జూన్ 2011


పిడక పొయ్యి ఎలికిదియ్యి

రచన :నూతక్కి. 

పుట్టినోని పేర బతికున్నోని పేర

ఒక్కొక్కడు మూడు మొక్కలు

తాడి తుమ్మ ఏప మరింకేదన్న గని

పెంచున్రింక తప్పది

బొగ్గుపోయ్యి ఎనికేనికి ఎలికి తియ్యున్రి

వూదుడు గొట్టం ఎడుందో ఎనుకున్రి

పొయ్యిల పిల్లిని లేపున్రి

పెండదేచ్చి పిడకల్కొట్టుర్రి

పెండ గావాల్నంటే బల్రు పెంచాలె

బల్రున్ని కాసుడు నేర్సుకోన్రి

పెండ దీసుడు ,కుడ్తి బెట్టుడు

గవన్ని అందరు నేర్వాలే

ప్యాకిన్గుకు గడ్డమ్మకుంట

గడ్డి ఆములేస్కుంట

గోదలకి మేతబెట్టాలి గద

వచ్చెడి దినాల్ల కరెంటున్డది

గ్యాసున్డది

గ్యాసునూనున్డది

పెట్టరోలున్డది

వున్న గని ధరలు ఆస్మాన్ల

గంద్కే గోబర్ గ్యాసు పొయ్యి బెట్టు.

కూడొండుక గింత తినాల్నంటే

నేజేప్పినయ్యన్ని జెయ్యక జస్తమ

వర్షా కాలపు అనిచ్చితి

రచన : నూతక్కి.

చిరు గాలుల సవ్వడి లో

చిగురుటాకుల సందడి

కుహు కుహు లు వదలి

కువ కువ ల రవళుల తో

కోయిలల హొయలు

అంబరాన ఏదో

సంబరంబరమనుకుంటా

వైవిధ్య వర్ణరంజిత మై న

పయ్యె దలు

సవరించుకొంటూ

మేఘ కన్నియల సందడి

అప్పుడప్పుడూ అక్కడక్కడా

ఆనంద భాష్పాలు రాలుస్తూ

పచ్చని అడవుల పై

చల్లని గాలులలో కరిగి

తమ్ము తాము సమర్పించుకున్దామని

పండుగ చేసుకుందామని….

ఎంత వెదికినా

ఉష్ణ వాహక కాంక్రీటు అరణ్యాలు దక్క

కానరాని వన సమూహాలు.

ఎటూ పాలు పోక అసహనంలో

మేఘ కన్నియలు

మడిసి. 
రచన: నూతక్కి.

సేప్పెతోడు జేబ్తనే  వుంటడు 

ఇనేతోడు ఇనుకుంటనే   వుంటడు   
చేసేతోడు జేస్తనే వుంటడు  . 
జరిగేడిది జరుగుతనే వుంటది. 
కాకుంటే
 అనుకొన్నద దేందో 
 అనుకున్న తీరు  
జరిగిందనుకో …
 దేవుని కొఱకు 
 గీ దేవుళ్ళా ట లుండయ్
గుళ్ళు ఉండ య్ మసీదులు చర్చీలూ 
గసువంటివి ఏవీ వుండ య్     
బాబాల కాడ కోట్లూ మూల గ య్ 
 మడిసే  ఆని కాడు
  దేవున్ననుకుంట డు గద   .
 

ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి కాదు కానీ అందరికీ.
రచన : నూతక్కి.

