ముచ్చటైన దృశ్యం…. అమ్మ నైజం

రచన: నూతక్కిరాఘవేంద్ర రావు.

తేది:11-04-2011

ఆ దృశ్యం

ఎంతటి అపురూపం

పుట్టిన తక్షణమే

పడిలేస్తూ లేగదూడ

పిగిలిన గ్రుడ్డు నుండి వెలికి వచ్చి

బుడి బుడి గా నడవాలని పక్షి పిల్ల

మాత్రు గర్భకుహరాన్ని

చేదించుక బయల్వెడలి

నడయాడలేని అసహాయత న

మానవ జీవి

దృశ్యా దృశ్య ప్రపంచంలో

భువిపై పడీ పడుతూ పడిలేస్తూ

అమ్మ చను మొనలు వెదుకుతూ

ఒక జీవి

అమ్మ నోట ఆహారం అందుకోను

మరో జీవి నోళ్ళు తెరిచి ఆబగా

ఆత్రపడుతున్న దృశ్యం

అదేమిటో ప్రకృతి వైచిత్రి

తన సంతతికై తపనపడే

అమ్మ అమ్మేఎక్కడైనా

యీ జగతిన

ఆప్యాయంగా అక్కున

చేర్చుకొంటూ

ఆహారాన్నందిస్తూ

సంతతి సంరక్షణలో

అమ్మ నైజం .