మే 2011


జాతి సంస్కృతిలో  ..భాష ప్రాముఖ్యత .

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.

సమాజానికి సంస్క్రుతి ,సంప్రదాయాలు ,రెందు నిట్టాళ్ళ లాటివివైతె .నీతి,నైపుణ్యం , నిబద్ధత,ఆకాంక్ష అన్నవి నాలుగు మూల స్థంభాలు. యీ భూమి పై మానవుడు సుఖంగ బ్రతకడానికి ముఖ్యంగ కావలసినవి,తింటానికి తిండి,కట్టు కొనేందుకు బట్ట ,ఎండ, వానల నుంచి, జంతు జాలం నుంచి,రక్షణకై గూడు ,ఒకరి నుంచి ఒకరు అబిప్రాయాలు తెలుసుకొవడానికి  భాష అతి ముఖ్యమైనవి.

(మహొత్క్రుష్త మాత్రు భాషా నిధన కార్యక్రమానికి .. సుస్వాగతం ..అనే నా స్వీయ రచన నుండి .)

మూల స్థంభాలు

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

సమాజానికి సంస్క్రుతి ,సంప్రదాయాలు ,రెందు నిట్టాళ్ళ లాటివివైతె .నీతి,నైపున్యం, నిబధత,ఆకాంక్ష అన్నవి నాలుగు మూల స్థంభాలు.(మహొత్క్రుష్త మాత్రు భాషా నిధన కార్యక్రమానికి .. సుస్వాగతం ..అనే నా స్వీయ రచన నుండి .)

సంస్కృతీ దర్పణాలు.
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు

ఈ భూమి పై పుట్టిన ప్రతి మనిషి , మానవ సమాజంలొ పెరిగే ప్రతి వ్యక్తికి ఆ సమాజపు భాష ,తద్వారా జీవన ప్రక్రియలొ జీర్నిచుకుపొయిన సంప్రదాయాలు,సంస్క్రుతులు,అలవాటులు ,ఆ జాతి జీవన చరితకు నిలువెత్తు దర్పణాలు.

(“మహొత్క్రు ష్ట  భాషా నిధన కార్యక్రమానికి  సుస్వాగతం” ..అనే నా  స్వీయ రచన నుండి.)

దిగ్విజయం… తేదీ :29-05-2011 9-00 pm.

మరుగున పడిన మహాకవి స్వర్గీయ .శ్రీ  దుర్గానంద్ సాహిత్య కళా పీఠం వారు పునర్ముద్రించిన,

నాటి (1982) నవ్య విప్లవ సైద్ధాంతిక కవిత్వం పై నేటి “సృజనకర్త శంఖా రావం” గ్రంధావిష్కరణ సభ. కాప్రా గుట్టల్లో నినదించి దిగ్విజయమై ప్రపంచాన ప్రతిధ్వనించింది. దుర్గానంద్ కళా పీఠం (దుర్గానంద్ గారి కొమరులు,కవి రచయిత శ్రీ అంబికానంద్ గారి నిర్వహణలో,శ్రీ కిరణ్ బాబు గారి ఆధ్వర్యంలో  ) ,కోకిలం సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్తంగా GHMC,కాప్రా పట్టణంలోని డా,ఏ.ఎస్ .రావు నగర్ సీనియర్ సిటిజెన్స్ వేదికపై ,29-05-2011 సాయంత్రం 07-00 గంట . లకు నిర్వహించిన ఈ సభ, శ్రీ మరింగంటి రంగాచార్యులు (కోకిలం సాహితీ సాంస్కృతిక సంఘ ప్రధాన కార్యదర్శి ,సీనియర్ జర్నలిస్ట్) గారి ప్రార్ధనా గీతంతో ప్రారంభమైనది.

