హహ్హహా !స్వేచ్చా  నీవెక్కడ?
రచన: నూతక్కిరాఘవేంద్ర రావు 

ఏమిటో స్వేచ్చ లేకుండా పోతోంది
ఎక్కడా !
స్వేచ్చ గా   తెలిసిన ఒకే ఒక్క భాషలో
తెలుగు పై నున్న  తెగులుతో
చదివి వ్యాఖ్యానించి రాద్దామనుకున్నా
ఏదీ స్వేచ్చ ?
ఆంగ్లం రాసేవాళ్ళు ఆంగ్లమే చదివే వాళ్ళు
ఆంగ్లంలో వ్యాఖ్యానించే వాళ్ళు
అనువాదాల పేరుతొ తెలుగించ టమే  ఫాషనై
తెలుగు కోసమే తెలుగు పేరుతొ పుట్టిన
తెలుగు పుటల్లోనూ  ఆంగ్లమే వ్యకతమై
నా తెగులు 'సదివేతోల్లెవలు'
అయినా నాకెందుకీ  శోష
ఎందుకో  నాకు
అర్ధం కాదు యీ ఆడంబరాలు
ఎందుకో యీ భేషజాలు
అదేమంటే
తెలుగు  భాషా సుసంపన్నత కోసం
వేరే భాషలో  రాసుకుందాం కవితలు
హహ్హహా !