అభ్యర్థన
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

ఆకలిదప్పులు లేకుండా

ఎంతటి చలిని , వేడిమిని
వర్షపాతాన్ని ప్రకృతి వైపరీత్యాలను

తట్టుకొని మనిషి

జీవించగలిగే శా స్త్రపరిగ్నాన్ని
కనిపెట్టమనీ  ,..
ఖచ్చితంగా అరవై ఏళ్ళకు
స్విచ్ ఆఫ్ చేసినట్లు
ప్రాణం
తనకు తానుగా శరీరం నుంచి
తరలి పోయే పరిజ్ఞానానీ
కనిపెట్టాలని కోరుతున్నా
ఆ ప్రక్రియ జీవ పరిణామంగా
జీన్స్ లోనే ఇమిడి ఉండేలా
యంత్ర, రసాయన, ఆయుధ
అంతరిక్షయాన పరిశోధనలన్నీ
కట్టిపెట్టి  యీ పనిపైననే
దృష్టి పెట్టమని శాస్త్రజ్ఞులను వెడుతున్నా …
(షరా:చివరిగా ఓ మాట… మనిషికి మనిషి నుండి ,
ఎటువంటి, హాని, ప్రమాదం, ప్రాణాపాయం లేని విధంగా)