యీ కావ్యానికి ముందు మాట వ్రాసిన డా :దేవరాజు మహారాజు సభకు అద్యక్షత వహించారు. కావ్యపు లోలోతులను తరచి చూసిన … వారు ప్రసంగిస్తూ …దుర్గానంద్ ..సామాజిక ఆర్ధిక సూత్రాల సిద్ధాంత కర్తగా ఒక నిరంతర స్వాప్నికునిగా, ఒక మహా కవిగా ప్రస్తుతిస్తూ ,కాలం పొరల క్రింద అన్యాయంగా మగ్గిపోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కధా ఋషి శ్రీ మునిపల్లె రాజు గారు కావ్యాన్ని ఆవిష్కరించి ,తన ప్రసంగంలోనాటి తెనాలి నగర సాహితీ వైభవాన్ని వివరించి , శ్రీ దుర్గానంద్ గ్రంధాలలోని, ముఖ్యంగా ‘సృజన కర్త శంఖా రావం’ లో కవి నినదించిన ఆర్ధిక సామాజిక కోణాలను ప్రస్తుతించారు. శ్రీ సుధామ (ప్రముఖ సాహితీవేత్త ,వక్త, మన… ముఖ పుస్తక (FACE BOOK ) మిత్రులు … కావ్యం లోని కొన్ని కవితలను భావయుక్తంగా చదివి వినిపించి కవి హృదయాన్ని సభకు విశ దీకరించి యోగానంద్ గొప్ప దార్సకునిగా ప్రస్తుతించారు. . ప్రముఖ కవి,సాహితీవేత్త ,విమర్శకులు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారి విశ్లేషనాత్మక ప్రసంగం సభను అలరించింది. డా. వై కామేశ్వరి (సాహిత్య పరిశోధకురాలు) గారు దుర్గానంద్ గారి రచనలపై ప్రత్యేక పరిశోధనా పత్రాన్ని చదివారు.,శ్రీ డి .హనుమంత రావు గారు(అభ్యుదయ రచయిత) దుర్గానంద్ రచనలపై సవివివరమైన పరిశోధనాత్మక పత్రాన్ని చదివి సభకు ఆ పత్రాన్ని పంచి పెట్టారు.

చివరిగా శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు(కోశాధికారి ,కోకిలం) గారి వందన సమర్పణతో సభ ముగిసింది. ( రెండు గంటల పర్యంతం సదస్యులు ఎవరూ సభను వీడకుండా వుండటం గొప్ప విశేషం .) యీ సందర్భంగా సృజనకర్త శంఖా  రావం లోని కవితలు ….మచ్చుకు …కొంత ..కొంత

కరెన్సీ మీద ఒంటెలు పోయిస్తున్నా చిన్న పిల్లాడితో…..

రొచ్చు రూపాయలు మురికి కంపు కొడుతున్న మడ్డి కాగితాలు

వుచ్చకు నాని తడిచి పోతుంటే ఎన్నాళ్ళు దాచేది?

( యిలా కరెన్సీ మీద , ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ,నానాటికీ పెరుగుతున్న నల్ల దానానికి మూల కారణం కాగితం కరెన్సీ యే నని చుక పడతారాయన).

సామాజిక ఆర్ధిక విన్యాసాలపై మరో చోట …

తరతరాలు మా తాతలు ముత్తాతలు నాకేసిన

అరిటాకును పారేయకుండా దాచుక నన్నూ నాకమనీ

నాకుతున్న నా ఎంగిలి మెతుకులు ఎవరూ కాజేసుక పొవరని

పోకుండా కాగితాన రాసిరాసి నాకిచ్చారయ్యా!…….అని వాపోతారాయన .

