వాస్తవాలు,అదీ ప్రేమతో కూడినతియ్యని మాటలు , చెప్పడానికి జేబు నుండి డబ్బు ఖర్చేమీ కాదు. కాబట్టి నిజాలు అదీ మధురమైన రీతిలో ప్రేమగా చెప్పండి.సమాజం లో మీ గౌరవం పెరుగుతుంది.
సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.
మే 3, 2011
వాస్తవాలు,అదీ ప్రేమతో కూడినతియ్యని మాటలు , చెప్పడానికి జేబు నుండి డబ్బు ఖర్చేమీ కాదు. కాబట్టి నిజాలు అదీ మధురమైన రీతిలో ప్రేమగా చెప్పండి.సమాజం లో మీ గౌరవం పెరుగుతుంది.
సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.
మే 10, 2011 at 11:19 ఉద.
ఆత్మ అనగా ప్రతీ మనిషి లోనూ ఉండే భగవంతుని అంశ. కనుక దానికి కుల, మత, వర్గ, రూప బేధాలు ఉండవు. దీనినే “అంతరాత్మ” అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి, మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ-అన్యాయాలు, తప్పు-ఒప్పులను నిస్పక్షపాతంగా చెపుతూ, ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది.ఇది ఎప్పుడూ,మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగ, ధర్మాన్ని తెలియజెప్పే ఒక గొప్ప యోగిలాగ, మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది. మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది. అంతరాత్మ విషయంలో మానవులలో ఏవిధమైన తేడాలూ లేవు. ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశే కనుక.ఆయన ఒక్కడే కనుక. ఆయన నుండి వేరుపడి, వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేసించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలయితే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు. అది ఒక దివ్య శక్తి . ఈ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధలలో చెప్పేది. rathnam
మే 10, 2011 at 12:45 సా.
చాల సంతోషం రత్నం గారుయీ మంచి మాటలు నాకు అందించాలని భావించినందు,యీ విధంగా మన పరిచయానికి పునాది పడినందుకు. మీరు చెప్పినట్లు “మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది”.దానిని ‘విచక్షణ’ అని మనం పిలవ వచ్చా రత్నం గారూ?…శ్రేయోభిలాషి …నూతక్కి.
మే 10, 2011 at 12:45 సా.
చాల సంతోషం రత్నం గారుయీ మంచి మాటలు నాకు అందించాలని భావించినందు,యీ విధంగా మన పరిచయానికి పునాది పడినందుకు. మీరు చెప్పినట్లు “మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది”.దానిని ‘విచక్షణ’ అని మనం పిలవ వచ్చా రత్నం గారూ?…శ్రేయోభిలాషి …నూతక్కి.
డిసెంబర్ 29, 2011 at 5:28 సా.
THANK U. SIR
జనవరి 18, 2012 at 3:03 సా.
‘నేను’ తెలుసుకునేది ఆత్మజ్ఞానమా? నిజ జ్ఞానమా?…ఉన్నదేదో వుందనీ, దాని గురించి అనే్వషణ ఎందుకు? అంటారు.ఆధ్యాత్మిక చింతనలో వుండి కూడా ఆయన ‘చివరికి ఏమీ వుండదు, ఏమీ మిగలదు కీర్తి, శక్తులు, తపస్సు అన్నీ హుళక్కి’ అని ఒక శూన్యాన్ని ఆవిష్కరిస్తారు.
నన్ను నేను గమనించుకోవాలి అన్న శీర్షికలో అసూయ గురించి కొన్ని మాటలు చెప్పారు. ‘మనలో మనకు అసూయలెందుకో అర్ధంకాదు. కొందరికి నేనంటే పడదు…పుస్తకాలు రాస్తున్నానని చాలామందికి కడుపుమంట. వాళ్లు చెయ్యలేని పని మనం చేస్తే వాళ్లకేం బాధ. అసూయపడే వాళ్లంటే నాకు అసహ్యం’
యాభై పైగా ఆధ్యాత్మిక గ్రంథాలు రాసిన వ్యక్తి చెప్పిన మాటలివి. ‘కూసి కూసి బల్లి కుడితిలో పడిందని’ సామెత. రాగద్వేషాలు నిండిన ప్రపంచంనించే అతీత మానస స్థితికి మనల్ని తీసుకెళ్లేది ఆధ్యాత్మిక చింతన. మామూలు మనుషులకూ మహా మహా యోగులకూ ఏమీ భేదముండదని ఈ మాటలు చదివితే తెలుస్తుంది.
