ప్రాంతం,  నా దేశం ,
మనిషి మనిషిని హింసించే
సంస్కృతీ ప్రతీకలను
విధ్వంసించే
నైచ్య  భావ  వికృతాల
అహంకారాలు తుడిచి పెట్టె
సుహృద్భావ సునామీలూ
కావాలిక్కడ  కావాలిప్పుడు
అరాచకం .
రచన …నూతక్కి రాఘవేంద్ర రావు.

సిగ్గు చేటు సిగ్గు చేటు
విద్వాంస ణచనలో
చిద్రమైన తెలుగు
వెలుగుల జ్ఞాపకాలు
తెలుగుల కైనా
తెలన్గులకైనా

ప్రభుత్వ వైఫల్యం
వుద్యమ కారుల
ఆధిపత్యం
ఉన్మాదుల వికృత చర్యలు.
అరాచక శక్తుల ముసుగుల్లో
రెచ్చి పోయిన ఉగ్ర తాడనం
ప్రభుత్వం యింకెందుకు
అధికారం నియత్రిచలేని
ఆదిపత్యమింకెందుకు    …
చాత కాదని
తలనెక్కడో పెట్టుక గద్దె దిగక.
వుద్యమ కారులు పెళ్ళికి వచ్చి
భోజనాలు చేసి ఆశీర్వదించి
పోతారని భావించారా?

కావాలని  ఉద్యమకారులు

ట్యాంక్ బండునే

కేంద్రంగా , సమావేశ స్థలిగా
ఎన్ను కోవడంలో అర్ధం
ప్రభుత్వ మేధ కు  తట్టలేదా
వుద్యమ కారులు అంతకుముందే
చేసిన హెచ్చరికలు  జ్ఞప్తికి లేవా ?
గూఢ చారి వ్యవస్థ చచ్చిందా
తుత్తినియలై పొతే పోనీయని
గతకాలపు రాజకీయ పీడలు
జ్ఞాపకాలుగా మిగిలినవేవో
తొలగి పోతాయని యోచనా ?
వుద్యమ నేపధ్యంలో
రక్షకభటుల ఆధ్వర్యంలో
వికృత  విధ్వంస కాండకు
మదోన్మ త్త    యోజనయా ?
మహోన్నత వ్యక్తుల
విగ్రహాల విధ్వంసం.
నాగరీక సమాజపు
పాలక నేతల
నికృష్ట  వైఫల్యమా ?
ఉద్యమకారుల
రాక్షసత్వ మృగానంద మా   ?
నాడెప్పుడో ఘజనీ ఘోరీల
నికృష్ట చర్యల  గూర్చి విన్నాం
బాబ్రీ మసీదు విధ్వంసమూ విన్నాం
ఆయా  అధినాయకగణ  ఆదరణలో
వ్యూహ రచనలో
నేడు  చిద్రమైన
తెలుగు వెలుగుల జ్ఞాపకాలు
అంతకన్నా  తక్కువా?
ప్రభుత్వముండీ
రక్షక వ్యవస్తలుండీ
రక్షించలేని
నికృష్ట ప్రభుత్వాలు
వుండి ఎందుకు ?
రేపు ప్రజలకూ ఇదే గతైతే …
ఉద్యమం వెనుక నుండి
నడిపించే  శ క్తులెవరు
తెలుగుల ఖ్యాతిని
ఓర్వని  మరింకేవరో! వారెవరో!
తెలుసుకోను ప్రభుత్వం
అంటూ ఒకటి ఉంటేగా ..  .

అంతర్జాలంలో – ఆభిజాత్యాలు

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

తేదీ :09-03-2011

 

ఎక్కడో పూర్వోత్తర

తీర ప్రాంగణాన

అభిజాత్యంలో

మేధావి పుంగవులు

అంతర్జాల మాధ్యమాన

దేశపు నడి బొడ్డునున్న

నా బుర్రనే ఎందుకు

ఏరికోరి మరీ ఆబగా

తిన్నారో నని సతమతమౌతూ

నిస్తేజుడ నై నేనుంటే ….

ఏదేదో ఏకరువుపెడుతూ

ఆమె ధోరణిలో నా సహచరిణి …

అర్ధం కాని శూన్యంలా

నా మొఖం…

రెచ్చిన ఆక్రోశంతో..

పెనంలోని పేలాల్లా

నే ఎగిరి ఎగిరి పడితే

కనలి కుమిలిన మనసుతో

నన్న పార్ధం చేసుకొని

మౌన పోరాటంలో ఆమె.

నా అభిజాత్యంతో మనసును

కించ పరచానా యని సతమతమై

తికమకలో మౌనంగా …నేనే

 

ఔరా! చూసారా క్షణాల కాలంలో

యీ అంతర్జాల తరంగాల

ఆభిజాత్య

పద ఘట్టనల ప్రకంపనలు.

మన ప్రమేయమంటూ లేకుండా నే

« గత పేజీ