ఏప్రిల్ 2011


స్వయంభావ వైరుధ్యాలు …

నూతక్కి.

స్వయంభావ వైరుధ్యాలు …

ద్వంద్వ వైఖరులు ….

చెప్పేది శ్రీరంగ నీతులు

చేరేది సరసుల చెంతన .

చెప్పేందుకు ఓ తీరు న .

తన వరకూ వస్తే మరో భావన

తరాల అంతరాలు పెరుగుతున్నాయ్

మానవ అంతరంగాలు కుంచించుకు పోతున్నాయ్

.వుమ్మడి కుటుంబ జీవన వ్యవస్థ కూలిపోయిన

యీ తరుణంలో విలువలు నైతిక వర్తనలు

బాల్యం నుండి

భద్రంగా తరువాతి తరానికి అందించే వ్యవస్థ

స్చ్చిద్రమై

అమ్మమ్మలు అందించే నీతి కధల

సారాంశంతో

సమాజం నిలబడింది యింత కాలం

వీలయితే పునర్మిద్దాం

వుమ్మడి కుటుంబ జీవన భవనం

అవసర మైతే తద్భవన నిర్మాణానికి

రాళ్ళే త్తే కూలీలౌదాం.

అబ్బురం
: నూతక్కి

స్టార్ ప్లస్ టివి  వారి స్టార్ పరివార్ అవార్డుల ఉరవడిలో అభినందయనీయమైన  ఓ నవ్య  రీతి . హీరో, హీరోయిన్ డైరెక్టర్, వగైరాలే కాకుండా ….ఫేవరేట్ పతి,ఫేవరేట్ పత్ని,ఫేవరేట్ సాస్ ,ఫేవరేట్ బహు ,వగైరా కధా బంధుత్వ  బంధన సంబధాల పాత్ర  ల ప్రాముఖ్యతకు బడయు  పాత్రత నందించే    రీతిన ….నటీ నటులకు ప్రోత్సాహాన్నందించే తీరు …అబ్బురపరచింది…..నూతక్కి రాఘవేంద్ర రావు.

అన్నాజీ!
రచన : నూతక్కి
అవునూ అన్నాజీ !
తర తరాల అనైతికతలో
విషతుల్యమై భరత జాతి
మీ ఉద్యమంతో
భరత భవిత
నీతి భరితమైతే
అలవాటై న
విష వా యువులందక
జాతి
ఊపిరాడక చావదా?
శ్రీ ఖరనామ ఉగాది శుభాకాంక్షలు.
రచన :నూతక్కి.తేదీ :03-04-2011

ప్రపంచ వ్యాప్త తెలుగులకు

శ్రీ ఖరనామ ఉగాది
శుభాకాంక్షలు.
యీ నూతన ఉగాది
సకల ప్రపంచ వ్యాప్త
తెలుగులకూ
సర్వ మానవాళికీ
సకల జీవరాసికీ
సకల శుభాలు అందించాలని
నా యీ శుభాకాంక్షలు
శుభాభినందనలు.
శుభాభివందనములు
యీ నూతన శ్రీ ఖర నామ ఉగాది
ఆకలి దప్పిక రోగ
ఆందోళనా
ఆక్రందనాభావ
రహితమై
భద్రతానంద
ఆరోగ్య భరిత
విద్యా విజ్ఞాన
హిత సహిత మై
నిరంతరయుద్ధ,
మతోన్మాద
ఉగ్ర వాద,
తీవ్రవాద
వేర్పాటువాద
వుద్యమ
రచనా నచణ
విధ్వంసభయ
భావ రహిత మై
వృద్ధ మహిళా
బాలవర్గ శ్రేయో
సంక్షేమ భరిత
వ్యవస్థ
ధనవంతులు
నిరుపేద లు
వ్యత్యాసాల
అంతరాలు
తొలిగి
ప్రేమ సహోదర
భావనలు వెలిగి
మానవ జీవనావసర
ఆహార ,వస్తోత్పత్తి
కూడు గూడు గుడ్డ
సమృద్ధి సాధించి
ప్రకృతి విరచిస్తున్న
వికృతాలు లేని
మానవ స్వయం కృత
విధ్వంసాలు లేని
మహదానందమయమైన
మనిషి మనిషిని
దోచుకోని వ్యవస్థ ను
అందిమ్మని వెడుతున్నా …
నూతన సంవత్సరంగా
యీ
క్రొంగ్రొత్త  శ్రీ ఖర నామ వత్సరం
మీ అందరి నీ అలరించాలని
ఓర్పు క్షమా కరుణ విచక్షణ
మీ అందరి డెందా ల నందు
అనుక్షణం నిలిపి  ఉంచాలని
ఆశిస్తూ ఆకాంక్షిస్తూ  ……
నిత్య శ్రేయోభిలాషి
నూతక్కి రాఘవేంద్ర రావు.
ఖరానికి ….
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
ఖరానికి
స్వాగాత మందిద్దామని
అనుకున్నా
వేప పూ   చేదుల సుగంధాలు
మామిడి  పిందెల వగరులు
జలదోద్భవ  లవణగుళికలు
ఎర్ర  మిరప   కారంతో
మదన బాణ రస ఝరితో
అడవిని  కాచిన చింత పులుపుతో
షడ్రుచులు మేళవించి
నే చేసిన
ఉగాది  పచ్చడితో ….
కుహుకుహుస్వరాల
కోయిలమ్మ గీతాలతో
ఏదీ! ఎక్కడా  కనబడదే!
మామిడి  పిందెల  జాడ ?
వేప పూ దేనియాల
సుగంధ సౌరభాలు
నీరూ, చెట్టు నీడా దొరకక
గొంతు పెగలక పాపం
వినబడదులె
కోయిల కుహు కుహు
రావ విభావరి
గతి తప్పిన కాల
ప్రభావాల
ప్రలోభంలో
ఆమని వచ్చిందన్న సంగతే మరచి
పూతపూయక ఆదమరచి న
వేప కన్నియ నేమనాలి
తెలుగుల మెదళ్ల
మొదళ్ళ లో ఇంకి పోయి
ఎండి పోయి నసితున్న
సహోదర భావన
పై రాష్ట్రాల స్వార్ధ సరళి తో
నిండుకున్న నదీమ తల్లుల
గర్భ కోశాలు
నీరందక ఎండిన చెరుకు పంట
జీవితాలకే తీపి లేదు
ఉగాది పచ్చడికి దక్కునా తీపి
ఆ తీపీ కార్పొరేటు సరుకై పొతే
ఆతీరుననే ఉప్పూ పులుపూ
అందుకే
అన్నీ కరువౌతున్న వేళ
ఉగాది పచ్చడీ
ఓ కార్పోరేట్ సరుకై
మాన్యులకు దక్క
సామాన్యునికి
అందదింక.
మాటల స్వాగతంతో
మాయ మాటలతో
కార్పొరేటు రీతిలో
ఉత్తుత్తి మాటల తో
స్వాగతిద్దాం
ఖరగానం
ఆస్వాదిద్దాం
వీలయితే మనందరమూ
స్వరం కలుపుతూ
ఖరాన్ని సాదరంగా ఆహ్వానిద్దాం

« గత పేజీ