ఇంకా ఎన్నో ఆది భౌతిక, సైన్సు, యోగా తదితర విషయాల్ని చెబుతూ పోతారు. చివరి శీర్షిక ‘ప్రేయర్ అంటే…
‘ప్రేయర్ అంటే ఒక విధమైన శూన్య స్థితి. రమణ మహర్షిగారిది ప్రేయర్. సాయిబాబాది ప్రేయర్. వాళ్లు ఏం చేసారు? ఏమి చేసేవాళ్లు కాదు. శూన్యంలోకి చూస్తూ కూచునేవారు‘‘ అంటూః ఏమీ చేయని స్థితి ప్రార్ధన అంటూ దాన్ని ‘స్థిత ప్రజ్ఞ’గా చెప్పారు.
ఇట్లా ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సంచలనాలు కలిగిన గ్రంథమిది
జూలై 14, 2012 at 8:45 ఉద.
మనస్సు ఆత్మలో లయమైంది. అదే ఆత్మసాక్షాత్కారం.మనస్సు చంచలమైనది. పిచ్చికోతి వంటిది అంటారు. దాన్ని అదుపులో పెట్టుకుని దైవోన్ముఖం చెయ్యకుండా వదిలేస్తే భవ బంధాలలో చిక్కుకుని మా నవుని జీవితంలో నరకం సృష్టిస్తుంది
నిజతత్త్వాన్ని గ్రహించగలి గిన వాళ్లెంతమంది!’ అంటారు శ్రీరామ చంద్రుడు, శ్రీకృష్ణుడుకూడా బ్రహ్మజ్ఞానులైన మహర్షులవద్ద విద్య నభ్యసించినారే. వీర శివాజీ తన రాజ్యాన్ని గురువైన సమర్థ రామదాసు కర్పించి, గురుభక్తితో వారి ప్రతినిధిగా రాజ్య పాలన చేసేడు. కారణం ఏమిటి? జీవిత సాఫ ల్యానికి ఐహికాముష్మిక విద్యలు రెండూ అవస రమేనని గ్రహించేరు. ఈనాటి ప్రజలకు జీవ నోపాధి అయిన ధనార్జనమీద తప్ప జీవిత పర మార్థమైన ముక్తిపట్ల ఆసక్తి లేదు. నాటి దివ్యమైన భవ్యమైన భావాలను, మహోన్నతమైన భారతీయ సంస్కృతిని నేటి ప్రజలు విస్మరించేరు. ఇంతకంటే దౌర్భాగ్యమేముంటుంది
అక్టోబర్ 29, 2012 at 11:41 సా.
కాలం అందరినీ తన అవసరాల మేరకు తీర్చి దిద్దుకుంటుంది.ధన్యవాదాలు.
అక్టోబర్ 30, 2012 at 11:53 ఉద.
తనలోతాను గా ఆత్మను దర్శించాలి
తనలోతాను గా ఆత్మను చూడాలి అంటే చూచు కనులు వేరు ,చూపు వేరు చూపు లోన మరచి చూడు అన్నాడు .అప్పుడే దర్శనం అనేది సాధ్యం అవుతుంది
ఆత్మసత్యం ఒక్కటే నని నమ్మి ,దాని సర్వ వ్యాప్తిత్వాన్ని ఆవిష్క రించారు
తత్వమసి అన్నది చాన్దోగ్యోప నిషత్ సారాంశం .తత్ అంటే ఆది అని ,త్వం అంటే నీవు అని అసి అంటే అయి ఉన్నావు .అని దాని అర్ధం .అంటే ,అంతా ఒక్కటే ,పరబ్రహ్మ స్వరూపమే .అందులో ఆత్మ జ్ఞానం ,ప్రపంచ జ్ఞానం ,బ్రహ్మ జ్ఞానం కలిసి ఉన్నాయని శ్రీ అరవిందులు వివరించారు
అది అంటే తన్ను తాను తన సూక్ష్మచేతనశక్తి ద్వారా పరిణామం చెందించుకున్నది. అలా పరిణామం చెందినంత మాత్రాన బ్రహ్మం మొత్తంగా జీవాత్మలలోనూ, జగత్తులోనూ ఉండిపోదు. పరిణామం చెందినప్పటికీ పరబ్రహ్మంలో కించిత్తు తరుగు కూడా ఉండదు. అది యథాతథంగానే ఉండిపోతుంది. అది అనంతం. జీవజగత్తులుగా పరమాత్మ నియంత, నియామకుడు, శాసకుడు, పాలకుడు, తానే జీవజగత్తులుగా పరిణమించాడు కనుక అన్నిటికి అంతర్యామిగా ఉన్నాడు. అతడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వ శక్తిమంతుడు,
డిసెంబర్ 20, 2012 at 12:04 సా.
