మేడే సలాం

రచన : నూతక్కి.

కర్షక కార్మిక శ్రామికులారా

అందుకోండి నా మేడే సలాం

కర్షక భుక్తీ

శ్రామికయుక్తీ

కార్మిక శక్తీ

మరిగించిన గర్మ జలం

అందించిన ధర్మ ఫలం

కూడు గూడు గుడ్డ

అనుభవిస్తున్నాం

వారి ఒంటి పైన గుడ్డ

వుందొ లేదో

మా కక్కర లేదు

తల దాచుకోనేందుకు గూడు

వుందొ లేదో

మాకక్కర లేదు

కడుపుకింత కూడు

వుందొ లేదో

మాకక్కర లేదు

మా అక్కర తీరింది చాలు

అందుకోండి

యీ

ప్రపంచ కార్మిక

పర్వ దినాన

మేడే సలాం

మేమందించే శుభాకాంక్షలు

యీ కనీస వనరులు

నువు లేందే మా కందవు బాబు