స్వీయ ధ్వంసరచన

రచన నూతక్కిరాఘవేంద్ర రావు.

 

విశ్రాంతి కొఱకు ఒకింత

ఒళ్ళు విరుచుకొంటే !….

అదే!

ఆశ్రిత జీవి మానవునికి

భయ భీకర భూ కంపం

నిడుపాటి ఊపిరులూది తే

వాయుగుండ విన్యాసం

జల ప్రళయ నృత్యం

కడపున తెమిలి

వాంతి చేసుకొంటే

అగ్ని పర్వత విస్ఫోటనం

అయినా మాత ధరిత్రి పై

అకృత్యాలు చేస్తూనే వున్నాడు.

భూ మాత తన ఆశ్రితుల రక్షణకై

నిర్మించుకున్న

ఆరక్షిత వలయాన్ని

ఆ ఓజోను పొరను

చేదిస్తూనే వున్నాడు

తన ఉనికికి ముప్పును తానే

ఆవిష్కరిస్తున్నాడు