బాన సగం కారుతున్నా ..

రచన:నూతక్కి

నాటి రైతు కష్టజీవి

తోడుగా జోడెడ్లతో

అనుకున్నదే ధ్యేయంగా …

యెద్దులు గిత్తలు ఆవులు

బర్రెలు పెయ్యలు బుజ్జాయిలు

పశు సంతతి సంతతిలా

ఆస్తిలా కాపాడుకొంటూ …

పాడి పంట సౌభాగ్యం

సంతుష్ట జీవనం

ఉన్నంతన

ఉత్కృష్టమైన భావనం…

ఆకాలానికి యీ కాలానికి

నాటికీ ఈనాటికీ

వారధుల్లా

జ్ఞాపకాల మధురిమల ఝరిలో

మోట బావి ,మోటబాన ,

మోట మోకు ,మోట గిలక ,

వేటికవే ప్రత్యేకతలు

కరెంటు లేకున్నా

పదేకరాలైనా పారించిన ఆ రోజులు

బాన సగం కారుతున్నా ….