దిగ్విజయం… తేదీ :29-05-2011 9-00 pm.

మరుగున పడిన మహాకవి స్వర్గీయ .శ్రీ  దుర్గానంద్ సాహిత్య కళా పీఠం వారు పునర్ముద్రించిన,

నాటి (1982) నవ్య విప్లవ సైద్ధాంతిక కవిత్వం పై నేటి “సృజనకర్త శంఖా రావం” గ్రంధావిష్కరణ సభ. కాప్రా గుట్టల్లో నినదించి దిగ్విజయమై ప్రపంచాన ప్రతిధ్వనించింది. దుర్గానంద్ కళా పీఠం (దుర్గానంద్ గారి కొమరులు,కవి రచయిత శ్రీ అంబికానంద్ గారి నిర్వహణలో,శ్రీ కిరణ్ బాబు గారి ఆధ్వర్యంలో  ) ,కోకిలం సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్తంగా GHMC,కాప్రా పట్టణంలోని డా,ఏ.ఎస్ .రావు నగర్ సీనియర్ సిటిజెన్స్ వేదికపై ,29-05-2011 సాయంత్రం 07-00 గంట . లకు నిర్వహించిన ఈ సభ, శ్రీ మరింగంటి రంగాచార్యులు (కోకిలం సాహితీ సాంస్కృతిక సంఘ ప్రధాన కార్యదర్శి ,సీనియర్ జర్నలిస్ట్) గారి ప్రార్ధనా గీతంతో ప్రారంభమైనది.

యీ కావ్యానికి ముందు మాట వ్రాసిన డా :దేవరాజు మహారాజు సభకు అద్యక్షత వహించారు. కావ్యపు లోలోతులను తరచి చూసిన … వారు ప్రసంగిస్తూ …దుర్గానంద్ ..సామాజిక ఆర్ధిక సూత్రాల సిద్ధాంత కర్తగా ఒక నిరంతర స్వాప్నికునిగా, ఒక మహా కవిగా ప్రస్తుతిస్తూ ,కాలం పొరల క్రింద అన్యాయంగా మగ్గిపోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కధా ఋషి శ్రీ మునిపల్లె రాజు గారు కావ్యాన్ని ఆవిష్కరించి ,తన ప్రసంగంలోనాటి తెనాలి నగర సాహితీ వైభవాన్ని వివరించి , శ్రీ దుర్గానంద్ గ్రంధాలలోని, ముఖ్యంగా ‘సృజన కర్త శంఖా రావం’ లో కవి నినదించిన ఆర్ధిక సామాజిక కోణాలను ప్రస్తుతించారు. శ్రీ సుధామ (ప్రముఖ సాహితీవేత్త ,వక్త, మన… ముఖ పుస్తక (FACE BOOK ) మిత్రులు … కావ్యం లోని కొన్ని కవితలను భావయుక్తంగా చదివి వినిపించి కవి హృదయాన్ని సభకు విశ దీకరించి యోగానంద్ గొప్ప దార్సకునిగా ప్రస్తుతించారు. . ప్రముఖ కవి,సాహితీవేత్త ,విమర్శకులు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారి విశ్లేషనాత్మక ప్రసంగం సభను అలరించింది. డా. వై కామేశ్వరి (సాహిత్య పరిశోధకురాలు) గారు దుర్గానంద్ గారి రచనలపై ప్రత్యేక పరిశోధనా పత్రాన్ని చదివారు.,శ్రీ డి .హనుమంత రావు గారు(అభ్యుదయ రచయిత) దుర్గానంద్ రచనలపై సవివివరమైన పరిశోధనాత్మక పత్రాన్ని చదివి సభకు ఆ పత్రాన్ని పంచి పెట్టారు.

చివరిగా శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు(కోశాధికారి ,కోకిలం) గారి వందన సమర్పణతో సభ ముగిసింది. ( రెండు గంటల పర్యంతం సదస్యులు ఎవరూ సభను వీడకుండా వుండటం గొప్ప విశేషం .) యీ సందర్భంగా సృజనకర్త శంఖా  రావం లోని కవితలు ….మచ్చుకు …కొంత ..కొంత

కరెన్సీ మీద ఒంటెలు పోయిస్తున్నా చిన్న పిల్లాడితో…..

రొచ్చు రూపాయలు మురికి కంపు కొడుతున్న మడ్డి కాగితాలు

వుచ్చకు నాని తడిచి పోతుంటే ఎన్నాళ్ళు దాచేది?

( యిలా కరెన్సీ మీద , ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ,నానాటికీ పెరుగుతున్న నల్ల దానానికి మూల కారణం కాగితం కరెన్సీ యే నని చుక పడతారాయన).

సామాజిక ఆర్ధిక విన్యాసాలపై మరో చోట …

తరతరాలు మా తాతలు ముత్తాతలు నాకేసిన

అరిటాకును పారేయకుండా దాచుక నన్నూ నాకమనీ

నాకుతున్న నా ఎంగిలి మెతుకులు ఎవరూ కాజేసుక పొవరని

పోకుండా కాగితాన రాసిరాసి నాకిచ్చారయ్యా!…….అని వాపోతారాయన .