ఎవరినీ ఉద్దేశించి కాదు,కాని అనేకమంది యోచించ వలసిన విషయం.నిష్టూరంగా అనిపించినా…ఎఫ్ బి తెలుగు సాహితీ గ్రూపుల్లో , బ్లాగుల్లో భావ వ్యక్తీకరణల లోఉప్పొంగిన భావావేశం ఓ రకంగా అభినందించ తగ్గదే అయినా …పోను పోను కవితాత్మకతకు భంగం వాటిల్లినట్లు అనిపిస్తోంది కొన్ని కవితలలో .
అహో ఓహో అని కామెంట్లయితే పెట్టేస్తున్టాము. కొందరు నిష్ణాతులైన కవులు అని పిలవ దగ్గ వారు కూడా పది గ్రూపులకూ ఏదో వకటి పోస్టు చేయాలనే తపనలో భావుకతకు ,పదాల కూర్పుకు ,కవితా రూపానికి,వస్తువుకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనబడటం లేదు. అక్షరాలు పదాలుగా కూర్చి అసంబద్ధ భావాలను ఇమిడ్చి రాసినంత మాత్రాన అది కవిత్వమై పోదు.ఏ ఒక్కరి గూర్చి చెప్పడం లేదు. భావ వ్యక్తీకరణా విధానాలలో లోపిస్తున్న నాణ్యతా ప్రమాణాల నేపధ్యమే నా ఆవేదనకు కారణం.ప్రింటు మీడియాకు , విజువల్ మీడియాకు ఎడిటింగ్ వుంటుంది.కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు నిర్దేశించ బడి వుంటాయి. అక్కడ పరిమితులకు లోబడుతాము. ఇక్కడ పరిమితులు ,నియంత్రణలు వుండవు. అందు చేత అనంతమైన స్వేచ్చ. ఆ స్వేచ్చలో కొట్టుకు పోతోంది భావుకత, సాహిత్య ప్రమాణం.

అనేక మంది ఔత్సాహిక యువత…. మీలో అనేక మందికి ఏకలవ్య శిష్యులు .లబ్దప్రతిష్టులైన మీ నుండే నేర్చుకుంటారు. మీరు ఏది చేస్తే అది సబబుగా భావిస్తారు. మీ పొరబాట్లను ఒప్పులుగా భావిస్తూ తామూ ఆ రీతిన వ్రాస్తూ పోతూ భావితరానికి వక్ర భాష్యం చెబుతారు.తామూ కవులమని చంకలు గుద్డు కొంటూ వుంటారు. అందుకే మీరు వేసే ప్రతీ అడుగూ సవ్యమై భవ్యమై వుండాలి. అందుకే నా యీ వినతి. నేనేదో పుడుంగు గాడినని కాదు .తెలుగు భాషా ప్రేమికునిగా గత మూడున్నర ఏండ్లుగా తెలుగు మాధ్యమాన అంతర్జాలంలో వ్రాస్తున్న మీ కుటుంబ సభ్యునిగా చనువుతో వివరిస్తున్నా.

తెలుగు సాహిత్యంలో ఔత్సాహికులు ఏ ఏ రీతుల , ఏ ఏ ప్రక్రియలను ఎంచుకొని వ్రాసినా ఆయా రీతులలో నిష్ణాతులైనవారి మార్గ దర్శ కత్వం లో కొన్ని ప్రమాణాలు నిర్దేశించే మార్గ దర్శక వ్యవస్థ అంతర్జాల తెలుగు సాహితీ కూటములకు,బ్లాగులకూ కావాలి .
ఎక్కువ రాయాలనే తపనలో నాణ్యత కు అన్యాయం చేయవద్దని. తమను ఎందరో ఔత్సాహికులు ఆదర్శంగా తీసుకొంటున్నారు అన్న విషయాన్ని గుర్తు వుంచుకొని మెలగాలని, .వారికి మనం సవ్య మార్గం చూపించాలన్న భాద్యత గుర్తెరిగి వ్యవహరించాలని,.. యీ సాహితీ గ్రూపులవల్ల,బ్లాగులవల్ల ,అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని ముందుకురుకుతున్న యువతలో ఉప్పొంగుతున్న….. ,తెలుగులో వ్రాయాలన్నతపననూ,జిజ్ఞాసనూ,సాహిత్యాభిలాషనూ, మనమందరం ప్రోత్స హిస్తించాలి ,స్వాగతించాలి ….కాని ప్రమాణాలకు తిలోదకాలివ్వని రీతిలో ….. .ఆ భావనతో ఔత్సాహిక యువత మునుముందుకు సాగాలనీ విజయం సాధించాలనీ అర్ధిస్తూ …. .అన్యధా భావించవలదనీ ఆకాంక్షిస్తూ ….శ్రేయోభిలాషి …నూతక్కి.

