అభ్యర్థన
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
ఆకలిదప్పులు లేకుండా
ఎంతటి చలిని , వేడిమిని
వర్షపాతాన్ని ప్రకృతి వైపరీత్యాలను
తట్టుకొని మనిషి
జీవించగలిగే శా స్త్రపరిగ్నాన్ని
కనిపెట్టమనీ ,..
ఖచ్చితంగా అరవై ఏళ్ళకు
స్విచ్ ఆఫ్ చేసినట్లు
ప్రాణం
తనకు తానుగా శరీరం నుంచి
తరలి పోయే పరిజ్ఞానానీ
కనిపెట్టాలని కోరుతున్నా
ఆ ప్రక్రియ జీవ పరిణామంగా
జీన్స్ లోనే ఇమిడి ఉండేలా
యంత్ర, రసాయన, ఆయుధ
అంతరిక్షయాన పరిశోధనలన్నీ
కట్టిపెట్టి యీ పనిపైననే
దృష్టి పెట్టమని శాస్త్రజ్ఞులను వెడుతున్నా …
(షరా:చివరిగా ఓ మాట… మనిషికి మనిషి నుండి ,
ఎటువంటి, హాని, ప్రమాదం, ప్రాణాపాయం లేని విధంగా)
మే 22, 2011 at 2:47 సా.
ఆవేదనతో కూడిన మీ కవిత తెలుగుదనంతో ఒప్పారుతూ హృద్యంగా ఉంది. కానీ దీనికి ఆంగ్లశీర్షిక దేనికి ?
మే 22, 2011 at 3:18 సా.
మీరు ..నాయీబ్లాగును వీక్షించి అభినందించినందుకు, అందించిన సూచనకు , ధన్యవాదాలు. . మీరన్నది వాస్తవమే .వినతి ,విజ్ఞప్తి, అనే పదాలు పరిశీలించాను కాని యిమడవనిపించింది. ఆ క్షణానికి అలా జరిగిపోయింది. ఆన్ లైన్లో వ్రాయడం ఆ క్ష ణంలో ఉద్భవించిన భావాలు వ్యక్తపరచడం శీర్షిక స్థిరీకరించడం కొన్ని నిముషాల్లో జరిగిపోయే వ్యవహారం. శీర్షిక కై యోచించే సమయం కేటాయించక పోవడం వల్ల ఫలితం యీ ఆంగ్ల శీర్షిక. అభినందనలతో …శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు…(గిజిగాడు).
మే 22, 2011 at 7:48 సా.
అభ్యర్థన సరిపోతుందేమో పరిశీలించండి.
మే 22, 2011 at 8:41 సా.
“అభ్యర్థన”…బాగుంది ఓబుల్ రెడ్డి గారు . నిజానికి యీ యోచన నాకు రాలేదు. మీ సూచనను స్వాగతిస్తున్నాను. శ్రేయోభిలాషి …నూతక్కిరాఘవేంద్ర రావు..
మే 22, 2011 at 10:14 సా.
మార్చేశాను చూడండి ఓబులరెడ్డి గారు….శ్రేయోభిలాషి ..నూతక్కి
మే 22, 2011 at 10:57 సా.
పెద్దలైన మీరు నా సూచనని సీరియస్గా పరిశీలించడం నా అదృష్టం. నెనర్లు.