ఏప్రిల్ 2011


నీలో అసూయ ద్వేషం నిభిదీక్రుతమై వున్నప్పుడు సుఖ సంతోషాలు దూరమౌతాయి. ప్రేమ సద్భావనలు ఆ జాద్జ్యానికి మంచి మందు. ……..       inserted by …Nutakki.

 ప్రేమ, నైతిక వర్తన, లేనట్లయితే ప్రతీ మనిషిలో ఏదో శక్తి లోపిస్తుంది.నిన్ను నీవు పరిశీలించుకో  అవసరానుసారంవాటిని నీలోనింపుకో శక్తిని పెంచుకో….inserted by NUTAKKI

సూక్తులు

సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.

జీవితంలో  ఎదురయ్యే ప్రతీ  సంఘటననూ ఎదుర్కోక తప్పదు. అది ప్రేమతో ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు.

సూక్తులు

సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.

మీతో ఎవరైనా కోపంతో పరుషంగా మాట్లాడితే  ప్రేమతోకూడిన మాటల జల్లులు ఆ మంటలపై కురిపించండి.

మాట

రచన :నూతక్కి.

మాటలే ఏ చేటు చేసినా

పెదవి దాటిన మాట
తుపాకి వీడిన తూటా..
కాని ..
మాటలే ప్రపంచ శాంతిని
మాటలే ప్రేమ భావనను
మాటలే  ఓదార్పును
మాటలే పరిష్కారాలను
మాట లే అన్యోన్యతను
మాటలే సోదర భావాన్ని
నెలకొల్పుతాయి

బాన సగం కారుతున్నా ..

రచన:నూతక్కి

నాటి రైతు కష్టజీవి

తోడుగా జోడెడ్లతో

అనుకున్నదే ధ్యేయంగా …

యెద్దులు గిత్తలు ఆవులు

బర్రెలు పెయ్యలు బుజ్జాయిలు

పశు సంతతి సంతతిలా

ఆస్తిలా కాపాడుకొంటూ …

పాడి పంట సౌభాగ్యం

సంతుష్ట జీవనం

ఉన్నంతన

ఉత్కృష్టమైన భావనం…

ఆకాలానికి యీ కాలానికి

నాటికీ ఈనాటికీ

వారధుల్లా

జ్ఞాపకాల మధురిమల ఝరిలో

మోట బావి ,మోటబాన ,

మోట మోకు ,మోట గిలక ,

వేటికవే ప్రత్యేకతలు

కరెంటు లేకున్నా

పదేకరాలైనా పారించిన ఆ రోజులు

బాన సగం కారుతున్నా ….

 

కులం అదో  ఆభిజాత్య దాహం 
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

అంటరాని తనమన్నది 

ఆభిజాత్యపు  దాహం 

అహంకార జాడ్జ్యం 
కులంలేదు మతం లేదు 
కడుపోక్కటే హితం 
   
 కుక్షి నిండి వుంటే 
ఆభిజాత్య హూంకారం   …
కరకరామంటుంటే   
ఆధారపడి …
అణగి మణగి
సమాజాన ….
కుక్షి కొఱకు పుట్టిన 
వృత్తే
కులమై కల్లోలమై  
ఆర్ధిక వ్యత్యాసాల
సమరాంగణాన  
కులవ్యవస్తకు చీడపట్టి
విక్రుతరూపమొంది
అంటరాని తనమై 
ఆది పత్యం 
చలాయిన్చువాడు   
చలాయించ బడువాడు  .
ఆర్దికమే అంతరమై
అనంతమై 
జనజీవన వ్యవస్తలో    
మనిషే   మనిషిని 
చీదరించుకొనే స్థితిని గాంచి 
హీన మైన దీన
జనుల ఉద్ధరణకు 
నడుం కట్టి
రాజ్యాంగ రచనలో 
సామాజిక న్యాయం
సమకూర్చిన ధన్య జీవి
అందుకన ఆరాధ్యుడై 
ఆర్తుల గుండెల్లో  గుడిలో దేవు డై     
అమరజీవి అంబేద్కర్ 
అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేదంటే ఎలా?
రచన :నూతక్కిరాఘవేంద్ర రావు.

అంతర్జాలంలో తెలుగు  సాహిత్యం…

వివధ ప్రక్రియలు ,సాహితీ ప్రమాణాలు.
 యీ  విషయం పై  అనేక సందేహాలు
సంశయాలు భావ వైవిధ్యాలు  ..
రాబోయే రోజుల్లో మరెన్నో వాగ్వివాదా
లు సాంప్రదాయ రీతుల దాడులు .