తప్పు వ్యక్తిగతం కళ సామాజికం 
written / Raghavendra Nuttaki

“కళాకారుడు తప్పుచేస్తే
ఆ కళ నిలబడదు
అది కూడా చనిపోతుంది’ 
అన్న మాటల తో 
నేను ఏకీభవించలేను…

తప్పు వ్యక్తిగతం
కళ సామాజికం 
సామాజిక చరిత్రలు
కాల భాండాగారంలో 
కళలు గా నిక్షిప్తమై 
శాశ్వత ను పొందుతాయి
తద్వారా
కళాకారుడూ శాశ్వతంగా 
జీవించే ఉంటాడు 
అతనువ్యక్తిగతంగా 
చేసిన తప్పులతో సహా.
శ్రేయోభిలాషి …నూతక్కి.

నిజ జీవన చిత్రంలో కుక్షి

రచన: నూతక్కి

తర తరానికీ జీవన పోరాటం లో తేడా లెన్నున్నా,

పోరాటాలకు సిద్ధం పడే విధానాలలో వైవిధ్యాలు

ఎన్నో ఎన్నెన్నో

అయినా బ్రతుకు పోరాటం లో పరుగు లేని తరం లేదు

జీవితాన ఏదో కోల్పోయామన్న భావన

ప్రతీ తరంలో తరతరాలుగా వ్యక్తమౌతున్నా,

తీవ్రతలో ఎన్నెన్నో తేడాలు

వేగవంతమౌతూ ప్రపంచ జీవన సంవిధాన సమరం.

బాల్యం కోల్పోతున్నభావి తరం అంతరంగ సంవేదన

కు

ఇంటింటా యీ తరమూ అతీతం కాదన్నది వాస్తవం

అంతటికీ కారణం యీ భౌతిక కాయాన్ని

పరుగులు పెట్టిస్తున్న జానెడు కుక్షి

నిచ్చింతగా   నిరంతర  వ్యాసంగంలో తాను.

స్వీయ ధ్వంసరచన

రచన నూతక్కిరాఘవేంద్ర రావు.

 

విశ్రాంతి కొఱకు ఒకింత

ఒళ్ళు విరుచుకొంటే !….

అదే!

ఆశ్రిత జీవి మానవునికి

భయ భీకర భూ కంపం

నిడుపాటి ఊపిరులూది తే

వాయుగుండ విన్యాసం

జల ప్రళయ నృత్యం

కడపున తెమిలి

వాంతి చేసుకొంటే

అగ్ని పర్వత విస్ఫోటనం

అయినా మాత ధరిత్రి పై

అకృత్యాలు చేస్తూనే వున్నాడు.

భూ మాత తన ఆశ్రితుల రక్షణకై

నిర్మించుకున్న

ఆరక్షిత వలయాన్ని

ఆ ఓజోను పొరను

చేదిస్తూనే వున్నాడు

తన ఉనికికి ముప్పును తానే

ఆవిష్కరిస్తున్నాడు

సహనం
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

ఒంటి పై చీమ పాకితేనే
విల విల లాడే మానవుడు
వికృతంగా గెంతుతాడు.
ఆ చీమను నలిపి చంపి గాని
వదలడు
కాని
తన ఒంటిపైన చీమ కన్న అధముడు
తుచ్చ మానవుడు కలిగించే
ఘాతాలు, ఘాతుకాలు, అకృత్యాలు
భరించి సహిస్తూ సంరక్షిస్తూ
జీవులకు ఆహారం అందిస్తూ
సహనంగా ఓర్పుగా ప్రేమ భరిత సౌమ్య ధాత్రి