జరిగిన క్షణం
విరిగిన మనసు
రచన …నూతక్కి.
జరిగిన క్షణం
తిరిగి రాదు
విరిగిన మనసు
అతుక్కోదు
నేర్పుతో
సహనంతో
మనసును
విరక్కుండా
చూడవచ్చు
కాని …
క్షణాన్ని
జరిగి పోకుండానూ
ఆపలేము
తిరిగి  వెనుకకు
తెచ్చుకోనూ లేము.