శరీర భాగాలు రక్తము, మాంసము, కొవ్వు మొదలగు జుగుప్సాకరమైన పదార్థ నిర్మితములే. వయసు మళ్ళగా, వృధ్యాపము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. ఈ శరీరము పుడమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత నిర్మితమై, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్పబడిన తోలు తిత్తి. దానిని ఆ పంచభూతములే కాక, రోగము, వృధ్యాపము కూడా నాశనము చేయగలవు. కనుక ఆ శరీరపు అందములు చూచి మోసపోయి, వానిని బడయవలననే ఆశా మోహముల నొందకుము. సప్త వ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్టనష్టాలు జెరిగినవి. కనుక, ఈ విషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గమునందు నడుద్దాము.
అక్టోబర్ 30, 2012 at 12:16 సా.
చాల సంతోషం నూతక్కి రాఘవేంద్ర రావు యీ విధంగా మన పరిచయానికి పునాది
బ్రహ్మజ్ఞానం
నీ కన్నులముందున్న సకల చరాచర జగత్తును సృష్టి యని పిలచుట పరిపాటియె కదా. సృష్టి అనగా ఏమి? అని ఆలోచించినట్లయిన సృష్టి అనగా సృష్టించబడినది అని తెలియుచున్నది. సృష్టించుట అనగా తయారు చేయుటయని వ్యవహరికముగ చెప్పుకొన వచ్చును. సృష్టించబడినది అనగా ఒకప్పుడు లేనిదియని, ఇప్పుడు సృష్టించబడినది అని స్పష్టమగుచున్నది. అనగా ఈ సృష్టి ఎల్లప్పుడు స్థిరముగ ఉండునది కాదని తెలియుచున్నది. అయిన ఈ సృష్టిని సృష్టించుటకు పూర్వము అనగా సృష్టిని తయారు చేయుటకు పూర్వము ఏమి ఉండెడిది? అను ప్రశ్న ఉదయించును. సృష్టికి పూర్వము సృష్టిని తయారు చేసిన వాడుండవలయును గదా. సృష్టికి పూర్వమున్నది కేవలం బ్రహ్మమే
తా. ఈ సృష్టి యంతయు సృష్టించబడక పూర్వము నామ రూపములు లేని, రెండవ వస్తువు లేని (అద్వితీయమైన) ఏకైక బ్రహ్మము మాత్రముండెడిది.
ఈ సర్వ ప్రపంచము సృష్టికి పూర్వమందు రెండవ వస్తువు లేనిదియు, నొక్కటే అయినదియు, నిర్వికారాఖండ స్వరూప మైనదియునగు సత్స్వరూపముగనే యుండెను. అనగా బ్రహ్మము మాత్రముండెడిది.
అయిన ఆ బ్రహ్మమెట్లుండును? దానిని గూర్చి, దాని లక్షణములను గూర్చి కొంత చర్చించు కొనవలయును.
బ్రహ్మము ఆకారములేని, కంటికి కనిపించని, రంగు, రుచి, వాసన లేని, పదార్థముకాని చైతన్య స్వరూపము. శక్తి స్వరూపము.
బ్రహ్మము ఇంద్రియ గోచరము కానిది. అనగా కన్నులకు కనబడదు. చెవులకు వినబడదు. నాలుకచే రుచి చూడబడదు.ముక్కుచే నాఘ్రాణించబడదు. పంచజ్ఞానేంద్రియములచేతను అనుభవించబడదు. దీనినే విశదముగ పరిశీలించిన వేఱొక విధముగ నిర్వచింపగలము. అది యెట్లన, బ్రహ్మమునకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తత్వములు లేవు. కావునబ్రహ్మము ఇంద్రియ గోచరము కానిది.