ఒక ప్రక్కన భాష శోషిల్లిందని ఘోషలు .
అంతర్జాల మాధ్యమంలో తెలుగులో భావ వ్యక్తీకరణ చేస్తున్న వారు, అంతర్జాల  శాస్త్ర పరిజ్ఞానం
ఆంగ్లంలో అభ్యసించినా  వారు  మాతృభాషపై ప్రేమతో అభిమానంతో  తెలుగు సేద్యం చేస్తున్న వారు .
వారిలో    ఎక్కువ మంది  ఆంగ్ల మీడియంలోనూ ఆ వాతావరణంలోనూ విద్యనభ్యసించిన  ఔత్సాహికులు .  తెలుగు భాషపై వారి  నిబద్ధతను  ప్రతి వక్కరూ అభినందించి తీరాలి .
.
వారి వారి  వ్యక్తీకర ణా  పరిధులలో  స్వేశ్చ వారి స్వంతం .నియంత్రణ గాని ,నిస్పృహ కాని   వారి దరి చేరదు . వారికి కావలిసింది…. ప్రమాణాల పెంపుకై మార్గ నిర్దేసికత. సద్విమర్శ(అనుకూల  విమర్శ అని కాదు సుమా. ),ఓ చక్కని  సలహా .
ఉద్దండ పండితులతో , వీరిని  పోల్చి, ఆ స్థాయిలో వీరు లేరని    కించపరచడం  భావ్యమా ?
 తెలుగు భాషలో  భావ వ్యక్తీకరణ  చేస్తూ తద్వారా భాషాభి వృద్ధికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాల తెలుగు రచయితలను ,అభినందించి  ప్రోత్సహించా లి . ప్రమాణాలు పెంపొందే రీతిలో సహాయ సహకారాలు అందించాలి.అయినా వారు భయపడుతున్నట్లు భాషా ప్రమాణాలు పడిపోవడం కానీ ,
వ్యక్తీకరానా ప్రక్రియలు బలహీన పడటం కాని జరుగుటలేదు. మీదు మిక్కిలి సుసంపన్నమౌతున్నాయి. సాంప్రదాయక మాధ్యమాలలో లేని  ప్రత్యేకత యిక్కడ…ఒకరి నుండి మరొకరు మంచిని  యిచ్చి పుచ్చు కోవడం. పొరబాట్లను అంగీకరించి సరిదిద్దుకోవడం. .
ప్రభుత్వాలు విఫలమైనా , చాందస భావ  భాషా పండితులు  భాషను కఠిన తర  నియమ నిబంధనలలో సామాన్యుని చెంతకు చేరనీయక భాషాభి వృద్ధిని అణగ త్రోక్కినా , అభివృద్ధిపరంగా తిరోగమన పధంలో పయనిస్తున్న తెలుగు భాషకు ,వివిధ ,పత్రికా ,దృశ్య మాధ్యమాలు తమ తమ స్థలాభావమ్ ,సమయాభాం వంటి పరిమితుల వల్ల ఔత్సాహికుల భావ వ్యక్తీకరణకు అండగా నిలువటంలో విఫలత చెందాయి.ఆ సమయంలో అంతర్జాల మాద్యమం ఔత్సాహికులను ఆకర్షించి తద్వారా భావ వ్యక్తీకరణ సులభమై న  కారణంగా  యీ అంతర్జాల భావ వ్యక్తీ కరణా రీతులు తెలుగు భాషాభివృద్ధికి  అద్భుత రీతిలో  విజయాల బాటను పరిచాయి  .
 తప్పో, ఒప్పో మాత్రు భాషలో  తనకు తాను , తమకు తాము, తమను తాము, తమ ఆలోచనలను,భావాలను తన భాషలో  నియంత్రణా రహితం గా వ్యక్తపరుచుకొంటున్న,తెలుగు బ్లాగర్లు, తదితర అంతర్జాల తెలుగు భాషోద్యమ కారులు    ప్రపంచంతో పంచుకొనే  అవకాశా న్నందించిన అంతర్జాల పరిజ్ఞానానికి, శాస్త్రజ్ఞులకూ యీ తరుణం లో  కృతజ్ఞతల నందించవలసిన  అవసరం  వుంది.
తప్పొప్పులు సర్దిద్దుకోవడం అంత క్లిష్టతర ప్రక్రియ కాకపోవచ్చు.ఉత్సాహంగా ముందుకు వచ్చి తెలుగులో భావ వ్యక్తీకరణ చేస్తున్నవారిని ప్రోత్సహిచడం అత్యంత  అత్యవసర చర్య.
 యీ పరిజ్ఞానం అంది వచ్చినదాది తెలుగు భాషలో భావ వ్యక్తీకర్ణ ణా   రీతులు తీరులు వృద్ధి చెంది, కొన ఊపిరిలో వున్న భాషకు ఊపిరులూదాయి. తెలుగులో అక్షరాలు వ్రాయడం రాని వారుకూడా
అంతర్జాలంలో తెలుగు అక్షరాలలో భావ వ్యక్తీకరణ చేస్తూ .తెలుగుపై అభిమానాన్ని వ్యక్త పరుస్తున్నారు.. వారిని అభినందించండి .ప్రోత్సహించండి. తొలుత వారిలోని భావ తృష్ణను వెలికి పొంగనీయండి . భాషా విషయకంగా  పొరబాట్లు వుంటే ఆ తదుపరి సరిదిద్దండి .
పత్రికా ,ప్రింటు మీడియాలలో వచ్చేవే ప్రామాణికాలు అన్న భావనలకు స్వస్తి చెప్పి అంతర్జాలోద్భవ భావ వీచికలకు  వున్నత ప్రమాణాలనద్దవలసిన,ఆ  స్థాయికి చేర్చవలసిన భాద్యత , ప్రస్తుత కాలంలో భాషా నిష్ణాతులమని చెప్పుకొనే వారి పైన ,భాషా నిష్ణాతులుగా పేరొందిన వారి  పైననే వుంది.
వారి రచనలలోని ప్రామాణికతా   లోపాలు,సరి చేసుకో గలిగే సూచనలు , వివిధ సాహితీ ప్రక్రియల  రీతులు తీరులు, వివరించడం  కొఱకు సాహితీ రంగంలో నిష్ణాతులు కొందరైనా  ముందుకు వచ్చి యువ సాహితీ వేత్తలకు ఆయా సాహితీ ప్రక్రియలలో అవగాహన, నేర్పు, పెంపొందించేలా  సహకారం అందించడం  కొఱకు, తమ సమయం విద్వత్తు వినియోగించ వలసిన అవసరం ఎంతో వుంది. అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేరేవ్వరూ. అర్ధం చేసుకోగలరు.
 .అంతర్జాలంలో   తెలుగు భాషలో వినూత్న రీతులలో  భావ విన్యాసాలు నర్తిస్తున్నందున ,
వికృత పోకడలకు  తావీయని  రీతిలో ,నియత్రిణా వ్యూహంతో అడ్డుకోగల   మార్గనిర్దేశి కతా  యంత్రాంగాన్ని  నిర్మించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. …శుభం