జరిగిన క్షణం
విరిగిన మనసు
రచన …నూతక్కి.
జరిగిన క్షణం
తిరిగి రాదు
విరిగిన మనసు
అతుక్కోదు
నేర్పుతో
సహనంతో
మనసును
విరక్కుండా
చూడవచ్చు
కాని …
క్షణాన్ని
జరిగి పోకుండానూ
ఆపలేము
తిరిగి  వెనుకకు
తెచ్చుకోనూ లేము.
అభ్యర్థన
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

ఆకలిదప్పులు లేకుండా

ఎంతటి చలిని , వేడిమిని
వర్షపాతాన్ని ప్రకృతి వైపరీత్యాలను

తట్టుకొని మనిషి

జీవించగలిగే శా స్త్రపరిగ్నాన్ని
కనిపెట్టమనీ  ,..
ఖచ్చితంగా అరవై ఏళ్ళకు
స్విచ్ ఆఫ్ చేసినట్లు
ప్రాణం
తనకు తానుగా శరీరం నుంచి
తరలి పోయే పరిజ్ఞానానీ
కనిపెట్టాలని కోరుతున్నా
ఆ ప్రక్రియ జీవ పరిణామంగా
జీన్స్ లోనే ఇమిడి ఉండేలా
యంత్ర, రసాయన, ఆయుధ
అంతరిక్షయాన పరిశోధనలన్నీ
కట్టిపెట్టి  యీ పనిపైననే
దృష్టి పెట్టమని శాస్త్రజ్ఞులను వెడుతున్నా …
(షరా:చివరిగా ఓ మాట… మనిషికి మనిషి నుండి ,
ఎటువంటి, హాని, ప్రమాదం, ప్రాణాపాయం లేని విధంగా)

వాస్తవాలు,అదీ  ప్రేమతో కూడినతియ్యని మాటలు , చెప్పడానికి  జేబు నుండి  డబ్బు ఖర్చేమీ కాదు. కాబట్టి నిజాలు అదీ మధురమైన రీతిలో ప్రేమగా చెప్పండి.సమాజం లో మీ గౌరవం పెరుగుతుంది.

సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.

ఇతరుల విజయానికి  ఎంత ఉత్సాహాన్ని ప్రదర్సిస్తావో నీ స్వీయ విజయానికి అంతటి కృషి చేయి..లేకుంటే…. తనకు మాలిన దర్మము మొదటే  చెడిన…. అన్న సామెత   నిజం అవుతుంది…….సేకరణ :నూతక్కి.

హహ్హహా !స్వేచ్చా  నీవెక్కడ?
రచన: నూతక్కిరాఘవేంద్ర రావు 

ఏమిటో స్వేచ్చ లేకుండా పోతోంది
ఎక్కడా !
స్వేచ్చ గా   తెలిసిన ఒకే ఒక్క భాషలో
తెలుగు పై నున్న  తెగులుతో
చదివి వ్యాఖ్యానించి రాద్దామనుకున్నా
ఏదీ స్వేచ్చ ?
ఆంగ్లం రాసేవాళ్ళు ఆంగ్లమే చదివే వాళ్ళు
ఆంగ్లంలో వ్యాఖ్యానించే వాళ్ళు
అనువాదాల పేరుతొ తెలుగించ టమే  ఫాషనై
తెలుగు కోసమే తెలుగు పేరుతొ పుట్టిన
తెలుగు పుటల్లోనూ  ఆంగ్లమే వ్యకతమై
నా తెగులు 'సదివేతోల్లెవలు'
అయినా నాకెందుకీ  శోష
ఎందుకో  నాకు
అర్ధం కాదు యీ ఆడంబరాలు
ఎందుకో యీ భేషజాలు
అదేమంటే
తెలుగు  భాషా సుసంపన్నత కోసం
వేరే భాషలో  రాసుకుందాం కవితలు
హహ్హహా !

నీకు బాధ కలిగిందంటే అందుకు

నీ స్వీయ  స్వభావమే కారణం.

వేరెవరూ కారకులు  కారు . . .

నీ స్వభావాన్ని ప్రేమ మయంగానూ,

తియ్యన్దనంగానూ తీర్చి దిద్దుకో ,

నిన్ను అందరూ ప్రేమిస్తారు…..

.సేకరణ :నూతక్కి.

తర్వాత పేజీ »