ఇచట శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తత్వములను గూర్చి కొంత విశదముగ పరిశీలించవలసి యున్నది. ఈ భౌతిక ప్రపంచములో ఏదేని ఒక వస్థువు యొక్కగాని, పదార్ఠము యొక్కగాని, జ్ఞానమును మనము పొందగలగాలంటే ఆ వస్థువునకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తత్వములుండవలెను. అనగా ఆ వస్థువు శబ్ద గుణం, స్పర్శ గుణం, రూప గుణం , రస గుణం , గంధగుణం కలిగి యుండలెను.
ఒక వస్తువును కంటితో చూచుట ద్వారా దాని యొక్క రూప గుణమును, చెవితో వినుట ద్వారా దాని యొక్క శబ్ద గుణమును,చర్మముతో తాకుట ద్వారా దానియొక్క స్పర్శ గుణమును, నాలుకతో రుచి చూచుట ద్వారా దానియొక్క రసగుణమును, ముక్కుతో వాసన చూచుట ద్వారా దాని యొక్క గంధ గుణమును మనము గ్రహించ గలుగు చున్నాము. అనగా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఒక వస్తువు యొక్క జ్ఞానమును పొందవలెనన్న ఆ వస్తువునకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తత్వములుండవలెనని స్పష్టమగుచున్నది.
బ్రహ్మము ఆకారములేని, కంటికి కనిపించని, రంగు, రుచి, వాసన లేని, పదార్థముకాని చైతన్య స్వరూపము. శక్తి స్వరూపము.బ్రహ్మము ఇంద్రియ గోచరము కానిది. అనగా కన్నులకు కనబడదు. చెవులకు వినబడదు. నాలుకచే రుచి చూడబడదు.ముక్కుచే నాఘ్రాణించబడదు. పంచజ్ఞానేంద్రియములచేతను అనుభవించబడదు. దీనినే విశదముగ పరిశీలించిన వేఱొక విధముగ నిర్వచింపగలము. అది యెట్లన, బ్రహ్మమునకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తత్వములు లేవు. కావునబ్రహ్మము ఇంద్రియ గోచరము కానిది.
డిసెంబర్ 20, 2012 at 12:05 సా.
బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్ధము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్ధములలో అన్నింటికన్న గొప్పదిఆత్మ చైతన్యము. ఈ ఆత్మచైతన్యమునే “చిత్, చిత్తము, జీవుడు, క్షేత్రజ్ఞుడు, శరీరి, దేహి, ఆత్మ” మొదలగు శబ్ధములచే పండితులు పిలుచుచున్నారు. ఆత్మ
చైతన్యము అన్నింటి కన్న గొప్పది అగుటకు కారణము జడ పదర్ధము చేయలేని కొన్ని పనులను ఆత్మచైతన్యము చేయుచున్నది. ఆత్మచైతన్యము చేయు పనిని బట్టి ఆ ఆత్మ
చైతన్యము వేరు వేరు పేరులను ధరించుచున్నది. ఆత్మచైతన్యము ఒక వస్తువును తెలియునప్పుడు, మరియు తెలిసిన వస్తువును గుర్తుకు తెచ్చుకున్నపుడు “చిత్తము” అనబడుచున్నది. “చితి సంజ్ఞానే స్మరణేచ” అని శాస్రము. అదే చైతన్యము ఒక విషయమును సంకల్పంచి ఇది సరియా, కాదా అని ఊగులాడినపుడు “మనస్సు” అని పిలువబడుచున్నది. “సంకల్ప, వికల్పాకం మనః” అని శాస్త్రం. అదే ఆత్మచైతన్యము ఒక విషయమును గురించి నిర్ణయము తీసుకున్నప్పుడు “బుద్ది” అని పిలువబడుచున్నది. “బుద్ధి రధ్యవ సాయాత్మికా” అని శాస్త్రము. అదే చైతన్యము “నేను నేను” అను స్ఫురణతో పని చేయునపుడు “అహంకారము” అనబడుచున్నది. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము అనబడు చైతన్యక్రియలే అంతఃకరణములు అనబడుచున్నవి. ఎట్లు ఒకే పరమాత్మ సృష్టి, స్ధితి, లయములు అను పనులను బట్టి బ్రహ్మ, విష్ణు, శివ నామాలను ధరించినాడో అట్లే ఒకే జీవుడు ఆయా పనులను బట్టి అంతఃకరణముల నామాలతో పిలువబడుచున్నాడు. ఈ జీవుడు లేక చైతన్యము జడము కన్నా ఎందుకు గొప్పది? జడము స్వాతంత్రియము లేక చేతనములగు ప్రాణుల అధీనములో ఉండుచున్నది.