ముచ్చటైన దృశ్యం…. అమ్మ నైజం

రచన: నూతక్కిరాఘవేంద్ర రావు.

తేది:11-04-2011

ఆ దృశ్యం

ఎంతటి అపురూపం

పుట్టిన తక్షణమే

పడిలేస్తూ లేగదూడ

పిగిలిన గ్రుడ్డు నుండి వెలికి వచ్చి

బుడి బుడి గా నడవాలని పక్షి పిల్ల

మాత్రు గర్భకుహరాన్ని

చేదించుక బయల్వెడలి

నడయాడలేని అసహాయత న

మానవ జీవి

దృశ్యా దృశ్య ప్రపంచంలో

భువిపై పడీ పడుతూ పడిలేస్తూ

అమ్మ చను మొనలు వెదుకుతూ

ఒక జీవి

అమ్మ నోట ఆహారం అందుకోను

మరో జీవి నోళ్ళు తెరిచి ఆబగా

ఆత్రపడుతున్న దృశ్యం

అదేమిటో ప్రకృతి వైచిత్రి

తన సంతతికై తపనపడే

అమ్మ అమ్మేఎక్కడైనా

యీ జగతిన

ఆప్యాయంగా అక్కున

చేర్చుకొంటూ

ఆహారాన్నందిస్తూ

సంతతి సంరక్షణలో

అమ్మ నైజం .

మేను మరచిన క్షణం.
రచన :నూతక్కిరాఘవేంద్ర రావు
ఓ  రోజు  ఆ  ‘జూ’ లో
 జీవజాల  మనో భావ
 విన్యాసాల
ఉరవడిలో

తడబడి
చేష్ట లుడిగి నిశ్చేష్ట తలో
అన్నీ మరిచా
భాషను మరచా
భావం మరిచా
భాద్యత మరచా
మమతలు మరిచా
కోపం దుఃఖమ్
 వేదన
రోదన
మరిచా
అంతెందుకు
నను నేనే మరిచా
వ్యక్తావ్యక్త యోచనలు
నా మస్తిష్కార్ణ వపు
లోలోతులపోరలనుండి
వినబడుతూ
 కేరింతల రవళులు.

తర్వాత పేజీ »